రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న జెడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్తదానం,ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు
- మానసిక వికలాంగుల కేంద్రంలో పండ్లు పంపిణీ
ఖమ్మం కల్చరల్ : నగరంలోని స్వర్ణభారతి కళ్యాణమండపంలో శుక్రవారం అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఫోటోగ్రఫీ జిల్లా కమిటీ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఏఎస్పీ సాయిక్రిష్ణలు హాజరరయి మాట్లాడుతూ తమ నైపుణ్యతను మారుతున్న కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దుకొని ముందుకు ఫోటోగ్రాఫర్లు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫోటోఎగ్జిబిషన్,రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. సుమారు వందమందికి పైగా ఫోటోగ్రాఫర్లు తమ రక్తదాన్ని దానం చేశారు.కార్యక్రమంలో సామాజిక వేత్త అన్నం శ్రీనివాసరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దేవర నాగరాజు, శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ పి. నాగేంద్రబాబు, శేషగిరి పాల్గొన్నారు.