jagadish
-
డిగ్రీ కోర్సుల గడువు విద్యార్థుల ఇష్టం
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు నిర్ధిష్ట గడువు ఉంటుంది. డిగ్రీ కోర్సులు సాధారణంగా మూడేళ్లలో పూర్తవుతాయి. తమ వెసులుబాటును బట్టి కోర్సుల గడువును తగ్గించుకొనే లేదా పెంచుకొనే అవకాశం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఇలాంటి ఐచ్ఛికాన్ని విద్యార్థులకు ఇవ్వడానికి వీలుగా ఉన్నత విద్యా సంస్థలకు అనుమతి మంజూరు చేయబోతున్నట్లు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) చైర్మన్ జగదీష్ కుమార్ చెప్పారు. యాక్సిలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఏడీపీ), ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రామ్(ఈడీపీ)ను ఆఫర్ చేసే విషయంలో ప్రామాణిక నియమావళికి యూజీసీ ఇటీవల ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రజల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానించనున్నారు. ప్రామాణికమైన గడువు కంటే తక్కువ వ్యవధిలో లేదా ఎక్కువ వ్యవధిలో పూర్తి చేసినప్పటికీ ఆయా డిగ్రీలను సాధారణ డిగ్రీలుగానే పరిగణిస్తారు. ఉన్నత చదువులు లేదా ఉద్యోగ నియామకాలకు అవి యథాతథంగా చెల్లుబాటు అవుతాయి. -
నేను ఎక్కడికి పారిపోను .. ఎప్పుడైనా నన్ను అరెస్ట్ చేసుకోండి ..
-
ఎస్పీని కలిసిన కేతిరెడ్డి
-
సినీ నిర్మాత ఆత్మహత్య
కర్ణాటక: కన్నడ సినీ నిర్మాత సౌందర్యజగదీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మహాలక్ష్మీలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో తన నివాసంలో ఆయన ఉరివేసుకోగా కుటుంబ సభ్యులు గమనించి రాజాజీనగర సుగుణ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. సౌందర్య జగదీష్ పలు వివాదాలతో గతంలో వార్తల్లోకి ఎక్కారు. ఇరుగుపొరుగువారితో పాటు కుటుంబసభ్యులతో గొడవపెట్టుకుని వివాదంలో చిక్కుకున్నారు. ఈయనకు చెందిన జెట్లాగ్ పబ్‌లో కొద్దినెలల క్రితం కాటీర చిత్ర బృందం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పార్టీ చేసుకున్నట్లు ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో 25 రోజుల పాటు రెస్టోబార్ లైసెన్సు రద్దుచేశారు. సౌందర్యజగదీష్ రియల్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తమ్ముడి కుమారుడు స్నేహిత్‌ను సినిమారంగానికి పరిచయం చేశారు. ఇటీవల ప్రియాంకా ఉపేంద్ర ఏర్పాటుచేసిన హోలీ కార్యక్రమంలో సౌందర్యజగదీశ్ పాల్గొన్నారు. -
అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ప్రముఖ నిర్మాత
ప్రముఖ కన్నడ నిర్మాత సౌందర్య జగదీష్ మరణించారు. అయితే ఈయన మృతిపై తలో రకంగా కామెంట్స్ వినిపించడం చర్చనీయాంశంగా మారింది. తొలుత గుండెపోటుతో చనిపోయారని అనగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) జగదీష్.. మస్త్ మజా మాది, స్నేహితారు తదితర చిత్రాలని నిర్మించారు. అప్పు-పప్పు సినిమాతో తన కొడుకుని హీరోగా పరిచయం చేశాడు. సినిమాల నిర్మాణంతో పాటు ఈయన ఇండస్ట్రీలిస్ట్ కూడా. అలానే బెంగళూరులో ఓ పబ్ కూడా ఉంది. ఆదివారం ఉదయం జగదీష్ ఉరి వేసుకోగా, కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు జగదీష్ కి లేవని ఇతడి ఫ్రెండ్ శ్రేయస్ చెప్పారు. కానీ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) -
‘పుష్ప’ నటుడు కేశవ అరెస్ట్
పంజగుట్ట:‘పుష్ప’సినిమాలో హీరో స్నేహితునిగా నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు జగదీశ్ అలియాస్ కేశవ (మచ్చా) ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడు. పంజగుట్ట పోలీసులు బుధవారం అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు పూర్వాపరాలిలా.. కాకినాడకు చెందిన యువ తి ఓ సంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే, సినిమాల్లో జూనియర్ ఆరి్టస్టుగా నటిస్తుండేది. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంగీత్‌నగర్‌లో అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌లో నివసిస్తుండేది. తల్లి దండ్రులు కాకినాడలోనే ఉండగా, ఆమెకు భర్తతో విడాకులు అయ్యాయి. కొంతకాలం కిందట ఆ యువతికి మణికొండలో నివసించే నటుడు జగదీశ్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కొద్దిరోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. జగదీశ్ ఆ యువతిని కాదని మరో యువతిని వివాహం చేసుకోవడంతో ఆమె జగదీశ్‌ను దూరం పెట్టసాగింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. రహస్యంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఈ క్రమంలో గత నెల 27న మహిళ నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చిన జగదీశ్.. సదరు మహిళ మరో యువకునితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కిటికీలోనుంచి తీశాడు. ఆ తర్వాత డోర్‌కొట్టి లోనికి వెళ్లి మీ బాగోతం మొత్తం రికార్డ్ చేశానంటూ వారిని బెదిరించాడు. ఫొటోలు డిలీట్ చెయ్యా లని ఎంత బతిమిలాడినా వినలేదు. దీంతో ఆ యువతి, యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా ఫోన్లో వేధించాడు. 29వ తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటో పంపించి.. ఇలాంటి ఫొటోలుఇంకా చాలా ఉన్నాయనీ, అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరుసటిరోజు యువతి బంధువులు జగదీశ్ వేధింపులను పోలీసులకు వివరించగా ఆ మేరకు కేసు పెట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు జగదీశ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): చంద్రబాబుకు సెంట్రల్ జైల్లో పూర్తి భద్రత ఉందని, దీనిపై అవాస్తవ వార్తలను నమ్మొద్దని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం, ఆయనను చంపేస్తామంటూ మావోల పేరుతో వచ్చిన లేఖ, జైల్లో పెన్ కెమెరాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సెంట్రల్ జైల్లో శుక్రవారం రాత్రి వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని, 24 గంటలూ సెక్యూరిటీతో పాటు అడిషనల్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఈ నెల 19న చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో ఆయనను బ్లూ జీన్ యాప్ ద్వారా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టామని, అందులో చంద్రబాబు కొన్ని విషయాలను న్యాయమూర్తికి తెలిపారని, వాటిని లెటర్ రూపంలో తిరిగి ఆయన ఇస్తే దానిని తాము కోర్టుకు పంపామన్నారు. జైలు చుట్టూ ఐదు వాచ్‌టవర్స్ ఉన్నాయని, గంటకోసారి గార్డ్ సెర్చ్ జరుగుతోందని చెప్పారు. జైలు వాటర్ ట్యాంక్ వైపు డ్రోన్ తిరిగినట్టు నార్త్ ఈస్ట్ వాచ్‌టవర్ గార్డు నుంచి సమాచారం వచ్చిందని, అయితే ఆ డ్రోన్ క్లోజ్డ్ జైలు వైపు రాలేదని, దీనిపై సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతోందన్నారు. మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీది.. చంద్రబాబును చంపేస్తామంటూ మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీదిగా గుర్తించినట్టు తెలిపారు. జైలు నుంచి చంద్రబాబు రాశారంటూ బయటకొచ్చిన లెటర్‌కు జైలు ముద్ర, సూపరింటెండెంట్ సంతకం లేదన్నారు. చంద్రబాబు ప్రింటెడ్ సంతకాన్ని తీసి దానిపై వేసి వైరల్ చేస్తున్నారని తెలిపారు. అలాగే జైల్లోకి వచ్చే ప్రతి ఖైదీని పూర్తిగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తామన్నారు. శ్రీనివాస్ అనే ఖైదీ రిమాండ్‌కు వచ్చినప్పుడు అతని వద్ద ఒక బటన్ కెమెరా ఉన్నట్టు గుర్తించామన్నారు. జైలు లోపలికి అనుమతించే ముందు అతని దుస్తులు తనిఖీ చేస్తుంటే అది లభించిందని తెలిపారు. అందులో ఎలాంటి జైలు ఫుటేజీ లేదని, ఆ కెమెరాను స్వాదీనం చేసుకుని.. పోలీసులకు అప్పగించామని, ఆ కెమెరాను ఎందుకు తెచ్చారనే విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరారన్నది పూర్తి అవాస్తవమన్నారు. చంద్రబాబు కుడికంటి కేటరాక్ట్ ఆపరేషన్‌కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులు పరీక్షలు చేశారని, కొంతకాలం తర్వాత అయినా ఆపరేషన్ చేయించుకోవచ్చని తెలిపారని వివరించారు. ఆయన ఆరోగ్యంపై తప్పుడు రిపోర్టులు విడుదల చేయడంలేదని, వాటిని ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిస్తున్నట్టు తెలిపారు. జైల్లో చంద్రబాబును తాము కలవాలన్నా ఏడుగురు అధికారులు కలిస్తేనే.. అది సాధ్యమన్నారు. చంద్రబాబు తనకున్న ఎలర్జీలపై గతంలో ప్రభుత్వ వైద్యులకు చెప్పారని, దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు రెండు లెటర్లు కూడా రాశామన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి ఎలాంటి చికిత్స అవసరమో తెలపాలని ఆయన భార్య భువనేశ్వరికి, ఇదే విషయాన్ని కోర్టుకూ తెలియజేసినట్టు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట సైతం 24 గంటలూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పకడ్బందీగా గస్తీ ఏర్పాటు చేసినట్టు రవికిరణ్, జగదీ‹Ù వివరించారు. -
హీరోగా శివారెడ్డి.. ట్రైలర్ విడుదల
శివారెడ్డి, జాష్ణిని, వనితా రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రెంట్’. రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వంలో ‘బలగం’ జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా వచ్చిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘రెంట్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది’’ అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత నేను హీరోగా చేసిన చిత్రం ‘రెంట్’. ఇందులో థ్రిల్లింగ్ కథ, కామెడీ, యాక్షన్, సందేశం ఉన్నాయి’’ అన్నారు శివారెడ్డి. ‘‘నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు వనితా రెడ్డి. -
Yamudu Movie: ‘యముడి’పై కొత్త చిత్రం
తెలుగు తెరపై యముడి కేరెక్టర్ ఓ సక్సెస్ ఫార్ములా. ఇప్పటికే యముని వేషాలతో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ఆదరించారు. కొన్ని చిత్రాలు అయితే బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అయితే ఈ మధ్య కాలంలో యముని కాన్సెప్ట్‌తో కొత్త చిత్రమేది రాలేదు. కానీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు మరోసారి యమలోకాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు జగదీష్ ఆమంచి. జగన్నాధ పిక్చర్స్ పతకం పై స్వీయదర్శకత్వంలో నూతన నటీనటులతో ‘యముడు’అనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ధర్మో రక్షతి రక్షితః ఉప శీర్చిక. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘ఇదొక ఒక థ్రిల్లర్ చిత్రం. కథ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది. ఆగష్టు మొదటి వారం లో షూటింగ్ ప్రారంభం అవుతుంది’అని దర్శకనిర్మాత జగదీష్ తెలిపారు. ఈ చిత్రానికిష్ణు కెమెరా మాన్ గా వ్యవహారిస్తుండగా భవాని రాకేష్ సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. -
యాక్షన్ థ్రిల్లర్ ఆరంభం
సందీప్ మాధవ్, కేథరిన్ థెరిస్సా జంటగా నూతన చిత్రం షురూ అయింది. సోమా విజయప్రకాష్ సమర్పణలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు. అశోక్ తేజ దర్శకుడు. తొలి సీన్‌కి నిర్మాత సి. కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు సంపత్ నంది క్లాప్ ఇచ్చారు. నిర్మాతలు ప్రసన్నకుమార్, పి. కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘పోలీస్ పాత్రలో నటించాలన్న నా ఆశ ఈ సినిమాతో నేరవేరింది’’ అన్నారు సందీప్ మాధవ్. ‘‘స్క్రీన్ ప్లే బేస్డ్ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది’’ అన్నారు అశోక్ తేజ. ‘‘సినిమా పూర్తయ్యేవరకూ కంటిన్యూ షెడ్యూల్ జరుపుతాం’’ అన్నారు పల్లి కేశవరావు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సహనిర్మాతలు: రొంగల శివశంకర్, గౌటి హరినాథ్. -
