telugu media
-
రాజమౌళి ఆర్టిస్ట్‌లను ఎందుకు టార్చర్ పెడతారు?
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎలా ఆరంభం అయింది? ఆర్టిస్ట్‌లను రాజమౌళి ఎందుకు టార్చర్ పెడతారు? ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, సీత పాత్ర చేసిన ఆలియా భట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఏమన్నారు? ఆలియా తెలుగులో ఏం మాట్లాడారు? అసలు ‘ఆర్ఆర్ఆర్’ విశేషాలేంటి? వచ్చే జనవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా శనివారం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య మీడియా ముందుకొచ్చారు. ఎన్టీఆర్‌ని చరణ్ గిచ్చడం, చరణ్కన్నా తారక్ ఒక ఏడాది పెద్ద అని రాజమౌళి అంటే, ఇప్పుడు నా వయసు సంగతి ఎందుకు? అని ఎన్టీఆర్ చిరుకోపం ప్రదర్శించడం... ఇలా సరదాగా సాగిన ఈ సమావేశంలో ఎవరేమన్నారో తెలుసుకుందాం. ఇద్దరికీ ఒకేసారి కథ చెప్పా – రాజమౌళి ►ఒక రోజు తారక్, చరణ్‌లను మా ఇంటికి పిలిచాను. ‘మీ ఇద్దరితో సినిమా చేయాలనుకుంటున్నా’నని ‘ఆర్ఆర్ఆర్’ స్టోరీ అవుట్‌లైన్ చెప్పాను. విన్నాక చరణ్, తారక్‌ల ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. సినిమా చేద్దామనుకున్నాక మేం ముగ్గురం ఉన్న ఫోటోను షేర్ చేశాను. ►నేను స్టార్ వేల్యూ తెలిసిన డైరెక్టర్ని. స్టార్లను అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చినట్లు చూపిస్తూ ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాను. ప్రేక్షకులను స్టార్స్ థియేటర్లకి రప్పించగలరు. కానీ ఒక్కసారి థియేటర్స్‌లో సినిమా మొదలయ్యాక స్టార్స్ మాయమైపోతారు. కథే ఆ సినిమాను నడిపించాలని నమ్ముతాను. ‘ఆర్ఆర్ఆర్’కు ప్రేక్షకులను రప్పించడానికి స్టార్స్‌గా ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఉపయోగపడతారు. కానీ సినిమాలోని కథను, అందులోని పాత్రలను చూపించడానికి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లోని యాక్టర్స్ కావాలి నాకు. అలా ఎన్టీఆర్, చరణ్‌లోని యాక్టర్స్‌ను తీసుకుని ‘ఆర్ఆర్ఆర్’లో స్నేహాన్ని చూపించగలిగితే సినిమాను చూసేవారు కూడా వారి స్నేహానికి మాత్రమే స్పందిస్తారని, ఎన్టీఆర్, తారక్‌లను కాదని నమ్మి ఈ చిత్రం చేశాను. నా మనసులో అనుకున్నదాన్ని స్క్రీన్ పై తీసుకువచ్చేందుకు చాలా భయపడతాను... మదనపడతాను. విజువల్‌గా నేను ఊహించుకున్న అవుట్‌పుట్ కోసం నా సాంకేతిక నిపుణులను భయపెడతాను.. ఆర్టిస్టులను టార్చర్ పెడతాను. అదృష్టవశాత్తు నేనెంత టార్చర్ పెట్టినా, భయపెట్టినా.. వారు మనసులో నన్ను తిట్టుకున్నా నేననుకున్నది చేసి పెడుతున్నారు. ►‘ఆర్ఆర్ఆర్’ దేశభక్తికి సంబంధించిన సినిమా కాదు. దేశభక్తి అంతర్లీనంగా కనిపిస్తూ, స్నేçహాన్ని చూపించే కథ. బయోపిక్స్ తీస్తే వారికి సంబంధించిన కుటుంబసభ్యులను కలవాలి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ కథ 95 శాతం ఢిల్లీలో జరుగుతుంది. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది? అనే కల్పిత కథతో తీసిన సినిమా ఇది. అయితే కొమురం భీమ్ పాత్ర కోసం 1920లో ఆదిలాబాద్‌లో నివసించిన గోండు జాతివారి మానసిక స్థితి ఎలా ఉండేది? ఒకవేళ వారికి ఒక కాపరి ఉంటే అతను ఎలా ఉంటాడు? అతను సిటీకి వస్తే ఎలాంటి నడవడికతో ఉంటాడు? అని కసరత్తులు చేశాం. చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర గురించి కూడా పరిశోధన చేశాం. భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ముస్లిం యువకుడిగా ఎందుకు క్యాప్ పెట్టుకున్నాడనే విషయాన్ని సినిమాలో చూపిస్తాం. ►ఈ సినిమాలో రామ్, భీమ్ అనే రెండు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలకు నా కథ వర్కౌట్ అవ్వాలంటే హీరోలిద్దరి క్యారెక్టర్స్ పట్ల సమాన దృక్పథంతో ఉండాలి. ఈ ఇద్దరూ నవ్వితే ప్రేక్షకులూ నవ్వాలి.. ఏడిస్తే ఏడవాలి. అంతేకానీ తారక్‌కు ఎక్కువ ఫైట్స్ ఉన్నాయా? ఎన్టీఆర్‌కు ఎక్కువ ఫైట్స్ ఉన్నాయా? అని కాదు. అయితే వీటి గురించి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. కానీ ప్రేక్షకులు థియేటర్స్‌లో వీటి గురించి మర్చిపోతారనే అనుకుంటున్నాను. ‘ఆర్ఆర్ఆర్’లో రొమాన్స్ కన్నా.. బ్రోమాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇద్దరి స్నేహితుల అనుబంధాన్ని ఇలా కూడా తీయవచ్చా? అనేలా బ్రోమాన్స్ ఉంటుంది. ►స్వాతంత్య్ర సమరయోధులతో ‘నాటు నాటు’ పాటలో డ్యాన్స్ చేయించారనే విమర్శలు వస్తాయని ఊహించాను. కానీ ఇంతటి నాటు పాటలో కూడా ఎమోషన్ ఉంటుంది. ఈ పాటను థియే టర్స్‌లో చూసినప్పుడు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టుకున్న ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారన్న ఆలోచన ప్రేక్షకులకు రాదు. ►‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ‘దోస్తీ’ పాట రాశారు. కథ, అందులోని పాత్రలు, పాట వచ్చే సందర్భాలను వివరించినప్పుడే సిరివెన్నెల సీతారామశాస్త్రిగారితో పాట రాయించుకోగలం. ►తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో మాత్రమే ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ చెప్పారు. మిగతా భాషలు, విదేశీ భాషల్లో ఆ భాషల ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పారు. రాజమౌళిగారు కనిపించని టైగర్ – ఎన్టీఆర్ గోండ్లలో జన్మించిన వ్యక్తి జీవనశైలి, ప్రవర్తన, నడవడిక ఎలా ఉంటుంది? ఇవన్నీ రాజమౌళిగారు చెప్పారు. కొమురం భీమ్ పాత్రను అర్థం చేసుకోవడానికి ఆయన బాగా హెల్ప్ చేశారు. నేను కూడా మెంటల్‌గా, ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను. అన్ని సినిమాలకు కష్టపడతాను. కాకపోతే ఈ సినిమాకు కాస్త ఎక్కువగా కష్టపడ్డాను. ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో కనిపించని టైగర్ రాజమౌళిగారే. రాజమౌళి వంటి గొప్ప దర్శకుడు యాక్టర్స్‌గా మాకు గొప్ప హైప్ ఇస్తాడని కథను ఒప్పుకుంటాం. అంతేకానీ ఈ సినిమాతో ఇతర భాషల్లోకి కూడా వెళ్లొచ్చని ఆలోచించం. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందంటే అది బోనస్ మాత్రమే. ఈ సినిమా చేస్తున్న టైమ్‌లో మేం (రామ్‌చరణ్‌ని ఉద్దేశించి) ఫ్రెండ్స్ అవ్వలేదు... అంతకుముందే ఫ్రెండ్స్. అలా చేస్తే వంద మార్కులు పడ్డట్లే!