వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఎంతో అభిమానం ఉందని.. దాని పంచాయతీ ఎన్నికల్లో గెలుపుగా చూపించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజగోపాల్ అన్నారు. నెల్లూరులో జరుగుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి కార్యకర్తా కృషిచేయాలని పిలుపునిచ్చారు. అధికార, ప్రతిపక్షాలు చేసే కుట్రలను సమర్ధవంతగా ఎదుర్కోలలన్నారు.