సాయిచంద్, జగదీశ్ కుటుంబాలకు కోటిన్నర చొప్పున సాయం.. కేటీఆర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన భారత్ రాష్ట్ర సమితి యువ నాయకుల కుటుంబాలను ఆదుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారకరామారావు వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమంలో గాయకుడిగా ప్రజల్లో చైతన్యం రగిల్చిన రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సాయిచంద్ (ఫైల్) ఈ యువ నాయకుల కుటుంబాలకు కోటిన్నర రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒకనెల వేతనంతో ఈ సాయం అందించనున్నట్లు శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాకు చెప్పారు. వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, భార్యకు కోటి రూపాయల లెక్కన అందిస్తామని పేర్కొన్నారు. జగదీశ్ (ఫైల్) కాగా, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూ వేదసాయిచంద్ ఆకస్మికంగా మరణించడంతో ఆయన భార్య వేద రజనికి అదే సంస్థ చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయిచంద్ కుటుంబాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్ బాల్కసుమన్, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పరామర్శించారు. రజనికి రూ.1.5 కోట్ల సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. -
లైంగికదాడి కేసులో 8 మంది అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో సంచలనం రేకెత్తించిన యువతిపై లైంగికదాడి కేసులో 8 మంది నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ డి.శ్రీని వాసరెడ్డి తన కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి కోవూరు మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న తన అక్క ఇంటికొచ్చింది. ఆమె అక్క గర్భిణి కావడంతో నెల్లూరులోని ఆస్పత్రిలో సిజేరియన్ చేశారు. అక్కకు తోడుగా ఆమె ఆస్పత్రి లో ఉంటున్నారు. ఈ నెల 10న యువతి మందుల కోసం గాంధీబొమ్మ సెంటర్ వద్దకొచ్చింది. నె ల్లూరుకి చెందిన పాతనేరస్తులైన భాను విష్ణువర్ధన్ అలియాస్ లడ్డసాయి, జగదీష్ అలియాస్ డి యోసాయి, యుగంధర్ అలియాస్ యుగి, ఎ.సుజన్‌కృష్ణ అలియాస్ చింటూ ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని..కత్తితో బెదిరించి కొండాయపాళెంలోని ఖాళీ స్థలంలో లైంగికదాడి చేశారు. అనంతరం వారి స్నేహితులైన భాను సాయివర్ధన్, షేక్ హుస్సేన్‌బాషా అలియాస్ కేటీఎం, సాయిసాత్విక్, కె.అజయ్, రేవంత్‌లను పిలిపించి వారితో కూడా లైంగికదాడి చేయించారు. యువతి కేకలను గమనించిన స్థానికులు ‘దిశ’కు కాల్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా దుండగులు పారి పోయారు. ఘటనాస్థలిలో బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్‌లు, ఆటో నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆదివారం గొలగమూడి క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చే శారు. డియోసాయి పరారీలో ఉన్నాడు. -
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్ హఠాన్మరణం
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతిచెందారు. హనుమకొండలోని తన నివాసంలో జగదీష్ గుండెపోటుకు గురికాగా, వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించేలోపే జగదీష్ తుదిశ్వాస విడిచారు. జగదీష్.. ఏప్రిల్ 1న తొలిసారి గుండెపొటుకు గురికాగా భార్య రమాదేవి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల అప్పుడు ప్రాణాపాయం తప్పినా సరిగ్గా 51 రోజుల వ్యవధిలోనే మరోసారి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. జగదీష్ ఇకలేరనే వార్త తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం ములుగు జిల్లా మల్లంపల్లికి తరలించారు. మల్లంపల్లికి చెందిన జగదీష్ ఏటూరునాగారం నుంచి జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఇటీవల ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను సైతం పార్టీ అధినేత కేసిఆర్ జగదీష్‌కు అప్పగించారు. నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో జగదీష్ చురుగ్గా పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధిగా పార్టీ అధ్యక్షులుగా ములుగు జిల్లాలో జగదీష్ చేసిన సేవలు స్మరిస్తూ అభిమానులు పార్టీ నేతలు నివాళులర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జగదీష్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
దంతేవాడ పేలుడు సూత్రధారి ఇతనే.. మావోయిస్టు దళంలో కీలక పాత్ర..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత దంతేవాడ జిల్లాలోని అరన్పూర్ పేలుడు సూత్రధారి జగదీష్ చిత్రం తెరపైకి వచ్చింది. ఇతను చాలా కాలంగా బస్తర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. నివేదికల ప్రకారం, అరన్‌పూర్‌లో జరిగిన పేలుడులో జగదీష్ మొత్తం సంఘటనకు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈ నక్సలైట్ నాయకుడి నేతృత్వంలోనే దంతేవాడలోని అరన్‌పూర్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ బలి అయ్యారు. గతంలో జగదీష్ కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో మాత్రమే యాక్టివ్‌గా ఉండేవాడు. అయితే పెద్ద పెద్ద సంఘటనలను నిరంతరం అమలు చేయడంలో విజయం సాధించడంతో జగదీష్ క్యాడర్ పెరిగింది. నక్సలైట్ల సైనిక దళంలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. జగదీష్ ప్రాథమికంగా జాగరగుండ తూర్పు గ్రామానికి చెందినవాడు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. అరన్పూర్ పేలుడు తర్వాత జగదీష్‌తో పాటు మరో 12 మంది నక్సలైట్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్భా డివిజనల్ కమిటీలో చురుగ్గా ఉన్న నక్సల్స్ జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిద్మా, ఉమేష్, దేవే, నంద్ కుమార్, లఖ్మా, కోసా, ముఖేష్, చైతు, మంగ్తు, రాన్సాయి, జయలాల్, బమన్, సోమ, రాకేష్, భీమాతో పాటు మరికొందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందరిపై యూఏపీఏ చట్టం ప్రయోగించారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు.. -
