న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) నికర లాభం సగానికి పైగా క్షీణించింది. రూ. 4,838 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.21 లక్షల కోట్లకు తగ్గింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ. 7 తుది డివిడెండ్ ప్రకటించింది. రూ. 5 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనం.
పూర్తి సంవత్సరానికి రికార్డు లాభాలు..
పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ చరిత్రలోనే అత్యధిక లాభాలను ఐవోసీ ప్రకటించింది. రూ. 39,619 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇక ఆదాయం రూ. 9.41 లక్షల కోట్ల నుంచి రూ. 8.71 లక్షల కోట్లకు తగ్గింది. ముడి చమురు శుద్ధికి సంబంధించి ప్రతి బ్యారెల్‌పై వచ్చే స్థూల రిఫైనింగ్ మార్జిన్ 19.52 డాలర్ల నుంచి 12.05 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినా దేశీయంగా ఇంధనాల ధరలను తగ్గించకుండా దాదాపు రెండేళ్ల పాటు అదే స్థాయిలో కొనసాగించడమనేది ఐవోసీ వంటి కంపెనీలకు లాభించింది.
Comments
Please login to add a commentAdd a comment