Abuja
-
పెట్రోల్ బంక్ వద్ద పేలుడు.. 35మంది మృతి
అబుజా: ఉత్తర నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్‌లో ప్రమాదశాత్తూ గ్యాస్ ట్యాంకర్ పేలడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. అబుజాలోని లఫియా, మాకుర్ది మార్గంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తూ గ్యాస్ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ట్యాంకర్లో నుంచి గ్యాస్‌ను బంక్‌లోకి సరఫరా చేసే సమయంలో పేలుడు చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆత్మాహుతి దాడి: 25 మంది మృతి
అబూజా: నైజీరియా మైదుగురి పట్టణంలోని మసీదులో శనివారం ఆత్మహాతి దాడి జరిగింది. ఈ దాడిలో 25 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఆత్మాహుతి దాడికి యత్నించిన వ్యక్తి మసీదులోకి ప్రవేశించి... తనను తాను పేల్చివేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని చెప్పింది. మసీదులో ప్రార్థన ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుందని వారు వివరించారని పేర్కొంది. సంఘటన స్థలంలో 25 మందికిపైగా మృతదేహాలు వెలికితీసినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్నవారు తెలిపారని చెప్పింది. అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు అనే విషయాన్ని వెల్లడించేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారని మీడియా వెల్లడించింది. గత కొద్ది సంవత్సరాలుగా ఈశాన్య నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ విధ్వంసంలో వేలాది మంది మరణించిన సంగతి తెలిసిందే. -
నైజీరియాలో తీవ్రవాదుల దాడి: 35 మంది మృతి
నైజీరియాలోఈశాన్య రాష్ట్రమైన బోర్నోలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం 35 మంది మరణించారని మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సాగిర్ ముస వెల్లడించారని స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. బామా పట్టణంలోని మొబైల్ బేస్ క్యాంప్‌పై ఆదివారం బొకొ హరం సంస్థకు చెందిన తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారని పేర్కొంది. దాంతో పోలీసులు వెంటనే ఎదురుదాడికి దిగారు. దీంతో 17 మంది బొకొ హరం తీవ్రవాదులతోపాట ఓ పోలీసు మరణించారని చెప్పారు. ఆ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. అలాగే మౌలమ్ ఫటొరి ప్రాంతంలో నైజీరియా, చద్ద్ నుంచి వచ్చిన సైనికులతో ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్‌పై అదే సంస్థకు చెందిన తీవ్రవాదులు మెరుపుదాడికి దిగారని చెప్పారు. ఆ ఘటనలో ఓ సైనికుడితోపాటు 15 మంది బొకొ హరం తీవ్రవాదులు మరణించారని ముస తెలిపారు.