Kusuma
-
అక్షర కుసుమం: వాచస్పతి కుసుమారెడ్డి
కొండూరు కుసుమారెడ్డి... ఏడున్నర దశాబ్దాల జీవనయానంలో ఆమె కలం నుంచి ఇరవై రచనలు జాలువారాయి. ఓనమాలు దిద్దిన నాటి నుంచి నేటి వరకు అక్షరంతో మమేకమై సాగుతున్న సాహిత్యసేవకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అధికార భాషా దినోత్సవం’ సందర్భంగా (ఆగస్టు 29) ఆమెను ‘భాషారత్న’ పురస్కారంతో గౌరవించింది. ఆ విశేషాలను, తన సాహిత్య ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ‘‘మాది నెల్లూరు జిల్లా, కావలి పట్టణం. మా నాన్న జయరామిరెడ్డి హైస్కూల్ హెడ్మాస్టర్, అమ్మ శంకరమ్మ గృహిణి. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు కావలిలో చదివాను. గుంటూరు, నల్లపాడు (ఆంధ్ర విశ్వవిద్యాలయం)లో పీజీ చేసిన తర్వాత ఎంఫిల్కి హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. లింగ్విస్టిక్స్‌లో పీజీ డిప్లమో, రెండు పీహెచ్‌డీలు ఉస్మానియాలోనే చేశాను. వారణాసి, సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీ నుంచి డీలిట్ చేసి ‘వాచస్పతి’ బిరుదు పొందాను. ఉస్మానియాలో 1974లో విద్యార్థిగా అడుగు పెట్టిన నేను 1979లో లెక్చరర్నయ్యాను. పదోన్నతులతో ప్రొఫెసర్ హోదాలో తెలుగు శాఖాధిపతిగా విధులు నిర్వర్తించి 2008లో రిటైరయ్యాను. ఆ రిటైర్మెంట్ ఉస్మానియా నుంచి మాత్రమే. ఆ మరునాటి నుంచి ట్రిపుల్ ఐటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్) బాధ్యతలు స్వీకరించాను. ట్రిపుల్ ఐటీ రూపకల్పన నుంచి ఆరేళ్లపాటు ఆ విధుల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా ఉద్యోగపరంగా విశ్రాంత జీవితమే కానీ, చదవడానికి రాయడానికి విశ్రాంతి తీసుకోలేదు. విషయశోధన చేస్తూనే ఉన్నాను, రాస్తూనే ఉన్నాను. పంతొమ్మిది గ్రంథాలు ప్రచురితమయ్యాయి. ఐసీహెచ్ఆర్ నుంచి ‘సీనియర్ అకడమిక్ ఫెలో’ అందుకున్న రచన (కల్చరల్ లైఫ్ ఆఫ్ తెలంగాణ ట్రైబ్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు డాన్స్, మ్యూజిక్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్) తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రచురణ దశలో ఉంది. అన్నీ అధ్యయన భరితాలే! నేను కాలక్షేపం కోసం ఏదీ రాయలేదు. కాలక్షేపంగా చదువుకోవడానికీ రాయలేదు. ప్రతిదీ సమగ్రమైన పరిశోధన, శాస్త్ర పూర్వక అధ్యయనంతో రాసినవే. నా రచనలన్నీ జీవితగమనానికి సూచికలవంటివే. నా పర్యవేక్షణలో 30 మందికి పైగా విద్యార్థులు పీహెచ్‌డీలు చేశారు. నేను పీహెచ్డీ చేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాలతోపాటు, నా విద్యార్థులకు గైడ్ చేస్తున్న క్రమంలో నాకు ఓ విషయం స్పష్టంగా తెలిసి వచ్చింది. అప్పటి వరకు పరిశోధన చేసే వాళ్లకు ఒక మెథడాలజీ లేదు. ఆ లోటును భర్తీ చేయడానికి ఆచార్య ఎం. కులశేఖరరావుతో కలిసి ‘సాహిత్య పరిశోధన పద్ధతులు’ రాశాను. ఇలాగే నా ప్రతి రచన వెనుక బలమైన కారణం, ఉపయుక్తత ఉన్నాయి. తంజావూరులోని సరస్వతి మహల్ గ్రంథాలయం ప్రభావం నా రచనల మీద ఎక్కువగా ఉంది. నెల రోజుల పాటు అక్కడే ఉండి తాళపత్ర గ్రంథాలను అధ్యయనం చేసి నోట్స్ రాసుకున్నాను. రంగాజమ్మ స్ఫూర్తి! ఎంఫిల్ అంశంగా రంగాజమ్మను తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. ఆమె ఎనిమిది భాషల్లో ప్రావీణ్యం ఉన్న తెలుగు కవయిత్రి. కనకాభిషేక గౌరవం అందుకున్న ఏకైక మహిళ. తంజావూరు నాయక రాజుల ఆస్థానంలో ఆమెకి గొప్ప స్థానం ఉండేది. నా మీద ఆమె ప్రభావం కూడా ఉందనే చెప్పాలి. ఆమెలాగే నేను