ప్రతి క్లిక్‌లో కిక్కే ! | every click is a kick | Sakshi
Sakshi News home page

ప్రతి క్లిక్‌లో కిక్కే !

Published Sat, Jul 30 2016 11:12 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

ప్రతి క్లిక్‌లో కిక్కే ! - Sakshi

ప్రతి క్లిక్‌లో కిక్కే !

ఫొటో..ప్రాణం లేని చిత్రమే...కానీ అది చేసే విచిత్రాలు అనేకం. కొన్ని మదిని మీటుతాయ్‌. మరికొన్ని ఆశ్చర్య చికితులను చేస్తాయ్‌.భ్రాంతిలో ముంచెత్తుతాయ్‌..మత్తెక్కిస్తాయ్‌..మైమరపిస్తాయ్‌. ఇంతలా ఒక ఫొటోకు ఎన్నెన్నో అర్థాలు చెప్పొచ్చు. జనాలను ఇంతలా జనాలను కదిలించడమూ ఓ కళే. ఆ కళకు బానిసలు వీరంతా...వయస్సుతో సంబంధం...భాషా బేధం లేదు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆసక్తి ఉన్న ఫొటోగ్రాఫర్లు.  కేవలం ఫొటో గ్రాఫర్లేనా వీరంతా అంటే కానే కాదు. అందరూ వివిధ హోదాల్లో ఉన్నావారే. ఒకరు డాక్టర్‌..మరొకరు ఇంజినీర్‌..ఇంకొకరు బిజినెస్‌మెన్‌. ఇలా వీరంతా కలిసి ఏటా విశాఖ వస్తుంటారు. అందమైన మోడల్‌కు వినూత్న రీతిలో ఫొటోలు తీస్తూ ఆకాశమే హద్దుగా ఉప్పొంగిపోతారు.                                                          –పెదగంట్యాడ 
 
 ఢిల్లీలో బాగా పేరు, డబ్బు సంపాదించిన ఒక డాక్టర్, గోవాలో టింబర్‌ డిపోను సంతానానికి అప్పగించిన బిజినెస్‌ మ్యాన్, ముంబైలో ఇంజినీర్‌గా పని చేస్తూ సడెన్‌గా లాంగ్‌లీవ్‌ పెట్టిన ఛటర్జీ ఇలా వివిధ రాష్ట్రాల నుంచి కొంత మంది ప్రతి సంవత్సరం విశాఖకు వస్తారు.  అసలు విషయం ఏమిటంటే ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉండి, పని ఒత్తిడిలో  కుదరక వేర్వేరు రంగాల్లో స్థిరపడిపోయి మనసులో ఉన్న ఆసక్తిని ముసలితనం నుంచి బయటకు తీస్తున్నారు కొంత మంది ఓల్డ్‌ బ్యాచ్‌. కాస్త చైల్డిష్‌గా ఉన్నా ఇది అక్షరాల లక్షల విలువచేసే నిజం. ఎందుకంటే ఫొటోగ్రఫీ లైవ్‌ క్లాసులకు అటెండ్‌ అవ్వాలంటే దాదాపు లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మోడల్స్‌కు ఫొటోలు తీయడం అంత ఈజీ కాదు
   అందులోనూ మోడల్స్‌కు ఫొటోలు తియ్యడం అంత ఈజీ కాదు. దీనికి బోల్డంత ఎక్స్‌పీరియన్స్‌ కావాలి. ఫొటోగ్రఫీ రంగంలో బాగా అనుభవం ఉన్న అగర్వాల్‌ ఇమేజెస్‌ సంస్థకు యజమాని. బీకే అగర్వాల్‌ మోడల్‌ ఫొటోగ్రఫీలో నిష్ణాతుడు. 25 ఏళ్లుగా విశాఖ నుంచి ఎంతో మంది మోడల్స్‌ను ఫీల్డ్‌కు పరిచయం చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అందుకే ఇలా ఆసక్తి ఉండి ఫొటోగ్రఫీ నేర్చుకోవాలనుకునే వారికి ప్రతి సంవత్సరం క్లాసులు నిర్వహిస్తుంటారు. అయితే బయటి ప్రపంచానికి తెలియకుండా చాటుగా ఈ సెషన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మరోసారి ఈ సెషన్స్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు నెలలపాటు...
రెండు నెలల సమయం. అందులో ఎంత మంది సభ్యులు ఉండాలో ముందుగా నిర్ణయించుకుంటారు. ఎక్కడెక్కడ లొకేషన్స్‌ ఉన్నాయో ముందుగానే చూసుకుంటారు. అక్కడ పర్మిషన్స్, ఫ్లైట్‌ టికెట్లు, రూమ్‌లు, ఫుడ్‌ అన్ని ఎరేంజ్‌ చేసుకుని ప్లాన్‌ ప్రకారం ఫొటోగ్రఫీ క్లాసులు నిర్వహిస్తారు. ఇక్కడ ముఖ్యంగా అవసరమైన మనిషి మోడల్, చాలా మంది మోడల్స్‌ను పరీక్షించి ఒక మోడల్‌కు అవకాశం ఇస్తారు. విశాఖలో ప్రముఖ గెస్ట్‌ హౌస్‌లు, బీచ్‌లు, ఫామ్‌ హౌస్‌లు, సిమ్మింగ్‌ పూల్స్‌ ఇలా ఒకటేమిటి వంద లొకేషన్స్‌లో ఫొటోలు తియ్యడం నేర్చుకుంటారు. రోజులు 7 నుంచి 10 గంటల సమయం ఆలా ఫొటోలు తియ్యడం దానిని ఎడిట్‌ చెయ్యడం చూసుకోవడం సరిపోతుంది. ప్రొఫెషన్‌గా కాకుండా ప్యాషన్‌తో ఫొటోలు తియ్యడం వల్ల మానసిక ఉల్లాసం, కొత్త జీవితానుభవం ఏర్పడుతుందని అక్కడి వారి ఆలోచన. 
విశాఖలోనే ఎందుకంటే...
విశాఖలోనే ఎందుకు నేర్చుకుంటున్నారంటే వైజాగ్‌లో మంచి లొకేషన్లు ఉంటాయి. పర్మిషన్స్‌ కోసం పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి అండమాన్, మారిషస్, శ్రీలంక వంటి ప్రదేశాలను సులభంగా చేరుకోవచ్చు. అందుకే వైజాగ్‌నే ఎక్కువ మంది ఇష్టపడతారు. 
ఖర్చు మామూలుగా ఉండదు...
మంచి కెమేరా కొనాలంటే మినిమం రూ.70 వేలు ఉండాలి. ఫ్లైట్‌ టికెట్లు, ఇతర ఖర్చులతో కలిసి రెండు లక్షలు అవుతుంది. మోడల్‌ను అందరూ కలసి డబ్బులు వేసుకొని తీసుకురావాలి. ఇవి కాకుండా ఇతరత్రా చిల్లర ఖర్చులతో కలిíపి కనీసం మనిషికి ఐదు లక్షలు అవుతుంది. అయితే ఒక్క సారి ఫొటోగ్రఫీ నేర్చుకుంటే ఒక ఆల్బమ్‌కు లక్ష రూపాయలు తీసుకోవచ్చు. ఇదెవరూ డబ్బుల కోసం చెయ్యరు ప్యాషన్‌ మాత్రమే..
విద్య వచ్చాక ఆశించు
ఒక్కో లొకేషన్‌కు వెళ్లడానికి కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. కొండలు ఎక్కాలి, మంచి నీరు కూడా దొరకవు. అయినా సాయంత్రం వరకూ ఎలాంటి అలసట లేకుండా గడిపేస్తారు. దీనినే ప్యాషన్‌ అంటారు. లక్షలుంటే హాయిగా హోటల్‌లో పడుకోవచ్చు తినొచ్చు కాని.. నేర్చుకోవాలనే తపన అందరికీ రాదు. అందుకే ఫొటోగ్రఫీ నేర్చుకోవాలనుకునేవారికి నేనిచ్చే సలహా ఒక్కటే... ఆశించి రావచ్చు... విద్య వచ్చాక ఆశించు తప్పులేదు... 20 ఏళ్ల అనుభవం ఉన్న నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. 
–బీకే. అగర్వాల్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement