ఫోటో గ్రాఫర్‌ ఓవరాక్షన్‌.. వరుడి రియాక్షన్‌ | Photographer overaction,Bride reaction | Sakshi
Sakshi News home page

ఫోటో గ్రాఫర్‌ ఓవరాక్షన్‌.. వరుడి రియాక్షన్‌: వైరల్‌

Published Sat, Feb 6 2021 12:09 PM | Last Updated on Sat, Feb 6 2021 1:51 PM

Photographer overaction,Bride reaction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పుట్టినరోజు, పెళ్ళి..శుభకార్యమేదైనా, వేడుక ఏదైనా, సందర్బం ఏదైనా ఆ మధుర జ్ఞాపకాలను పదికాలాలపాటు పదిలపర్చుకునేందుకు ఫోటోలు, వీడియోలకు  ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మారుతున్న కాలానికనుగుణంగా ఫోటోగాఫర్లు తమని తాము అప్‌డేట్‌ చేసుకుంటున్నారు. వినూత్నంగా సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ, పలు టెక్నిక్‌లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇవి చాలావరకు ఆకర్షణీయంగానూ, ఆసక్తికరంగానూ ఉంటాయి కూడా. ముఖ్యంగా పెళ్ళిళ్లలో ఫోటోలు, వీడియోల సందడి లేని సందర్భాన్ని అస్సలు ఊహించలేం..అయితే రాను రాను ఈ ముచ్చట కాస్త.. వెర్రి తలలు వేస్తోంది. మరీ ఇంత అవసరమా అన్న అభిప్రాయం కలుగుతోంది. వేలంవెర్రి అంటూ విసుక్కున్న సందర్భాలు మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చి ఉంటాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజనులను కడుపుబ్బ నవ్విస్తోంది. ‘అతి సర్వత్రా వర్జయేత్‌’ అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 

ఒక పెళ్లి వేడుకలో ఫోటోగ్రాఫర్‌ మరీ అతి చేసి భంగపడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వరుడి రియాక్షన్‌ చూసి...వధువు పొట్ట పట్టుకుని  పగల బడి నవ్వుతుండటం హైలైట్‌.  మరి  ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియోను చూసి సరదాకా  నవ్వుకోండి..!!  ఈ వీకెండ్‌లో మాంచి టైం పాస్‌....

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement