
అవార్డు గెలుపొందిన వాటిల్లో ఒక చిత్రం
సాక్షి, అమరావతి: స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టులు పలు అవార్డులు గెలు పొందారు. స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో జి.వీరేశ్(అనంతపురం), కె.చక్రపాణి(విజయవాడ), ఎండీ.నవాజ్ (విశాఖపట్నం)కు కన్సులే షన్ బహుమతులు లభించాయి. వి.రూబెన్ బెసాలి యన్(విజయవాడ), వీరభగవాన్ తెలగా రెడ్డి (విజయవాడ), ఐ.సుబ్రమణ్యం (తిరుపతి), పి. విజయకృష్ణ (విజయవాడ), ఎం.వెంకట రమణ (గుంటూరు)లకు స్పాట్ న్యూస్, జనరల్ న్యూస్ విభాగాల్లో శ్యాప్ ఎచీవ్ మెంట్ అవార్డులు దక్కా యి. ఎన్.కిషోర్ (విజయవాడ), ఎం.మను విశా ల్ విజయవాడ)లకు ఎఫ్‌ఐసీ హానర్‌బుల్ మెన్షన్ అవార్డులు వరించాయి. తెలంగాణలో శివకోల్లొజు(యాదాద్రి)కు బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ఇయర్ అవార్డు లభించగా, ఎం.రవికుమార్ (హైదరాబా ద్), దశరథ్ రజ్వా (కొత్తగూడెం)కు స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో కన్సులేషన్ బహుమతి దక్కింది. గుంటుపల్లి స్వామి(కరీంనగర్)కు జన రల్ న్యూస్ విభాగం లో మారుతి రాజు మెమోరి యల్ అవార్డు లభించింది. వీరికి నవంబర్ 1న విజయవాడలో అవార్డులు ప్రదానం చేయనున్న ట్లు కాంటెస్ట్ చైర్మన్ టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment