
యాదగిరిగుట్ట : ఒక్కో గడ్డిపోచను నేర్పుతూ, పేర్చుతూ అందాల గూళ్లను పిచ్చుకలు అళ్లుతున్న తీరు అద్భుతం. వాటిది నేచురల్ ఇంజనీరింగ్. హోరుగాలికి, జోరువానకు సైతం తట్టుకునేలా గూడు కట్టుకుంటున్న వాటి నైపుణ్యం అబ్బురపర్చుతుంది. బంగారు వర్ణంలో తళతళలాడుతూ చూడముచ్చట గొలిపే ఈ పిచ్చుకలు గూళ్లు అళ్లుతున్న దృశ్యాలు యాదగిరిగుట్ట మండలం దాతా రుపల్లి, రాళ్లజనగాం గ్రామాల్లోన్ని వ్యవసాయ బావుల వద్ద కనిపించాయి. చూపరులకు కనువిందు చేస్తున్నాయి.


Comments
Please login to add a commentAdd a comment