యూజీసీ చైర్మన్‌గా తెలుగు తేజం జగదీశ్
న్యూఢిల్లీ/సాక్షి, నల్లగొండ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)గా ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. కమిషన్‌కు ఛైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ డిపి సింగ్ పదవీకాలం ముగియడంతో డిసెంబర్ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీశ్ ఎంపికయ్యారు. యూజీసీకి చైర్మన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి జగదీశ్ కుమార్. 1961లో డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, ఇప్పుడు ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ నియమితులయ్యారు. 60 ఏళ్ల జగదీశ్ కుమార్ ప్రస్తుతం జేఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. వీసీగా పదవీకాలం గతేడాదే ముగిసినా ఆయనను కొనసాగించారు. జేఎన్‌యూలో ఆయన వీసీగా ఉన్నప్పుడు 2016లో విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదు కావడం, అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించదలిచిన కార్యక్రమాన్ని వీసీ వద్దనడం, విద్యార్థులు వీసీ కార్యాలయాలనికి తాళాలేయడం, 2019లో జరిగిన స్నాతకోత్సవ వేదికపై దాదాపు ఆరు గంటలపాటు మానవవనరుల శాఖ మంత్రిని నిర్బంధించడం వంటి అనేక వివాదాస్పద సంఘటనలు జరిగాయి. నల్లగొండ వాసి... తెలుగువాడైన జగదీశ్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తిమండలం మామిడాల గ్రామం. పాఠశాల విద్యను స్వగ్రామంలో, ఏడవ తరగతి నుంచి ఇంటర్ వరకు మిర్యాలగూడలో చదివారు. డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్‌లో చదివారు. ఆ తరువాత ఐఐటీ మద్రాసులో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తరువాత పోస్ట్ డాక్టో్టరల్ రీసెర్చ్ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 1995లో ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్’ అందుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సాంçస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ పాలకమండలి చైర్మన్‌గా, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా, యూజీసీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సభ్యునిగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఫెలో అందుకున్నారు. సెమీకండక్టర్ డివైజ్ డిజైన్, మోడలింగ్ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్‌లాల్ వాధ్వా గోల్డ్ మెడల్ లభించింది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ – సెమీకండక్టర్ అసోసియేషన్ అందించే మొట్టమొదటి ఐఎస్ఏ అండ్ వీఎస్‌ఐ టెక్నోమెంటర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు. నూతన బాధ్యతలు చాలెంజింగ్‌గా ఉంటాయని భావిస్తున్నా. నూతన జాతీయ విద్యా విధానం ఎంత తొందరగా అమల్లోకి వస్తే దేశానికి అంత మేలు జరుగుతుంది. ఇదే విషయమై త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశమవుతాను. మల్టీడిసిప్లినరీ కోర్సుల విషయమై చర్చిస్తాం. ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీని ప్రకటించింది. విద్యను మరింత సులభతరం చేసే డిజిటల్ సాంకేతికత కూడా ప్రాధాన్య జాబితాలో ఉంటుంది. -
పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పు
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చడంతో పాటు ఉత్తరాఖండ్‌కు రాష్ట్రపతి కొత్త గవర్నర్‌ను నియమించారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న బన్వరిలాల్ పురోహిత్‌ను పంజాబ్ గవర్నర్‌గా నియమించారు. ఇప్పటివరకు ఆయన పంజాబ్ గవర్నర్ బాధ్యతలు అదనంగా పర్యవేక్షిస్తున్నారు. నాగాలాండ్ గవర్నర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆర్ఎన్ రవిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అసోం గవర్నర్ జగదీశ్ ముఖికి నాగాలాండ్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఇటీవలే ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఉన్న మౌర్య రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గురి్మత్ సింగ్‌ను నియమించారు. 2016లో సింగ్ ఆర్మీ నుంచి రిటైరయ్యారు. చైనాతో మిలటరీ వ్యవహారాల్లో ఆయన అనుభవజ్ఞుడు. -
గ్రౌండ్ లెవల్లో టీఆర్ఎస్ బలంగా ఉంది
-
ఒక్కటయ్యారు
సినీ నటి అర్చన(వేద) వివాహం పారిశ్రామికవేత్త జగదీష్‌తో హైదరాబాద్‌లో జరిగింది. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు వీరి పెళ్లి ఘనంగా జరిగింది. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు, ‘కళాబంధు’టి. సుబ్బరామిరెడ్డి, నటుడు మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సురేష్ కొండేటి, డైరెక్టర్ ఓంకార్, నటీనటులు మంచు లక్ష్మి, మధుమిత, ఆలీ, శివబాలాజీ, సమీర్, అశ్విన్‌బాబు, రవిశంకర్, యాంకర్ సుమతో పాటు పలువురు సినీ ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
మహిళను విక్రయించిన బావ?