కూడా నా రంగంలో విశేషంగా కృషి చేయాలని, అత్యున్నత స్థాయికి చేరాలనే ఆకాంక్ష నాకు తెలియకుండానే కలిగింది. సంస్కృతంలో డీలిట్ చేయడం ద్వారా వాచస్పతి బిరుదు పొందిన తొలి తెలుగు వ్యక్తినయ్యాను. ఇప్పటికీ ఆ బిరుదు సాధించిన ఏకైక తెలుగు మహిళను నేనే. జ్ఞానం భావితరాలకు అందాలి! వార్తా పత్రికల్లో వ్యాసాలు రాశాను. వ్యక్తిత్వ వికాసం క్లాసులకు మూలం మన భగవద్గీత. ఒక్కో శ్లోకాన్ని నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉదాహరణలతో రాసిన గీతాయోగం నన్ను యూనివర్సిటీ పరిధి నుంచి బయటకు తెచ్చింది. గీతాయోగం ద్వారా సాధారణ పాఠకులకు కూడా పరిచయమయ్యాను. మొత్తంగా నేను రాసిన పుస్తకాల లెక్క చెప్పగలను, కానీ ఎన్ని గ్రంథాలను చదివాననే ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉండదు. మన ప్రాచీన గ్రంథాల్లో గణితం, రాజనీతి, ధర్మ అర్థశాస్త్రాలు, వైద్యం, ధనుర్విద్య, ఖడ్గలక్షణ శాస్త్రాది యుద్ధ నైపుణ్యాలన్నీ సమగ్రంగా ఉన్నాయి. నృత్యకళ అత్యున్నత స్థాయిలో ఉండేది. చాలా నాట్యరీతులు అంతరించి పోయాయి. వాటిని వివరించే సాహిత్యం కూడా చేజారిపోతోంది. వాటి పునరుద్ధరణకు మార్గదర్శనం చేయగలిగిన రచనలు చేశాను. నాకు నేనుగా నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించాను. భావితరాల కోసం ఓ బృహత్తర ప్రణాళిక నా మదిలో ఉంది. అది... మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్న జ్ఞానాన్ని డిజిటలైజ్ చేసి ప్రాచీన సాహిత్య శాస్త్ర గ్రంథాలన్నింటితో ఒక డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఉంది. మన ప్రాచీన గ్రంథాల పట్ల చాలామందికి ఆసక్తి ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాల కారణంగా తంజావూరు, ఇతర గ్రంథాలయాలకు వెళ్లి తాళపత్ర గ్రంథాలను, ప్రాచీన రచనలను అధ్యయనం చేయగలిగిన సమయం ఉండదు. అలాంటి వారికి ఈ ప్రయత్నం మేలు చేస్తుంది. అరచేతిలోని స్మార్ట్ ఫోన్లోనే చదువుకోవచ్చు. అమెరికా నుంచి సాఫ్ట్వేర్ నిపుణులు ఒకరు ఫోన్ చేసి ‘భీమఖండంలో ఒక శాస్త్రీయ విషయముందని, పరిశోధన కోసం ఆ పుస్తకం ఒక కాపీ కావాల’ని అడిగారు. డిజిటలైజ్ చేస్తే మనదేశం నుంచి అమెరికాకు పుస్తకాన్ని పంపించాల్సిన ప్రయాస అక్కరలేదు. వందేళ్లు దాటిన పుస్తకాలు కూడా ఆదరణకు నోచుకోకుండా పడి ఉన్నాయి. వాటన్నింటినీ భావితరాలకు అందించడానికి ఏమి చేయాలి, ఎలా చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. ఇటీవల విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలిగా నియమించినట్లు అధికారులు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా నా ఆలోచనలకు ఒక రూపం తీసుకురావచ్చనే ఉత్సాహం కలిగింది’’ అన్నారు వాచస్పతి కొండూరి కుసుమారెడ్డి. రోజుకు పదిగంటలు! బోధన వృత్తిలో ఉన్నంత కాలం నా దినచర్య ఒకేక్రమంలో సాగింది. నాలుగు గంటలు పాఠాలు చెప్పడానికి, రెండు గంటలు ప్రిపరేషన్‌కి. ప్రయాణం ఒక గంట. ఈ ఏడు గంటలు ఉద్యోగం కోసం. ఇవన్నీ పూర్తయిన తర్వాత మూడు గంటల సేపు పుస్తకాలు చదవడానికి, రాసుకోవడానికి పట్టేది. రోజుకు దాదాపు పదిగంటలు అక్షరాల మధ్యనే గడిచేది. మా తమ్ముడి భార్య వాణి నాకు ఇంటి బాధ్యతలేవీ లేకుండా చూసుకునేది. నాకు సన్మానాలు జరుగుతుంటే తనకే జరిగినంత సంతోషపడేది. నా కోసం అతిథులు వస్తే తన పుట్టింటి వాళ్లు వచ్చినంత సంబరపడుతూ వాళ్లకు అన్నీ అమర్చి పెట్టేది. మా నాన్న కవి అనే విషయం ఆయన పోయిన తర్వాత కానీ మాకు తెలియలేదు. ఆయన పుస్తకాలన్నీ తీసి సర్దుతుంటే ‘రుద్రీయము’ చేతిరాత ప్రతి దొరికింది. కాకతీయ రాజు రుద్రదేవుడి చరిత్రను ఆయన పద్యకావ్యంగా రాశారు. ఆ పుస్తకాన్ని పరిష్కరించి ప్రచురించడం, ఆయన కవి అనే విషయాన్ని ప్రపంచానికి తెలియచేయడం నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : సీహెచ్ మోహనాచారి -
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్ హఠాన్మరణం
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతిచెందారు. హనుమకొండలోని తన నివాసంలో జగదీష్ గుండెపోటుకు గురికాగా, వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించేలోపే జగదీష్ తుదిశ్వాస విడిచారు. జగదీష్.. ఏప్రిల్ 1న తొలిసారి గుండెపొటుకు గురికాగా భార్య రమాదేవి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల అప్పుడు ప్రాణాపాయం తప్పినా సరిగ్గా 51 రోజుల వ్యవధిలోనే మరోసారి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. జగదీష్ ఇకలేరనే వార్త తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం ములుగు జిల్లా మల్లంపల్లికి తరలించారు. మల్లంపల్లికి చెందిన జగదీష్ ఏటూరునాగారం నుంచి జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఇటీవల ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను సైతం పార్టీ అధినేత కేసిఆర్ జగదీష్‌కు అప్పగించారు. నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో జగదీష్ చురుగ్గా పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధిగా పార్టీ అధ్యక్షులుగా ములుగు జిల్లాలో జగదీష్ చేసిన సేవలు స్మరిస్తూ అభిమానులు పార్టీ నేతలు నివాళులర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జగదీష్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
డీకే రవి భార్యకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
సాక్షి, బెంగళూరు : ఐదేళ్ల క్రితం అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడిన యువ ఐఏఎస్ అధికారి డీకే రవి సతీమణి డీకే కుసుమ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సమక్షంలో ఆదివారం పార్టీలో జాయిన్ అయ్యారు. త్వరలో జరుగనున్న రాజమహేశ్వరీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమెను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలో బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎమ్మెల్యే సీటు హామీ మేరకే కుసుమ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పేరును కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు సిఫారసు చేసినట్లు డీకే శివ కుమార్ వెల్లడించారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువతిని ఆ స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై హైకమాండ్ నుంచి తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. (మంత్రి పదవికి బీజేపీ నేత రాజీనామా) కాగా కర్ణాటకకు చెందిన డీకే రవి 2015లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసింది. ఈ సంఘటన అప్పట్లో పెను దుమారాన్నే రేపింది. ప్రభుత్వ ఒత్తిడి మేరకే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని రవి తల్లిదండ్రులు ఆరోపించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) రవిది ఆత్మహత్యగానే నిర్ధారించింది. వ్యక్తిగతమైన కారణాల వల్లనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదించింది. తాజాగా అతని భార్య కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కాగా రాజమహేశ్వరీ సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్నం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలోనే జరగాల్సిన ఈ ఎన్నిక కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు అభ్యర్థుల వేటులో నిమగ్నమయ్యారు. బీజేపీ నుంచి మునిరత్నం బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆయనపై బలమైన మహిళా అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగానే కుసుమను సంప్రదించింది. -
టెట్‌లో జిల్లా సూపర్‌హిట్
శృంగవరపుకోట రూరల్ : ధర్మవరం మేజరు పంచాయతీకి చెందిన వేమన కుసుమ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 150/139 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. సోమవారం సాయంత్రం విడుదల చేసిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జిటి) టెట్ ఫలితాల్లో పేపర్ 1లో 139 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. డైట్ పోటీ పరీక్షల్లో కూడా ఈమె జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి నెల్లిమర్ల మండలం వేణుగోపాలపురంలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా శిక్షణ పొందింది. తండ్రి అప్పలరాజు ధర్మవరంలో టైలర్‌గా పనిచేస్తుండగా తల్లి సన్నమ్మడు గృహిణి. ఈ సందర్భంగా అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ తనకు ముగ్గురు కుమార్తెలున్నారని,, రెండో కుమార్తె కుసుమ చిన్నప్పటి నుంచి చదువులో చక్కని ప్రతిభ కనబరుస్తూ అన్ని తరగతుల్లోనూ ప్రథమ స్థానాలు సాధించిందని తెలిపారు. ఆమెను కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, స్థానికులు అభినందించారు విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్షకు అర్హత కోసం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్)లో జిల్లా అభ్యర్థులు భారీ సంఖ్యలో అర్హత సాధించారు. పరీక్ష ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పేపర్–1, 2, 3 అభ్యర్థులను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 15,331 మంది దరఖాస్తు చేసుకోగా 94.08 శాతంతో 14,423 మంది హాజరయ్యారు. తాజాగా అందిన సమాచారం మేరకు 80 శాతం అర్హత సాధించి ఉంటారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వివిధ శిక్షణ కేంద్రాల అభ్యర్థులు అధికసంఖ్యలో అర్హత సాధించారు. తాజాగా అందిన సమాచారం మేరకు పేపర్–1 కి సంబంధించి అధిక మార్కులు సాధించిన వారి వివరాలివి. వినెక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అల్లాడ లావణ్య (137), రొబ్బి జ్యోతి (132), మెయిద కృష్ణవేణి (130), బాలి కుమారి (130) ఉన్నారని ఆ సంస్థ డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తమ విద్యార్థులు అయ్యప్ప (135), హేమ (133), పిళ్లా జగదీశ్వరి (133), బి.బిందుకుమారి (131), ఎస్.విజయ (131), టి.రోజారమణి (130) ఉన్నారని శ్రీశ్రీ కోచింగ్ సెంటర్ శ్రీనివాసరావు తెలిపారు. అధిక మార్కులు సాధించిన అభ్యర్ధుల వివరాలు ఇంకా సేకరించాల్సి ఉందన్నారు. శ్రీసాహితీ కోచింగ్ సెంటర్, తెలుగు స్టడీ సర్కిల్లకు చెందిన అభ్యర్థుల్లో వాడపల్లి నాగమణి (132), శెట్టి తేజస్వరి (129), లోపింటి రవికుమార్ (129), జి.చిరంజీవి (119) ఉన్నారని ఆ కోచింగ్ సెంటర్ రైరెక్టర్లు రెడ్డిపల్లి రమేష్‌కుమార్, సారిపల్లి గౌరీశంకర్ తెలిపారు. పరీక్షకు హాజరయిన 1200 మందిలో శతశాతం అర్హులయ్యారని తెలిపారు. -
మార్కులు తక్కువగా వచ్చాయని..
