సాక్షి, వరంగల్: ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతిచెందారు. హనుమకొండలోని తన నివాసంలో జగదీష్ గుండెపోటుకు గురికాగా, వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించేలోపే జగదీష్ తుదిశ్వాస విడిచారు. జగదీష్.. ఏప్రిల్ 1న తొలిసారి గుండెపొటుకు గురికాగా భార్య రమాదేవి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల అప్పుడు ప్రాణాపాయం తప్పినా సరిగ్గా 51 రోజుల వ్యవధిలోనే మరోసారి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.
జగదీష్ ఇకలేరనే వార్త తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం ములుగు జిల్లా మల్లంపల్లికి తరలించారు. మల్లంపల్లికి చెందిన జగదీష్ ఏటూరునాగారం నుంచి జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఇటీవల ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను సైతం పార్టీ అధినేత కేసిఆర్ జగదీష్‌కు అప్పగించారు.
నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో జగదీష్ చురుగ్గా పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధిగా పార్టీ అధ్యక్షులుగా ములుగు జిల్లాలో జగదీష్ చేసిన సేవలు స్మరిస్తూ అభిమానులు పార్టీ నేతలు నివాళులర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జగదీష్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు.
చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్..
Comments
Please login to add a commentAdd a comment