
క్లిక్.. క్లిక్
ఫొటోగ్రఫీలో ఎప్పటికప్పుడు మారుతున్న ఆధునిక పోకడలను తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది ‘ఫొటో ఎక్స్‌పో, బ్రాడ్‌కాస్ట్ అండ్ ఫిల్మ్ ఎక్స్‌పో’. షేక్‌పేట్ జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల ఎక్స్‌పోలో వందకు పైగా ఎగ్జిబిటర్స్ తమ బ్రాండ్స్ ప్రదర్శిస్తారు.
సోనీ, కేనన్, హెచ్‌పీ, ఎప్సన్, ఆపిల్, డెల్ తదితర పాపులర్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీటిపై అవగాహన కల్పించేందుకు సెమినార్లు కూడా నిర్వహిస్తున్నారు.
వేదిక: జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్, షేక్‌పేట్ సమయం: నేటి ఉదయం 11 గంటలకు.. ఈ నెల 20 వరకు ఎక్స్‌పో కొనసాగుతుంది.