గుజరాత్ తీసుకెళ్లి ఘాతుకం బోథ్ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన లలితను ఆమె బావ (భర్త సోదరుడు) గుజరాత్ తీసుకెళ్లి అమ్మేసినట్లు తెలుస్తోంది. బోథ్ మండలం సొనాలకు చెందిన లలిత తల్లి గంగుబాయి, సోదరుడు జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లలితను మూడేళ్ల క్రితం నేరడిగొండ మండలం కిష్టాపూర్‌కు చెందిన రమేశ్ కిచ్చి పెళ్లి చేశారు. వీరికి కూతురు శివానీ పుట్టిన ఏడాదికే రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో లలిత కిష్టాపూర్‌లోని అత్తవారింట్లోనే ఉంటూ స్థానిక పాఠశాలలో రోజు వారి వేతనం కింద అటెండర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా, ఆమె బావ చౌహాన్ అర్జున్ తరచూ లలితను వేధించేవాడు. నెల రోజులుగా లలిత సమాచారం తెలియకపోవడంతో సోదరుడు జగదీశ్ కిష్టాపూర్‌కు వెళ్లి విచారించాడు. తన సోదరిని ఇచ్చోడకు చెందిన రేఖ, శారదలతో కలిసి అర్జున్ గుజరాత్లో అమ్మినట్లు తెలిసిందని జగదీశ్ పేర్కొన్నాడు. అయితే అర్జున్ తనకేమీ తెలియదంటున్నాడు. కాగా మంగళవారం రాత్రి మద్యం తాగి తమ ఇంటికి వచ్చిన అర్జున్ దుర్భాషలాడి దాడికి యత్నించాడని వాపోయాడు. అదే రోజు సాయంత్రం తన సోదరి లలిత ఫోన్ చేసి తనను రూ.లక్షా 80వేలకు గుజరాత్లో అమ్మేశారని తెలిపినట్లు జగదీశ్ పేర్కొన్నాడు. కాగా తన సోదరిని అర్జున్ గుజరాత్‌కు విక్రయించినట్లు బుధవారం నేరడిగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మాత్రం అదృశ్యం కేసు నమోదు చేసినట్లు జగదీశ్ తెలిపాడు. -
వీడని విభేదాలు
► సాలూరు టీడీపీలో రాజుకుంటున్న వివాదం ► సంధ్యారాణి అనుచరులపై మొదలైన కక్ష సాధింపు ► సీఎం ఆదేశాలతో రెచ్చిపోతున్నారని భంజ్‌దేవ్‌పై మండిపాటు ► జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీష్‌కు ఫిర్యాదు చేసిన సంధ్యారాణి వర్గీయులు సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఊహించిందే జరిగింది. సాలూరు టీడీపీలో విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. నియోజకవర్గ వ్యవహారాల్లో వేలు పెట్టొద్దని సీఎం ఆదేశించిన వారం వ్యవధిలోనే ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అనుచరులపై కక్ష సాధింపు ప్రారంభమయ్యింది. నియోజకవర్గ ఇన్చార్జి భంజ్‌దేవ్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, తమను అన్నింటా తొక్కి పెడుతున్నారని సంధ్యారాణి అనుచరులు జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌కు నేరుగా ఫిర్యాదు చేసి తమ ఆవేదన వెళ్ల గక్కారు. మొదటినుంచీ వివాదమే...: తొలి నుంచీ భంజ్‌దేవ్, సంధ్యారాణి వర్గీయుల మధ్య పొసగడం లేదు. రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరినొకరు దెబ్బకొట్టుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. కొన్నాళ్లు పార్టీ ఇన్చార్జిగా సంధ్యారాణి చేయగా, ఆ తర్వాత ఇన్చార్జి బాధ్యతల్ని భంజ్‌దేవ్‌కు అప్పగించారు. ఎమ్మెల్సీ హోదాలో సంధ్యారాణి పనులు చేసుకుంటుండగా, నియోజకవర్గ ఇన్చార్జ్ హోదాలో భంజ్‌దేవ్ చక్రం తిప్పుతున్నారు. ఇటీవల రాజధానిలో జరిగిన సమీక్షలో సీఎం జోక్యం చేసుకుని నాలుగైదు నెలల వరకు నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని సంధ్యారాణిని ఆదేశించారు. ఇదే అదనుగా ఆ రోజు నుంచే సం«ధ్యారాణి వర్గీయులపై కక్ష సాధింపు కార్యక్రమాలు మొదలయ్యాయి. ఎవరైనా తనవద్దకే రావాలని, ఇప్పుడేం చేస్తారో చూస్తానంటూ భంజ్‌దేవ్ బెట్టు కాయడాన్ని ప్రత్యర్థి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కమిటీల నియామకంలో వివక్ష: పార్టీ కార్యక్రమాలకు భంజ్‌దేవ్ డుమ్మా కొడుతున్నారని, కమిటీలను ఇంట్లో కూర్చొని వేస్తున్నారని, తన ఇంట్లో పనిచేసే మనుషులకే కమిటీలో చోటు కల్పిస్తున్నారని, సాలూరు ఎంపీపీ జెంటిల్మెన్ ఒప్పందాన్ని అమలు చేయకుండా దాట వేస్తున్నారని, తమను రాజకీయంగా అణగదొక్కుతున్నారని సంధ్యారాణి వర్గీయులు జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో ప్రస్తుతం ఎంపీపీ బోని ఈశ్వరమ్మకు రెండున్నరేళ్లు, సారిక ఎంపీటీసీకి మిగతా రెండున్నరేళ్లు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని, ఇప్పుడా ఒప్పందాన్ని అమలు చేయకుండా భంజ్‌దేవ్ అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. పథకాల లబ్ధిదారుల ఎంపికలో వివక్ష చూపుతున్నారని ఆక్రోశం వెళ్లగక్కారు. దీనిపై జగదీష్ స్పందిస్తూ భంజ్‌దేవ్‌తో మాట్లాడుతానని, అప్పటికీ స్పందన లేకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. భంజ్‌దేవ్‌పై ఫిర్యాదు చేసిన వారిలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అత్యాన తిరుపతిరావు, డొంకా అన్నపూర్ణమ్మ, సారిక మాజీ ఎంపీటీసీ రామన్నదొర, తుండ మాజీ సర్పంచ్ ధర్మరాజు, మరుపల్లి మాజీ సర్పంచ్ సత్యం తదితరులు ఉన్నారు. -
పంట కాపాడామనడం బూటకం
అనంతపురం అర్బన్: జిల్లాలో ఎన్నడూ లేనంత దుర్భర కరువు నెలకొందని, తక్షణం కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ డిమాండ్ చేశారు. రెయిన్ గన్లతో పంటను కాపాడామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఒట్టి బూటకమని ధ్వజమెత్తారు. రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలనే డిమాండ్‌తో రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట రెయిన్‌గన్‌తో బైఠాయించి ధర్నా నిర్వహించారు. జిల్లాలో 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించడం ఒక తంతుగా మారిందన్నారు. దీన్ని వల్ల ఒరిగేదేమి లేదని విమర్శించారు. ఈ ఏడాది జిల్లాలో భయానక పరిస్థితులున్నా ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోడం లేదన్నారు. కరువు నేపథ్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
పుస్తకం చూశాకే నిజం తెలిసింది - దాసరి నారాయణరావు
‘‘గుంటూరు జిల్లాకు చెందిన జగదీష్ ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖులపై పరిశోధనాత్మక రచనలు చేయడం అభినందించదగ్గ విషయం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారు ఇంత మంది ఉన్నారన్న నిజం ‘గోదారి గట్టోళ్ళు.. గట్సున్న గొప్పోళ్ళు’ పుస్తకం చూశాకే తెలిసింది. ఇంత మంచి ప్రయత్నం చేసిన జగదీష్‌కు అభినందనలు’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. రాజమండ్రి లో పోలీస్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పనిచేస్తున్న బీఎస్ జగదీష్ రచించిన ‘గోదారి గట్టోళ్ళు.. గట్సున్న గొప్పోళ్ళు’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రేలంగి నరసింహారావు, రాజా వన్నెంరెడ్డి, కాశీ విశ్వనాథ్, నటుడు సారిక రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు -
పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం
విచారణ కోసం స్టేషన్‌కు తీసుకువచ్చిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు యత్నించారు. విశాఖ జిల్లా ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా పార్వతీపురంనకు చెందిన జగదీష్, శ్రీకాకుళం జిల్లా వాసి గోపీ అనే యువకులు కొన్నాళ్లుగా విశాఖ కైలాసగిరిలో మకాం పెట్టారు. ఆప్రాంతానికి వచ్చే ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారిద్దరినీ వారం క్రితం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వారు స్టేషన్లోనే ఉన్నారు. తీవ్ర ఆందోళన చెందిన యువకులిద్దరూ సోమవారం రాత్రి నిద్రమాత్రలు మింగారు. వెంటనే గమనించిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో తిరిగి గుట్టుచప్పుడు కాకుండా స్టేషన్‌కు తరలించారు. రిమాండ్ చేయకుండా విచారణ పేరుతో యువకులను స్టేషన్లో నిర్బంధించటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. యువకుడి మృతి
కళ్యాణదుర్గం: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఒంటిమిట్ట గ్రామానికి చెందిన జగదీష్(22) బైక్ పై వెళ్తుండగా.. రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి రాయదుర్గం వస్తున్న సమయంలో రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ నటి పెన్ డ్రైవ్ పోయింది...