– రామ్‌చరణ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్లో మూడు షేడ్స్ ఉన్నాయి. ప్రతి షేడ్‌కి కావాల్సిన భావోద్వేగాన్ని రాజమౌళిగారు స్క్రిప్ట్‌లో డిజైన్ చేశారు. సినిమా అంతా ఒకే ఫిజిక్ మెయిన్టైన్ చేయడానికి చాలా కష్టపడ్డాను. రాజమౌళిగారితో వర్క్ చేయడం ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన చెప్పింది యాక్టర్స్‌గా మేం చేస్తే అదే మాకు వంద మార్కులు. చిన్న చిన్న విభేదాలు వచ్చిన తర్వాత కూడా స్నేహం బలంగా ఉన్నప్పుడే అది నిజమైన స్నేహం అవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నాం కాబట్టి మేం (ఎన్టీఆర్‌ని ఉద్దేశించి) స్నేహితు లయ్యాం అని కాదు. ముందే ఫ్రెండ్స్. రాజమౌళిగారికి మేం చేసింది ఒక్కటే... స్క్రిప్ట్‌లో మా స్నేహాన్ని వెండితెరపై బాగా తీసుకురావడమే మేం చేసింది. మాకు పిచ్చెక్కిపోయింది – ఆలియా సౌత్ సినిమాల్లో నటించకూడదని ఏ బాలీవుడ్ హీరోయిన్ అనుకోదు. కథ నచ్చితే చేస్తారు. అలాగే నేను కూడా ‘ఆర్ఆర్ఆర్’లో భాగమయ్యాను. దక్షిణాది ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని నన్ను నేను చాలెంజ్ చేసుకున్నాను. ఎన్టీఆర్, చరణ్ లవ్లీ కో స్టార్స్. చాలా హెల్ప్ చేశారు. రాజమౌళిగారితో వర్క్ చేయడంతో నా కల నిజమైనట్లుంది. ఆయనతో మరో సినిమా చేయాలని ఉంది. అలాగే ఐ లవ్ ‘ఆర్ఆర్ఆర్’ (లవర్ రణ్‌బీర్ కపూర్‌ని ఉద్దేశించే ఆలియా ఇలా అన్నారని ఓ ఊహ). స్క్రిప్ట్ విన్నప్పుడు అందులోని కొన్ని భావాలను ఓ యాక్టర్‌గా కెమెరా ముందు చూపించడం అన్ని వేళలా కుదరదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ వల్ల ఈ విషయంలో నేను మెరుగయ్యాను. రాజమౌళిగారి సినిమాల్లో ఎమోషన్ స్ట్రాంగ్‌గా ఉంటుందని తెలుసుకున్నాను. కరోనా టైమ్‌లో తెలుగు భాష నేర్చుకోవడానికి జూమ్‌లో క్లాసులకు హాజరయ్యాను’’ అంటూ ‘‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ పగిలిపోయింది. ముంబైలో మాకు పిచ్చెక్కిపోయింది’’ అని తెలుగులో మాట్లాడి అలరించారు ఆలియా. -
కరోనాపై ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ చెప్పినట్టు జనతా కర్ఫ్యూ అందరూ పాటించారు. కరోనాను కట్టడి చేయగలమన్న నమ్మకం ఏర్పడింది. అయితే ఒక్కరోజుతో ఇది సాధ్యం కాదు. ఒక్క కేసు కూడా నమోదు కాని రోజు వరకు రోజూ జనతా కర్ఫ్యూలాగే పాటించాలి. వచ్చే 15 రోజులు చాలా ముఖ్యం. కేంద్రం, అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏదో పండుగలాగా షాపింగ్ చేస్తున్నారు. కరోనా వేగవంతంగా విస్తరిస్తున్న మహమ్మారి. కలసికట్టుగా అడ్డుకోకపోతే కష్టం. అందుకే వైరస్ తన శరీరంలోకి రాకుండా ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలి. కరోనా ఇటలీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలనే గజగజ వణికిస్తోంది. ఆ దేశాలే కరోనాను తట్టుకోలేకపోతున్నాయి. అటువంటిది అభివృద్ధి చెందుతున్న, మురికివాడలు, బస్తీలున్న మనలాంటి దేశంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నష్టం తప్పదు. ప్రభుత్వ అధికారుల సూచనలను తెలుగు ప్రజలు పాటించాలి..’అని కోరారు. ప్రభుత్వం సమాయత్తం: ‘ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 15,24,266 మంది ప్రయాణికులకు, భూభాగ సరిహద్దుల్లో 19 లక్షల మందికి స్క్రీనింగ్ చేశాం. 27,700 నమూనాలు పరీక్షించాం. 118 ల్యాబ్‌లు, 94,963 క్వారంటైన్ బెడ్స్ సిద్ధంచేశాం. 48 దేశాల నుంచి 2,040 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చాం. 