గ్యాస్ ట్యాంకర్ కిందపడి ఒక మహిళ మృతిచెందిన సంఘటన హైదరాబాద్‌లోని మౌలాలిలో జరిగింది. మౌలాలిలోని ఓ పెట్రోలు బంకు వద్ద గ్యాస్ ట్యాంకర్ రివర్స్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు చక్రాల కిందపడి మీణమ్మ(55) మృతి చెందింది.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మీణమ్మ మౌలాలీలోని హనుమాన్నగర్ నివాసి అని వారు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.