కాల్‌డేటాను సేకరించారు.. అడ్రస్ కోసం గాలించారు.. ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించారు... పోలీసు పెట్రోవాహనంలో నలుగురు క్రైం పోలీసులు దిల్ షుక్నగర్కు పరుగులుతీసి ఎట్టకేలకు కావాల్సిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంతకు అతడు దొంగిలించింది ఏంటో తెలుసా..? వింటే ఆశ్చర్యపోతారు. అవును మరి ఆయన దొంగిలించింది పెన్‌డ్రైవ్. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్‌షుక్‌నగర్‌లో నివసించే జగదీష్ అనే వ్యక్తి ఆక్యుపంక్షర్ థెరపిస్టుగా పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఫిలింనగర్లో నివసించే సినీ నటి రాధా ప్రశాంతికి పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి జగదీష్ ఆమెతో ఫోన్లో అందుబాటులో లేకుండా పోయాడు. అయితే తన ఇంట్లో పెన్‌డ్రైవ్ చోరీకి గురైందని అది జగదీష్ చోరీ చేశాడంటూ ఆమె మూడు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు జగదీష్ కోసం గాలింపు చేపట్టారు. మూడు రోజులు అతని ఇంటి వద్ద మాటువేశారు. రేయింబవళ్లు అతడి కోసం వెతికేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. తీరా జగదీష్‌ను విచారిస్తే ఆ పెన్‌డ్రైవ్ తాను తీయలేదని తెలిపాడు. పెన్‌డ్రైవ్ పోయిందని సినీనటి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు చేసి హడావుడికి అవాక్కయ్యారు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయిదు ఖరీదైన కార్లు చోరీకి గురయ్యాయి. ఇందులో ఫార్చునర్లాంటి ఖరీదైన కారు కూడా ఉంది. వీటి కోసం గాలించాల్సిన పోలీసులు ఓ పెన్‌డ్రైవ్ దొంగ కోసం మూడు రోజులుగా వేట సాగించారని తెలిసి.. జనం ముక్కున వేలేసుకున్నారు. -
ప్రత్యేక హోదా కోసం 1 నుంచి బస్సుయాత్ర
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి 10వరకు బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ జగదీశ్ వెల్లడించారు. ఆదివారం అనంతపురంలో జరిగిన ఉద్యోగుల ప్రతిజ్ఞా దినోత్సవంలో జగదీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్ మాట్లాడుతూ... బస్సుయాత్ర ద్వారా ప్రజల్లో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ప్రకటించే విషయంలో కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. ఆగస్టు 11వ తేదీలోగా పార్లమెంట్లో బిల్లు పెట్టకుంటే ఏపీ బంద్‌కు పిలుపునిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ సీజే చంద్రశేఖర్ మాట్లాడుతూ..బిహార్‌కు 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన మోడీ ప్రభుత్వం... విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను విస్మరిస్తోందని విమర్శించారు. ఈ విషయంలో పట్టించుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం చేతగాక చేతులెత్తేసిందన్నారు. -
పారిపోయిన వరుడితోనే పెళ్లి..!
