
సెల్ఫీ విత్ ‘ఖాకీ’ కార్తీ..! (ఫొటో: రాదారపు రాజు; ఖమ్మం)

పార్టీ పండగలా మారింది..!! రంగుల బుగ్గలపై చిరునవ్వు పూసింది..! (ఫొటో: ఎస్‌ఎస్. టాకూర్, హైదరాబాద్)

గోమాతకు వందనాలు..! వాటి సంరక్షణలో శ్రీ విశ్వేషతీర్థ స్వామివార్లు..!! (ఫొటో: హుస్సేన్, కర్నూలు)

హలో మహా గణేశా..! ఖైరతాబాద్‌లోనే నువ్ హమేశా..!! (ఫొటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్)

సాహసం వద్దు బాస్..! మరో మార్గం చూడండి..!! (ఫొటో: విజయకృష్ణ, అమరావతి)

అన్నా..! ఇది ఆటో కాదే..! వారి జీవితాలతో ఆటలాడొద్దే..!! (ఫొటో: శివప్రసాద్, సంగారెడ్డి)

కారు మబ్బుల నీడలో.. కనక వర్ణంలో దుర్గమ్మ గుడి..! (ఫొటో: విజయకృష్ణ, అమరావతి)

టీడీపీ ‘మంటగలిసింది’. లేదు లేదు.. ‘తెలుగు మహిళలు’ ఫ్లెక్సీలకు నిప్పుబెట్టారు..!! (ఫొటో: మహ్మద్ రఫి, తిరుపతి)

నెమలి కన్నుల పాట ఆపండి..! చెవుల నెమలి అంటూ రాగం తీయండి..!! (ఫొటో: దయాకర్, హైదరాబాద్)

జర్రున జారే జలపాతపు జలాల్లో.. ఎంజాయ్‌లో మునిగిన యుంగ్ పీపుల్..!! (ఫొటో: అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్)

పసి మొగ్గలను బడికి పంపు తల్లి..! బలి చేయొద్దు..!! (ఫొటో: వీరేష్, అనంతపురం)

ఒక ప్రాణం గాల్లో కలిసినా..! కావుమనే కాకికి కూడు గొడవ తీరెనా..!! (ఫొటో: వీరేష్, అనంతపురం)

ఏదీ నిఘా..! నీటి నీడన ఏ ప్రమాదపు పడగ దాగుందో..!! (ఫొటో: సంపత్, భూపాలపల్లి)

పంట దండిగా పండినా.. రైతు కడుపు మండిన తీరిది..! (ఫొటో: మురళి, చిత్తూరు)

ఒక బాల్యం అమ్మ తోడుగా బడికి చేరువేళ..! మరో ప్రాయం పనికి పూనుకుంది..!! (ఫొటో: ఎంవీ. రమణ, గుంటూరు)

ప్రభుత్వం తలచుకుంటే..! రోగి అయినా తడిసి ముద్దవాల్సిందే..!! (ఫొటో: రాంగోపాల్ రెడ్డి, గుంటూరు)

కళలకు విరామం..! కాసేపు భోజనం కానిద్దాం..!! (ఫొటో: దేవేందర్, హైదరాబాద్)

నిండుకున్న గుంత కాదు. నడి రోడ్డుపై వెలసిన ‘జలసిరి’..!! (ఫొటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్)

ఎరుపు దళం ఎత్తింది బోనం..! ఈ పండుగంటే తెలంగాణకు పానం..!! (ఫొటో: మోహన్‌చారి, హైదరాబాద్)

ఈరగోలతో దూకేస్తా.. బోనంతో శివాలెత్తుతా...!! (ఫొటో: నాగరాజు, హైదరాబాద్)

అమ్మఒడి వెచ్చగా..! ఆక్టివా తోడుగా..!! (ఫొటో: నోముల రాజేష్‌రెడ్డి, హైదరాబాద్)