గుడిపాల: పదో తరగతి పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఐ లక్ష్మీకాంత్ కథనం ప్రకారం... చిత్తపార జెడ్పీ హైస్కూల్లో కుసుమ(15) పదో తరగతి చదివి పరీక్షలు రాసింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 8.2 పాయింట్లు రావడంతో మనస్తాపానికి గురైంది. తన అవ్వగారి ఊరైన ముట్టుకూరుపల్లె గ్రామానికి వచ్చిన ఆమె మంగళవారం రాత్రి ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. -
ఆ తల్లికి ఏమైందీ..?
కంబదూరు : నవమాసాలు మోసి, కనీ కంటికి రెప్పలా పెంచుతున్న చిన్నారులకు చిన్న ముల్లు గుచ్చుకుంటేనే చూసి తట్టుకోలేని ఆ తల్లి ఇంతటి కిరాతానికి ఎలా పాల్పడింది. అసలు ఆ తల్లీకి ఏమైందీ అనే ప్రశ్న స్థానికులను కలచివేస్తోంది. నూతి మడుగు గ్రామంలో సోమవారం సునీత అనే ఓ తల్లీ కిరాతకంగా కన్న బిడ్డలు కుస్మా, రుషిల గొంతులు కోసి చంపేసిన ఘటన విధితమే. ఆ తల్లీకి అసలు ఏం జరిగింది..? కసాయి తల్లీగా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. సోమవారం గ్రామంలో జరిగిన ఘటనతో గ్రామస్తుల్లో భయందోళనలు నెలకొన్నాయి. మే 16న గొల్ల సోమశేఖర్ అనే వ్యక్తి సైకోగా మారి కన్న తల్లీ, కట్టుకున్న భార్య, కన్న బిడ్డలను అతి దారుణంగా నరికి చంపిన ఘటన మరువక ముందే మరో ఘోరమైన ఘటన గ్రామంలో జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు గ్రామానికి ఏమైంది. మంచి వ్యక్తులే ఎందుకు మతిస్థిమితం కోల్పోయి ఇంతటి ఘోరాలకు పాల్పడుతున్నారు.. అన్న అనుమానాలు గ్రామస్తుల్లో నెలకొన్నాయి. మృతి చెందిన చిన్నారులను చూసి అయ్యో పాపం, అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా... అంటూ కన్నీరు పెడుతున్నారు. తండ్రి మారుతీ కన్న బిడ్డలను చూసి డాడిను వదిలిపెటి ్ట వెళ్లి పోయారా అంటూ బోరున విలపించారు. ఈ హత్య ఘటనలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. అసలు ఆ తల్లీ నోరు విప్పితే కానీ నిజాలు తెలిసే పరిస్థితులు లేవు. అయితే బంధువులు మత్రం మతిస్థిమితం లేకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. గ్రామంలో చిన్నారులకు అంతక్రియలు నిర్వహించారు. -
ఆమె పేరు కుసుమ
పైశాచిక భర్త! కట్నం దండిగా ఇచ్చినా అత్తవారింట ఆరళ్లు శాశ్వతంగా వదిలించుకోవాలని గదిలో నిర్బంధం పోలీసుల సాయంతో బయటపడ్డ గృహిణి పలాస: ఆమె పేరు కుసుమ. కానీ వివాహమయ్యాక వసివాడింది. అత్తవారి ఆరళ్లతో అల్లాడిపోయింది. చివరకు భర్త తనను గదిలో నిర్బంధించంతో విషయం పోలీసులకు తెలిసింది. ఇదంతా ఏదో అనాగరిక సమాజంలో జరిగిందనుకుటే పొరపాటే. విదేశంలో ఉద్యోగంచేస్తూ... దండిగా కట్నం పుచ్చుకుని... ఇప్పుడు వదిలించుకునేందుకు జరుగుతున్న చిత్రహింసల్లో భాగమే. పోలీసులు ఆమెను విడిపించగా తాను ఇన్నాళ్లు ఎదుర్కొంటున్నబాధలను ఆమె కన్నీటితో పోలీసులకు, విలేకరులకు తెలిపింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గ కె.