
SP Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్‌పీ హిందూజా కన్నుమూశారు. 87 ఏళ్ల వయసున్న ఎస్‌పీ హిందూజా అనారోగ్యం కారణంగా లండన్‌లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
‘హిందూజా కుటుంబ పెద్ద, హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్‌పీ హిందూజా బుధవారం (మే17) మృతి చెందారని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాం’ అని హిందూజా కుటుంబ ప్రతినిధి అధికారికంగా తెలియజేశారు.
‘దివంగత పీడీ హిందూజా వ్యవస్థాపక సూత్రాలు, విలువలను కొనసాగించి ఎస్‌పీ హిందూజా మా కుటుంబానికి మార్గదర్శకుడిగా నిలిచారు. తాను ఉంటున్న యూకే, స్వదేశమైన భారత్‌ల మధ్య బలమైన సంబంధాన్ని నిర్మించడంలో తన సోదరులతో కలిసి చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు’ అని హిందూజా కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.
సిరిచంద్ పరమానంద్ హిందూజా.. నలుగురు హిందూజా బ్రదర్స్‌లో పెద్దవాడు. హిందూజా గ్రూప్ సంస్థలకు చైర్మన్‌గా ఉన్న ఆయన లండన్‌లో ఉంటూ బ్రిటిష్ పౌరసత్వం పొందారు.
ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో..
Comments
Please login to add a commentAdd a comment