107 ఇమిగ్రేషన్ సెంటర్లను క్లోజ్ చేశాం. కార్గో మినహా దేశీయ విమాన సర్వీసుల్ని మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిపివేశాం. 5 లక్షల ప్రొటెక్టివ్ కిట్స్, 10 లక్షల మాస్కులు సిద్ధం చేశాం. ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రులనూ కరోనాపై యుద్ధానికి సిద్ధం చేశాం. వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చాం..’అని తెలిపారు. ధరలు పెంచితే చర్యలు తప్పవు మాస్కులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా, దాచిపెట్టినా కఠినచర్యలు తప్పవని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘కరోనా కట్టడిలో భాగంగా రిలయన్స్ సంస్థ వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసింది. వెంటిలేటర్ల తయారీకి, పాజిటివ్ కేసుల చికిత్సకు తన రిసార్ట్స్‌ను ఇచ్చేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ముందుకొచ్చింది. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తెలుగు మీడియాకు కేంద్ర ప్రభుత్వం తరపున అభినందనలు. ఈ పరిస్థితిని మార్చి 31 తరువాత సమీక్షించుకోవాల్సి ఉంటుంది’ అని ఆయన వివరించారు. -
హిట్ అయితే హీరో ఫట్ అయితే మేమా?
ఇంటర్వ్యూ తెలుగు తెరపై తాప్సీ కనిపించి, రెండేళ్లయ్యింది. అనువాద చిత్రాల ద్వారా కనిపిస్తున్నారే కానీ, తెలుగులో స్ట్రయిట్ చిత్రాలు చేయడంలేదు. ఎందుకని? తెలుగు పరిశ్రమపై తాప్సీ అలిగారా? ఆమెనే అడిగి తెలుసుకుందాం... మీరు చాలా మారిపోయారండీ? అదేంటి అంత మాట అనేశారు! నేనెప్పటిలా ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నాను కదా! అలా అని కాదు. అప్పట్లో మీ మాటల్లో ఇంత దూకుడు కనిపించేది కాదు. ఇప్పుడు ఏమడిగినా టకీమని సమాధానాలొచ్చేస్తున్నాయ్? ఓహ్ అదా..? కాన్ఫిడెన్స్, ఎక్స్పీరియన్స్.. ఈ రెండూ ఉన్నవాళ్లు ఇలానే మాట్లాడతారు. ఒకప్పుడు నాకీ రెండూ నిల్. ఇప్పుడు ఫుల్. అందుకే ఇలా! ఫ్రెండ్లీగా ఉన్నా... తెలుగు పరిశ్రమపై కోపంగా ఉన్నారేమో అనిపిస్తోంది? వరుసగా తమిళ్, హిందీ సినిమాలు చేస్తున్నానని అలా అనుకుంటున్నారేమో? అలా ఏమీ లేదు. నన్ను కథానాయికను చేసిందే తెలుగు పరిశ్రమ. నేనెక్కువ సినిమాలు చేసింది కూడా ఇక్కడే. ఈ పరిశ్రమపై కోపం పెంచుకుంటే అంతకంటే అన్యాయం ఉండదు. కానీ, ఏదో విషయంలో మీరు ‘హర్ట్’ అయ్యారేమో అనిపిస్తోంది? నిజమే. రెండేళ్ల క్రితం వరకూ తెలుగు పరిశ్రమలో నా గురించి ఏమనేవారో తెలుసా? ‘తాప్సీ అన్‌లక్కీ. తను చేసే సినిమాలేవీ హిట్టవ్వవు’ అని. ఇప్పుడా ట్యాగ్ మారిందా? మారింది. ఏ వెబ్సైట్ అయితే ‘అన్‌లక్కీ’ అని నా మీద ముద్ర వేసిందో, అదే వెబ్సైట్ ‘తాప్సీ లక్కీ’ అని రాసింది. అంత సడెన్‌గా నేను ఎలా లక్కీ అయ్యానో నాకే అర్థం కాలేదు. హిందీలో ‘బేబీ’ హిట్ అయ్యింది. తమిళంలో నేనిప్పటివరకూ చేసినవన్నీ విజయవంతమైన సినిమాలే. అందుకే ‘లక్కీ’ అంటున్నట్టున్నారు. ‘అన్ లక్కీ’ అంటుంటే ఏమనిపించేది? ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే తమిళ, హిందీ రంగాల్లో నాపై ఈ ముద్ర లేదు. అక్కడ లక్కీ అనిపించుకున్న నేను ఇక్కడ అన్‌లక్కీ ఎలా అవుతాను? ఆ మాట విన్నప్పుడల్లా అభద్రతాభావం ఆవరించేది. పైగా ఒక సినిమాలో నేను ఏ పది, పదిహేను సీన్సో చేసి ఉంటాను. అలాంటప్పుడు చిత్ర అపజయానికి నేనెలా కారణమవుతాను? కానీ, నన్నే టార్గెట్ చేశారు. అందుకే తెలుగుఫీల్డ్కి దూరమయ్యారా? నా మాతృభాష హిందీ తర్వాత నేను నేర్చుకున్న భాష తెలుగే. ఇక్కడ నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. తెలుగంటే నాకెంత ప్రేమో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. నేనిక్కడి వాళ్లని ఒక్కటే కోరుకుంటున్నా. ‘నన్ను అభిమానించండి. గ్లామరస్ రోల్స్ చేయగలను. నటనకు అవకాశం ఉన్న పాత్రలూ చేయగలనని నిరూపించుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మంచి అవకాశాలివ్వండి. మరి... హిందీ రంగం సంగతేంటి? అక్కడ మెయిన్ హీరోయినా? సెకండ్ హీరోయినా? అని చూడరు. పాత్రని మాత్రమే పట్టించుకుంటారు. ‘బేబీ’లో నా పాత్ర నిడివి 20 నిముషాలే. కానీ ఆ పాత్ర నాకు తెచ్చిపెట్టిన ప్రశంసలెన్నో. మీడియా నన్ను ఎంతగానో అభినందిస్తూ రాసింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొంచెం బొద్దుగా ఉండేవారు. ఇప్పుడు భలే సన్నబడ్డారే? అప్పట్లో కెమెరా గురించి అవగాహన ఉండేది కాదు. బరువు గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆ తర్వాత తెరపై చక్కగా కనిపించాలంటే ఎంత బరువు ఉండాలో తెలిసింది. దాంతో కొంచెం తగ్గాను. తెలుగు మీడియాలో అలా రాయలేదా? చాలా మటుకు రాయరు. రివ్యూ రాసేటప్పుడు హీరో, విలన్, కమెడియన్ గురించి విపులంగా రాస్తారు. హీరోయిన్లకు మాత్రం అలా రాయరు. ‘తాప్సీ గుడ్’ అని మొక్కుబడిగా ఓ ముక్క రాస్తారు. సో... తెలుగు మీడియాపై కోపం ఉందన్నమాట? కోపం కాదు బాధ. రాత్రికి రాత్రి నన్ను ‘స్టార్’ని చేసింది తెలుగు మీడియానే. కానీ తర్వాత వాళ్లే కింద పడేశారు. ఏదైపా మంచి పాత్ర చేసినప్పుడు రెండు మంచి మాటలు రాస్తే తృప్తిగా ఉంటుంది కదా! ‘బేబీ’ తర్వాత మీ దృష్టి ఉత్తరాది చిత్రాలపైనే ఉంటోందా? తెలుగు దర్శక, నిర్మాతలను మంచి ఆఫర్ ఇవ్వమనండి. ఇక్కడా ఉంటాను. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. సౌత్‌ని వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. ఇక్కడి చిత్రాలు వదులుకునే ప్రసక్తే లేదు. తెలుగు పరిశ్రమ, మీడియా సంగతి సరే. అభిమానుల సంగతి? వాళ్లు లేకపోతే నేను లేను. ఏదైనా షూటింగ్ కోసం, ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు చక్కగా పలకరిస్తుంటారు. అభిమానం రుచి ఎలా ఉంటుందో నాకు తొలిసారి చూపించింది తెలుగు ప్రేక్షకులే. వాళ్లెప్పటికీ నాకు ప్రత్యేకం. - డి.జి.భవాని -
మీడియా ఇష్టారాజ్యం సహించం
వరంగల్: మీడియా స్వేచ్ఛ పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరూ అంగీకరించరని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయనతో పాటు స్పీకర్ మధుసూదనాచారి తదితరులు వరంగల్‌లో కాళోజీ విగ్రహానికి నివాళులర్పించే సమయంలో టీవీ9, ఏబీఎన్ సంస్థలకు చెందిన కొందరు నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘పత్రికా స్వేచ్ఛ హరి స్తోందని ఇయ్యాల కొందరు ప్లకార్డులు పట్టుకున్నరు. పత్రికలకు స్వేచ్ఛ ఉండవచ్చు. మీడియా సంస్థలు ప్రజాస్వామికంగా ఉంటే మీకా మర్యాద దొరుకుతది. ఆ రెండు చానళోళ్లు మళ్ల ఇయ్యాల