టి.రోడ్డులో విశ్వజ్యోతి మెడికల్ స్టోర్ యజమాని శాశనపురి విశ్వేశ్వరరావు కుమార్తె కుసుమను తాళ్ళబద్ర వద్ద గల రైస్ మిల్లు యజమాని తంగుడు భాస్కరరావు కుమారుడు కృష్ణచైతన్యకిచ్చి 2012 ఫిబ్రవరి నెలలో పెళ్లి జరిపించారు. వివాహ సమయంలో రూ.10 లక్షల నగదు కట్నంగా ఇవ్వడమేగాకుండా, పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు లాంఛనంగా ఇచ్చినట్టు కుసుమ తల్లిదండ్రులు చెబుతున్నారు. వివాహమైన కొద్ది రోజులకే కృష్ణచైతన్య నారాయణదొర కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న అత్తవారింట ఆమెను విడిచిపెట్టి ఉద్యోగ రీత్యా లండన్ వెళ్ళిపోయాడు. వివాహం చేసుకుని తనతో తీసుకెళ్ళకుండా విడిచిపెట్టి వెళ్లడంపై ఆమె తల్లిదండ్రులు ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను లండన్ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. తనకున్న వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని కొద్ది రోజుల్లోనే తిరిగి కాశీబుగ్గ తీసుకొచ్చి తన తల్లిదండ్రులవద్ద దింపేసి వెళ్లిపోయాడు. ఇక అత్తమామలూ తనకు సూటిపోటి మాటలతో మనిసిక క్షభకు గురిచేశాడు. ఎప్పటికైనా మార్పు వస్తుందనే ఆలోచనతో ఇప్పటి వరకు భరిస్తే. ఇటీవల తమ్ముడి వివాహానికి వచ్చిన కృష్ణచైతన్య తల్లిదండ్రులతో కలసి హింసించాడు. భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టాడు. దీనిపై కాశీబుగ్గ పోలీసుల వద్ద, కుల పెద్దలకు ఫిర్యాదు చేయగా తన భర్తతో పాటు అత్తమామలకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికి వారిలో మార్పు రాలేదు. చివరకు ఆమెను శాశ్వతంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో మంగళవాం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటిలో బంధించి బయట తాళం వేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన వచ్చి ఆమె పరిస్థితి చూసి మహిళా సంఘాలకు తెలియజేయగా వారు వచ్చేసరికి కుసుమ అత్తమామలు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కాశీబుగ్గ పోలీసులకు విషయం తెలియజేయడంతో ఎస్ఐ ఆర్.వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గదిలో పెట్టి నిర్బంధించడం చట్టరీత్యా నేరమని, తలుపులు తీయాలని కుసుమ మామ భాస్కరరావును ఎస్ఐ హెచ్చరించడంతో వెంటనే వచ్చి తలుపులు తీశారు. గది నుంచి బయటకు వచ్చిన కుసుమ తన తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తన కుమార్తెకు న్యాయం చేయాలని కుసుమ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తన కుమార్తె సంతోషంగా జీవిస్తుందనే ఆశతో ఎన్ఆర్ఐ సంబంధం చేశామని, పెద్దగా చదువులేదనే కుంటి సాకుతో తన కుమార్తెను వదిలించుకోవడానికి చూస్తున్నారని తెలిపారు. -
భార్యే చంపించింది