రాయచూరు రూరల్(అనంతపురం) : పెళ్లంటే నూరేళ్ల పంట అనే సామెతకు వ్యతిరేకంగా పారిపోయిన వరుడితో తిరిగి పెళ్లి జరిగిన వైనం అనంతపురం జిల్లా రాయచూరు తాలూకాలో జరిగింది. బుధవారం తాలూకాలోని మంచాలపూర్ హూవిన ఆంజినేయ స్వామి తాలూకాలోని కొత్తదొడ్డికి చెందిన జగదీశ్‌కు శక్తినగర్‌కు చెందిన జ్యోతితో వివాహానికి ముహూర్తం పెట్టారు. పెద్దల సమక్షంలో పెళ్లి కుదిరింది. ఏడాది క్రితం ఇద్దరు ప్రేమించుకున్నారు. మంగళవారం రాత్రి దేవాలయంలో వరుడు, వధువు బంధువులు వచ్చారు. బుధవారం ఉదయం వరుడు జగదీశ్ ఎవరికి తెలపకుండ కొత్తదొడ్డికి వెళ్లాడు. దీంతో వధువు జ్యోతి తరుపున బంధువులు పిల్లవాడి ఆచూకీ కోసం ఎదురు చూసారు. ఉదయం 9 గంటలకు ముహూర్తం ఉండేది. మధ్యాహ్నం 12 గంటలకు జగదీశ్ సోదరుడు ఫోన్ చేసి అరా తీయగా వరుడు జగదీశ్ పెళ్లి పీటలపై వచ్చి కూర్చొని వధువు మెడలో తాళి కట్టాడు. దీంతో బంధువులు,స్నేహితులు, శ్రీశైలం భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎంపీపీలు టీఆర్ఎస్కే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో శుక్రవారం జరిగిన మండల పరి షత్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 36 మండలాలకుగాను 24 ఎంపీపీలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ మరోసారి సత్తా చాటింది. కాగా కాంగ్రెస్ పార్టీ 10 మండలాలను హస్తగతం చేసుకోగా... టీడీపీ ఈ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిం ది. ధర్పల్లిలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకోగా చివరకు ఇండిపెండెంట్ అభ్యర్థి టాస్ ద్వారా ఎన్నికయ్యారు. భిక్కనూర్ మండల పరిషత్ ఎన్నికలకు మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 8 మందే హాజరు కావడంతో కోరం లేని కారణంగా అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. ఎన్నికల సంఘం ఆదేశం ప్రకా రం తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తామని చెప్పా రు. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో ఎంపీపీల ఎన్నిక ప్రక్రి య జరగ్గా.. చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల పోలీసులు లాఠీలను ఝుళి పించి ఆందోళనకారులను చెదరగొట్టారు.ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పలు మండలాల్లో తమ పార్టీకి సీటు దక్కే అవకాశం లేదని భావించిన పలువురు బీజేపీ, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్ద తు తెలిపారు. కాగా మంత్రి పోచారం , టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిందేలు ప్రాతి నిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మొ త్తానికి మొత్తం మండలాలను స్వీప్ చేశారు.బాల్కొండ నియోజకవర్గం లో మొత్తం ఐదు మండలాలకు ఎమ్మెల్యే వేముల ప్రశాం త్‌రెడ్డి నాలుగు మండలాల్లో తమ అభ్యర్థులను గెలిపిం చారు. పీసీసీ మాజీ చీఫ్, శాసనమండలి పక్షనేత డీఎస్ ఐదింటికీ నాలుగు మండలాల్లో ఎంపీపీలను దక్కించుకున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిం చిన బోధన్‌లో నాలుగు మండలాలకు నాలుగు కాంగ్రెస్‌కు దక్కించుకోగా.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నాలు ఫలించలేదు.జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా ఎగిరింది. ఒక్క బోధన్‌లో ఆ పార్టీకి చుక్కెదురైంది. రెంజల్లో పోలీసుల లాఠీచార్జి ఎంపీపీల సందర్భంగా జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రెంజల్ మండల ఎన్నికలకు బీజేపీ పార్టీకి చెందిన దీప కాంగ్రెస్ ఎంపీటీసీలతో కలిసి హాజరు కావడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు సిద్ధం కావడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. డిచ్పల్లి ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి దాసరి ఇందిర (యానంపల్లి), కో-ఆప్షన్ సభ్యుడిగా శ్యాంసన్(నడిపల్లి) ఎన్నిక కాగా, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థులు ఏడుగురు తీవ్ర నిరసనలు తెలపడంతో ఉపాధ్యక్షుడి ఎన్నిక శనివారానికి వాయిదా వేశారు. ధర్పల్లి ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి కో-ఆప్షన్ మెంబర్‌గా అబ్దుల్ మజీద్ (టీఆర్ఎస్)ను ఎన్నికున్న అనంతరం ఎన్నికల అధికారి నియమ నిబంధనలు చెబుతున్న సమయంలో దుబ్బాక ఎంపీటీసీ సభ్యుడు కోతి నర్సయ్య (కాంగ్రెస్)ను కిడ్నాప్ చేశారని అతడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఫిర్యాదు పత్రాన్ని ఎన్నికల అధికారికి పోలీసులు అందజేశారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు నిరసన ప్రారంభించారు. కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు సైతం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం బయట టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళన ప్రారంభించారు.ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో సీఐ వాహనం ధ్వంసమైంది. గౌరారం స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి ఇమ్మడి గోపిని అరెస్ట్ చేయాలని ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు నిర్వహించిన ఎన్నికల్లో టాస్ ద్వారా గోపి ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. టీఆర్ఎస్ స్వీప్... డీఎస్, సుదర్శన్‌రెడ్డిలకు ఊరట... టీఆర్ఎస్ మూడు నియోజకవర్గాల్లో మొత్తానికి మొత్తం ఎంపీపీలను గెలిచి స్వీప్ చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యులను టీఆర్ఎస్ గెలుచుకుంది. బాన్సువాడ నియోజకవర్గంలో నాలుగు మండ ల పరిషత్‌లపై గులాబీ జెండా రెపరెపలాడింది. జుక్కల్‌లో ఐదు మండలాలు టీఆర్ఎస్ పరం అయ్యాయి. కాగా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, భీమ్‌గల్, వేల్పూరు, కమ్మర్పల్లి మండలాలను టీఆర్ఎస్ దక్కించుకోగా, మోర్తాడ్ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. కాగా పిట్లం మండ లం వైస్ ఎంపీపీ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. పదవి కోసం టీఆర్ఎస్ నుంచి నర్సాగౌడ్, జేఏసీ నుంచి జగదీష్ మధ్య పోటీ నెలకొనగా చివరకు టీఆర్ఎస్కు చెందిన నర్సాగౌడ్‌ను పదవి వరించింది. జుక్కల్ మండల అధ్యక్ష పదవికి కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు హన్మాగౌడ్ మద్దతివ్వడంతో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. కాగా శాసనమండలి పక్షనేత డీఎస్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్, బోధన్‌లలో ఎంపీపీ పదవులు దక్కించుకున్నారు. నిజామాబాద్ రూరల్‌లో ఐదు మండలాలకు గాను ధర్పల్లిలో స్వతంత్ర అభ్యర్థికి ఎంపీపీ పీఠం దక్కగా... నాలుగు కాంగ్రెస్‌నే వరించాయి. బోధన్‌లో నాలుగింటికి నాలుగు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో లభించిన విజయం వారికి ఊరట కలిగించే అంశం. -
జగదీష్‌కు కన్నీటి వీడ్కోలు
రహమత్‌నగర్: బియాస్ నదిలో గల్లంతైన జగదీష్ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం రహమత్‌నగర్‌కు చేరుకోగా, సాయంత్రం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం నుంచి ఎదురుచూస్తున్న అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, జగదీష్ మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా బోరుమని విలపించారు. రోదనలు మిన్నంటాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అంబులెన్సులో జగదీష్ భౌతిక కాయాన్ని రహమత్‌నగర్‌లోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న అతడి ఇంటికి తీసుకొచ్చారు. పదహారు రోజులుగా కడసారి చూపు కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్న అతడి తల్లి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయింది. పలువురు ప్రముఖులు జగదీష్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, జూబ్లీహిల్స్ ఎమ్యెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్యెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు మురళీగౌడ్, ఎంఐఎం నాయకుడు నవీన్ యాదవ్, వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ ప్రపుళ్లరెడ్డి, కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ భవాని శంకర్, బీజేపీ నగర ప్రచార కార్యదర్శి కొలన్ సత్యనారాయణ, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ సాగర్, నరసింహ, సత్యనారాయణ, పీఎల్ ప్రకాశం, వైఎస్సార్ సీపీ నాయకుడు షేక్ షమీమ్, జేఎల్ మేరి, ఎమ్మార్పీఎస్ నాయకుడు అరుణ్ హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సందర్శన చివరి క్షణంలో వాయిదా పడింది. సాయంత్రం ఈఎస్ఐ శ్మశానవాటికలో జగదీష్ అంత్యక్రియలు జరిగాయి. -
ఈ బైక్‌ను మడతపెట్టొచ్చు..!