తప్పు చేసిన్రు. స్పీకర్‌కు ఎదురుగా నల్ల జెండాలు జూపిన్రు. నేనంటే సీఎంని, కేసీఆర్‌కు వ్యతిరేకమైతే ఓకే. నన్ను చాలామంది తిట్టిన్రు. నేనేం భయపడలే. తెలంగాణ శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేస్తే వాళ్లు ఏం చూపిన్రు? తెలంగాణ రాష్ట్రానికి, శాసనసభకు వ్యతిరేకంగా చూపారు. తెలంగాణ ఎమ్మెల్యేలను పాచికల్లు తాగే మొకాలంటే ఈ గడ్డ మీద క్షమించాల్నా? ఇది పత్రికా స్వేచ్చ అయితదా? ఏ మీడియా చెబుతది ఇది కరెక్టని? అనేకమంది త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఎమ్మెల్యేలు కొలువుదీరిన రోజు అదేనా పద్ధతి. పాతరేస్తాం జాగ్రత్త. కేసీఆర్‌ను తిడితే బాధలేదు. తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని, ఉనికిని, గౌరవాన్ని వ్యతిరేకించేలా ఎవడు చేసినా మెడలు విరిచి అవతల పారేస్తం. మీడియా ముసుగులో ఇడియట్ ఆటలు చేస్తామంటే సాగనివ్వం. అయినా ఈ చానళ్లను మేం బ్యాన్ చేయలే. ఈ అంశం స్పీకర్ వద్ద విచారణలో ఉంది. అన్ని పార్టీలూ కలిసి శాసనసభలో తీర్మానం చేసి స్పీకర్‌కు అప్పగించాం. స్పీకరు నిర్ణయించాల్సి ఉంది. తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారికి సెల్యూట్ చేస్తున్నా. దాన్ని పట్టుకుని ఢిల్లీల, ఇక్కడ, అక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఆంధ్రావాళ్లు చేసేది ఇదే. దీని గురించి బాధపడవద్దు. దీటుగా ఎదుర్కోవాలి. ఏదైనా ఉంటే మీడియా మిత్రులు నా వద్దకు రండి. ఆంధ్రావాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకోవద్దు’ అని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. -
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాఖ్యోపదేశమ్ 21st july 2013
-
5pm Express News 19th July 2013
-
షిర్డీలో ప్రమాదం.. నరసరావుపేట వాసుల మృతి
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 11th July 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 9th july 2013
-
Sakshi WorldToday 9th July 2013
-
సాక్షి ది హెడ్ లైన్ షో 8th July 2013
-
AP 23 Evening News 7th July 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 8th July 2013
-
ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి కార్యకర్తా కృషిచేయాలి : ఎంపీ మేకపాటి
-
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కేంద్ర ప్రభుత్వం లొంగిపోయింది : నారాయణ
-
ఎంపీ పాల్వాయి గోవర్థన్‌రెడ్డి మీడియా సమావేశం
-
కేంద్ర హోం మంత్రి షిండేతో దిగ్విజయ్ సింగ్ భేటీ
-
Sakshi Cinema 5th July 2013
-
Sakshi Cinema 2nd July 2013 - Sakshi TV
-
ప్రాపర్టీ ప్లస్ 2nd july 2013
-
క్రైం రిపోర్టర్ 1st july 2013
-
సాక్షి భవిత 30th June 2013
-
AP23 సాక్షి న్యూస్ 30th June 2013
-
సాక్షి న్యూస్ వీక్ 30th June 2013
-
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాఖ్యోపదేశమ్ 30th June 2013
-
సాక్షి వరల్డ్ టుడే 30th June 2013
-
భూమన కరుణాకర్ రెడ్డితో సాక్షి న్యూస్ మేకర్
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 30th June 2013
-
కాఫీ విత్ సాక్షి 30th June 2013
-
Sakshi Sports 28th June 2013