ఆస్తి కోసం ప్రియుడితో కలిసి సుపారీ హత్య ఐదుగురి అరెస్టు ముషీరాబాద్: గాంధీనగర్‌లో గత డి సెంబర్ 27న జరిగిన సుశీల్ చక్రవర్తి హత్య కేసును ముషీరాబాద్ పోలీసులు ఛేదించారు. భర్త ఆస్తిపై కన్నేసిన భార్యే ప్రియుడితో కలిసి సుపారీ హత్య చేయించిందని నిర్థారించారు. ఆమెతో పాటు మరో నలుగురిని మంగళవారం అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం... గాంధీనగర్‌లోని నారాయణ ఎన్‌క్లేవ్‌లో ఉండే మారిశెట్టి సుశీల్ చక్రవర్తి (41) ఒంటరిగా ఉంటున్నాడు. ఇతనికి మౌలాలి అంబిక అపార్ట్మెంట్లో ఉండే జయరాజ కుసుమకుమారితో 1996లో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా, 2012లో భర్త ప్రవర్తనతో విసుగు చెందానని, అతని మానసిక ప్రవర్తన సరిగా లేదని పేర్కొంటూ కుమారి భర్త దగ్గర నుంచి ఇద్దరు పిల్లలును తీసుకొని మౌలాలిలోని తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. గాంధీనగర్‌లో భర్త దగ్గర ఉన్న సమయంలోనే అదే భవనంలో కిరాయికి ఉంటున్న లంక నరేష్కుమార్ అలియాస్ బబ్లూతో(26)తో ఈమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. గుంటూరుజిల్లా మంగళగిరి మండలం కృష్ణపాలెంకు చెందిన నరేష్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. తల్లిగారి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కుమారి ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తోంది. వీరిద్దరూ భర్త సుశీల్ చక్రవర్తి అడ్డు తొలగించాలని, ఆపై అతని ఆస్తి కాజేయాలని నిర్ణయించుకున్నారు. నరేష్ మాల్లాపూర్‌లో ఉండే ఓరుగంటి బాల్‌రాజ్(24), పూసల రాజు(22), షేక్ గౌష్(30)లను సంప్రదించాడు. సుశీల్‌ను హత్య చేస్తే రూ. 2 లక్షల సుపారీ ఇస్తానని ఒప్పుకున్నాడు. డిసెంబర్ 16న కుమారి, ప్రియుడు నరేష్‌తో పాటు సుపారీ మాట్లాడుకున్న ముగ్గురూ మౌలాలిలోని ఒక రూమ్‌లో కలుసుకున్నారు. కుమారి తన భర్తను ఎలా హత్య చేయాలో వారికి వివరించారు. 18న నరేష్కుమార్, పూస రాజు కలిసి సుశీల్ ఇంటికి వచ్చి రెక్కీ నిర్వహించారు. 19న మరోసారి కిరాయి హంతకుడు బాల్‌రాజ్‌ను తీసుకువచ్చి ఇంటిని చూపించారు. 20వ తేదీన నలుగురు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో స్కూడ్రైవర్, సుత్తి, ఇతర మారాణాయుధాలు కొనుక్కొని, మద్యం తాగి సుశీల్ చక్రవర్తి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే, ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇద్దరు ఇంట్లోనే ఉండి, మరో ఇద్దరు బయట కాపలా ఉన్నారు. సాయంత్రం 5.30కి సుశీల్ ఇంట్లోకి రాగానే అతిదారుణంగా చంపేశారు. కాగా, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య కుమారిపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి సుపారీ హత్య చేయించినట్టు ఒప్పుకుంది. దీంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.