spaap national photo contest
-
‘సాక్షి’ ఫొటో ఎడిటర్‌కి లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు
సాక్షి, అమరావతి: స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మూడో జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’ఫొటో ఎడిటర్ కె.రవికాంత్‌రెడ్డికి లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు లభించింది. ఆయనతో పాటు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ దండమూరి సీతారామ్, ఈనాడు దినపత్రిక సీనియర్ ఫొటోగ్రాఫర్ కేశవులు కూడా ఎంపికయ్యారు. 2018వ సంవత్సరానికి స్పాట్, జనరల్ న్యూస్, పర్యాటకం అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 18 రాష్ట్రాల నుంచి 1,890 ఫొటోలు ఎంట్రీలుగా నమోదయ్యాయి. ముంబైకి చెందిన ఫోర్బ్స్ పత్రిక చీఫ్ ఫొటోగ్రాఫర్ వికాస్ కోట్, ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.నాగేశ్వరరావు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చీఫ్ ఫొటోగ్రాఫర్ ఆర్బీ కోటేశ్వరరావులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ‘సాక్షి’ఫొటో జర్నలిస్ట్‌లకు పలు విభాగాల్లో అవార్డులు లభించాయి. బహుమతుల్ని నవంబర్ 1న విజయవాడ కల్చరల్ సెంటర్లో ప్రదానం చేస్తారని స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’కి అవార్డులు
సాక్షి, అమరావతి: స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టులు పలు అవార్డులు గెలు పొందారు. స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో జి.వీరేశ్(అనంతపురం), కె.చక్రపాణి(విజయవాడ), ఎండీ.నవాజ్ (విశాఖపట్నం)కు కన్సులే షన్ బహుమతులు లభించాయి. వి.రూబెన్ బెసాలి యన్(విజయవాడ), వీరభగవాన్ తెలగా రెడ్డి (విజయవాడ), ఐ.సుబ్రమణ్యం (తిరుపతి), పి. విజయకృష్ణ (విజయవాడ), ఎం.వెంకట రమణ (గుంటూరు)లకు స్పాట్ న్యూస్, జనరల్ న్యూస్ విభాగాల్లో శ్యాప్ ఎచీవ్ మెంట్ అవార్డులు దక్కా యి. ఎన్.కిషోర్ (విజయవాడ), ఎం.మను విశా ల్ విజయవాడ)లకు ఎఫ్ఐసీ హానర్‌బుల్ మెన్షన్ అవార్డులు వరించాయి. తెలంగాణలో శివకోల్లొజు(యాదాద్రి)కు బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ఇయర్ అవార్డు లభించగా, ఎం.రవికుమార్ (హైదరాబా ద్), దశరథ్ రజ్వా (కొత్తగూడెం)కు స్పాట్ న్యూస్ పిక్చర్ విభాగంలో కన్సులేషన్ బహుమతి దక్కింది. గుంటుపల్లి స్వామి(కరీంనగర్)కు జన రల్ న్యూస్ విభాగం లో మారుతి రాజు మెమోరి యల్ అవార్డు లభించింది. వీరికి నవంబర్ 1న విజయవాడలో అవార్డులు ప్రదానం చేయనున్న ట్లు కాంటెస్ట్ చైర్మన్ టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
'సాక్షి' ఫొటోగ్రాఫర్లకు బహుమతులు
ఆస్కార్ బర్నాక్ 137వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం (ఎస్‌పిఏఏపీ) జాతీయస్థాయిలో నిర్వహించిన ఫొటో పోటీలలో సాక్షి ఫొటోగ్రాఫర్లకు పలు బహుమతులు వచ్చాయి. మొత్తం ఆరుగురు ఫొటోగ్రాఫర్లు వివిధ విభాగాల్లో బహుమతులు పొందారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్‌పిఏఏపి అచీవ్మెంట్ అవార్డుల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఫొటోగ్రాఫర్ గరగ ప్రసాద్ తీసిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ మంటల ఫొటోకు, విజయవాడ ఫొటోగ్రాఫర్ రూబెన్ బెసాలియెల్ తీసిన ఆస్పత్రిలో నిర్లక్ష్యం ఫొటోకు, విజయవాడ ఫొటోగ్రాఫర్ తెలగారెడ్డి వీరభగవాన్ తీసిన మహిళల ఆగ్రహం ఫొటోకు బహుమతులు వచ్చాయి. ఉత్తమ ఆర్ట్ అండ్ కల్చరల్ పెర్ఫార్మెన్స్ విభాగంలో తిరుపతి ఫొటోగ్రాఫర్ ఇరుగు సుబ్రహ్మణ్యం తీసిన రౌద్రం ఫొటోకు బహుమతి వచ్చింది. తెలుగు రాష్ట్రాల ఫొటోగ్రాఫర్లకు స్పెషల్ అచీవ్మెంట్ విభాగంలో విశాఖపట్నం ఫొటోగ్రాఫర్ నవాజ్ మహ్మద్ తీసిన పోలీసు కాళ్లు మొక్కుతున్న మహిళ ఫొటోకు, కర్నూలు ఫొటోగ్రాఫర్ డి.హుస్సేన్ తీసిన పింఛను కోసం వృద్ధురాలి పాట్ల ఫొటోకు బహుమతులు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఫొటోగ్రాఫర్ గరగ ప్రసాద్ తీసిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ మంటల ఫొటో విజయవాడ ఫొటోగ్రాఫర్ రూబెన్ బెసాలియెల్ తీసిన ఆస్పత్రిలో నిర్లక్ష్యం ఫొటో విజయవాడ ఫొటోగ్రాఫర్ తెలగారెడ్డి వీరభగవాన్ తీసిన మహిళల ఆగ్రహం ఫొటో తిరుపతి ఫొటోగ్రాఫర్ ఇరుగు సుబ్రహ్మణ్యం తీసిన రౌద్రం ఫొటో విశాఖపట్నం ఫొటోగ్రాఫర్ నవాజ్ మహ్మద్ తీసిన పోలీసు కాళ్లు మొక్కుతున్న మహిళ ఫొటో కర్నూలు ఫొటోగ్రాఫర్ డి.హుస్సేన్ తీసిన పింఛను కోసం వృద్ధురాలి పాట్ల ఫొటో