అంధులమయ్యాం..! ఆదరించి దయతలిస్తే ధన్యులమవుతాం..!! (ఫొటో: నోముల రాజేష్‌రెడ్డి, హైదరాబాద్)

బుజ్జాయి బొమ్మకై అమ్మ ఆరాటం..! బోసి నవ్వులతో పాపాయి దరహాసం..! (ఫొటో: ఎ.సురేష్‌కుమార్, హైదరాబాద్)

తల్లీ ఎల్లమ్మ కల్యాణం..! బల్కంపేటలో భక్తుల కోలాహలం..!! (ఫొటో: వీరాంజనేయులు, హైదరాబాద్)

ప్రభుత్వం కళ్లు తెరిపించాలే..! జోలె పట్టే స్థితి ఎందుకొచ్చిందే కనిపించాలే..!! (ఫొటో: శైలేందర్‌రెడ్డి, జగిత్యాల)

మసివాగులో మంత్రి తుమ్మల..! బురదలో ఇరుక్కునే ముప్పు లేదు కదా...!! (ఫొటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

పదునెక్కిన చెక్కతో పొంచిన ప్రమాదం..! అవసరం తీరడమే తక్షణ కర్తవ్యం..!! (ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు)

పోటీపడి పీక్కు తిన్నాయ్..! హరితాన్ని మొగ్గలోనే నోట్లో వేసుకున్నాయ్..!! (ఫొటో: మురళీమోహన్, మహబూబాబాద్)

వసతుల కల్పన అంటే ఇదేనా..! షేరింగ్‌తో సరిపెట్టడమేనా..!! (ఫొటో: అజీజ్, మచిలీపట్నం)

జోడెడ్ల కాడిపై జంట నాగళ్లు..!! పంట కాయాలి.. గుమ్మి నిండాలి.!! (ఫొటో: సుధాకర్, నాగర్‌కర్నూలు)

ముచ్చట్లలో మునిగారు..! ఎదురొచ్చే ప్రమాదానికి వెల్‌కం చెబుతూ..!! (ఫొటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)

అల్లేస్తాం..! దేశమేదైనా మీతో కలిసిపోతాం..!! (ఫొటో: కె.సతీష్, సిద్దిపేట)

జన నేత పుట్టిన రోజు.. అల్లాహ్ వరమిచ్చిన రోజు..!! (ఫొటో: యాకయ్య, సూర్యాపేట)

ఏడుకొండల వాడి సన్నిధిలో.. కుటుంబ సమేతంగా శ్రీనివాస్ రెడ్డి (ఫొటో: మోహన్‌కృష్ణ, తిరుమల)

అడవిలో దడపుట్టిస్తున్న ‘పులి రాజా’..! (ఫొటో: మహ్మద్ రఫి, తిరుపతి)

అంగన్‌వాడీలకు అవగాహన..! బురద నీటిలో ముందుకు సాగేనా..!! (ఫొటో: కిశోర్, విజయవాడ)

ఫోటోలు బాగానే ఉన్నాయ్..! ఆదమరిస్తే దండ పడుద్ది జాగ్రత్త..!! (ఫొటో: కిశోర్, విజయవాడ)

పోలీసుల జులుం నశించాలి..! ఉయ్యాలలూపడం ఆపాలి..!! (ఫొటో: రూబెన్, విజయవాడ)

ఓ యువతా మేలుకో..! ఫోటో లేనిదే జీవితమే లేదని గుర్తెట్టుకో..!! (ఫొటో: రూబెన్, విజయవాడ)

శ్రీమతి విశాఖ పోటీల్లో నిలిచే.. మహానటి ఎవరో..!! (ఫోటో: మోహన్‌రావు, విశాఖపట్నం)

తీజ్ పండుగలో పడచు అందాల ఫ్యాషన్..!! (ఫొటో: కొల్లోజు శివ, యాదాద్రి)

వాట్ యాన్ ఐడియా రైతన్నా..!! (ఫొటో: కొల్లోజు శివ, యాదాద్రి)