కంబదూరు : నవమాసాలు మోసి, కనీ కంటికి రెప్పలా పెంచుతున్న చిన్నారులకు చిన్న ముల్లు గుచ్చుకుంటేనే చూసి తట్టుకోలేని ఆ తల్లి ఇంతటి కిరాతానికి ఎలా పాల్పడింది. అసలు ఆ తల్లీకి ఏమైందీ అనే ప్రశ్న స్థానికులను కలచివేస్తోంది. నూతి మడుగు గ్రామంలో సోమవారం సునీత అనే ఓ తల్లీ కిరాతకంగా కన్న బిడ్డలు కుస్మా, రుషిల గొంతులు కోసి చంపేసిన ఘటన విధితమే. ఆ తల్లీకి అసలు ఏం జరిగింది..? కసాయి తల్లీగా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. సోమవారం గ్రామంలో జరిగిన ఘటనతో గ్రామస్తుల్లో భయందోళనలు నెలకొన్నాయి. మే 16న గొల్ల సోమశేఖర్ అనే వ్యక్తి సైకోగా మారి కన్న తల్లీ, కట్టుకున్న భార్య, కన్న బిడ్డలను అతి దారుణంగా నరికి చంపిన ఘటన మరువక ముందే మరో ఘోరమైన ఘటన గ్రామంలో జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
అసలు గ్రామానికి ఏమైంది. మంచి వ్యక్తులే ఎందుకు మతిస్థిమితం కోల్పోయి ఇంతటి ఘోరాలకు పాల్పడుతున్నారు.. అన్న అనుమానాలు గ్రామస్తుల్లో నెలకొన్నాయి. మృతి చెందిన చిన్నారులను చూసి అయ్యో పాపం, అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా... అంటూ కన్నీరు పెడుతున్నారు. తండ్రి మారుతీ కన్న బిడ్డలను చూసి డాడిను వదిలిపెటి ్ట వెళ్లి పోయారా అంటూ బోరున విలపించారు. ఈ హత్య ఘటనలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. అసలు ఆ తల్లీ నోరు విప్పితే కానీ నిజాలు తెలిసే పరిస్థితులు లేవు. అయితే బంధువులు మత్రం మతిస్థిమితం లేకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. గ్రామంలో చిన్నారులకు అంతక్రియలు నిర్వహించారు.
ఆ తల్లికి ఏమైందీ..?
Published Wed, Jun 24 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM
Advertisement
Advertisement