
పర్యావరణ కాలుష్యం.. మానవాళి ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఇది ఒకటి ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన పర్యావరణ కాలుష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమే పర్యావరణ ఫోటోగ్రఫీ. పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యల్ని హైలైట్ చేయడమే కాకుండా, తమ కెమెరా పనితీరుతో పర్యావరణ సంరక్షణ గురించి అనుక్షణం గుర్తు చేస్తారు. అలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయ పర్యావరణ ఫోటోగ్రాఫర్ ఆప్ ది ఇయర్ విజేతలను ప్రకటించారు. చార్టర్డ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ (CIWEM) ఆద్వర్యంలో గత 16 ఏళ్లుగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు.

1. ఎన్విరాన్‌మెంటల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్: మౌరిజియో ది పెట్రో- తీసిన ఫోటో: బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫార్మింగ్

2. నికాన్ యంగ్ ఎన్విరాన్‌మెంటల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్: సోలేమాన్ హొస్సేన్, వరద ప్రభావిత ప్రాంతంపై ఫోటో

3. MPB విజన్ ఆఫ్ ది ఫ్యూచర్ విజేత- జాహిద్ అపు,తీసిన ఫోటో:వాక్ త్రూ ట్రాష్

4. రికవరింగ్ నేచర్ విజేత- నికోలస్ మారిన్, తీసిన ఫోటో- కోరల్స్ ఎట్ నైట్

5. అడాప్టింగ్ ఫర్ టుమారో విజేత- అనిర్భన్ దత్తా, తీసిన ఫోటో- కీటకాలపై ఫోటో

6. కీపింగ్1.5అలైవ్ విజేత: షఫియుల్ ఇస్లాం, తీసిన ఫోటో- కరువులో దున్నపోతుల మనుగడకు సంబంధించి