అవును.. మీరు చదివిందే కరెక్టే. కాస్త విచిత్రంగా అన్పించినా బైక్‌ను ఎంచక్కా మడతేసుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోవచ్చు. ఇలాంటి సౌకర్యం ఉన్న ఓ ఫోల్డబుల్ బైక్‌ను తయారు చేశారు రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి సమీపంలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు జగదీశ్, జాన్రిచర్డ్, కార్తీక్, సాయికిరణ్, అతీఫ్ అలీ. వీరు తయారు చేసిన ‘చెవ్రాన్ ఫోల్డబుల్ బైక్’ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ బైక్ మామూలు బైకుల్లా పెట్రోల్‌తో నడుస్తుంది. అగ్రికల్చర్ వీడర్ ఇంజిన్‌ను దీనికి అమర్చారు. హారన్, డిస్క్‌బ్రేక్, యాక్సిలేటర్, గేర్లు, సెల్ప్ స్టార్టర్, లైట్లు అన్ని ఉన్నాయి దీనికి. దీని సామర్థ్యం 53సీసీ. బరువు 15కిలోలు. లీటరు పెట్రోలుకు 70 కిలోమీటర్ల మైలేజ్. గంటకు 40 కిలోమీటర్ల వేగం. 110 కిలోల భారాన్ని సైతం మోస్తుందట. కానీ దీని తయారీ ఖర్చు ఎంతో తెలుసా.. కేవలం రూ.12వేలే. దీన్ని బీడీఎల్ అడిషనల్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ సీఎస్ కృష్ణప్రసాదరావు చూసి ‘బెస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ ’గా కితాబిచ్చారని విద్యార్థులు తెలిపారు. కొన్ని మోడిఫికేషన్స్ తర్వాత దీన్ని మార్కెట్లోకి తెస్తామంటున్నారీ విద్యార్థులు. వీరు తమ గైడ్స్ విజయ్‌కుమార్, యూజిన్ హ్యారీ సహా యంతో ఈ అద్భుతమైన బైక్‌ను రూపొందించారు. - న్యూస్‌లైన్, ఇబ్రహీంపట్నం -
చా..నిజమా
మారిన మనిషిగా చెప్పుకున్నా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌ను వదలని ప్రతికూలత బీ-ఫారాల కోసం రూ.లక్షలు గుంజుతున్నారని ఆరోపణలు ఓ సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారని విమర్శలు పార్వతీపురం టీడీపీలో వింత పరిస్థితి ‘నేను పూర్తిగా మారిన మనిషిని..నన్ను నమ్మండి..’ ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ..! ఇవి టీడీపీ అధినేత చంద్రబాబు మాటలని గుర్తొచ్చే సిందా..? సరిగ్గా ఇవే మాటలు వల్లిస్తున్నా మన జిల్లా టీడీపీ అధ్యక్షుడు ద్వారపు రెడ్డి జగదీష్‌ను ఎవరూ నమ్మడం లేదట..‘ఈ సారైనా గెలవాలి. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలి. నాకిది మంచి అవకాశం. పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించాలి.’ అని కృతనిశ్చయంతో ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ గత అనుభ వాల దృష్ట్యా ఇప్పటికీ ఆయనను ప్రతికూలత వెంటాడుతూనే ఉంది. బీ-ఫారాలకు రూ. లక్షలు వసూలు చేస్తున్నారని, ఓ సామాజిక వర్గాన్ని అణగదొక్కేస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌కు కాలం కలిసి రావడంలేదు. పూర్వం నుంచి ఆయన కుటుంబ వ్యక్తిత్వమో, వ్యవహార శైలో తెలియదు గానీ పార్వతీపురం ప్రజలు ఆ కుటుంబానికి పట్టం కట్టడం లేదు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆ కుటుంబానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఏదీ రాలేదు. టీడీపీలోకి వచ్చిన తర్వాత పార్వతీపురం నియోజకవర్గంలో ఆ కుటుంబ సభ్యు లు రెండు పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయారు. 1999లో ద్వారపురెడ్డి జగదీష్ వదిన ప్రతిమాదేవి ఎమ్మెల్యేగా పోటీ చేసి మరిశర్ల శివున్నాయుడు చేతిలో పరాజయం పాలవగా, 2004లో స్వయంగా జగదీష్ ఎమ్మెల్యేగా పోటీ చేసి శత్రుచర్ల విజయరామరాజు చేతిలో ఓట మి చవిచూశారు. ఇక ఆ తర్వాత పార్వతీపు రం శాసనసభ నియోజకవర్గం ఎస్సీజనరల్గా రిజర్వ్ కావడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశానికి దూరమయ్యారు. దీంతో మున్సిపల్ చైర్మ న్, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడమో, నేరుగా నామినేటెడ్ పోస్టులు పొందడమో మాత్రమే ఆయనకు ప్రత్యామ్నా యం. దీంతో గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున జగదీష్ భార్య శ్రీదేవి ప్యానెల్ పోటీ చేసింది. కానీ ఆ ఎన్నికల్లో కేవలం మూడు కౌన్సిలర్ స్థానాలు మాత్రమే దక్కడం తో చైర్పర్సన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయా రు. చివరికి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్ బలపరిచిన బొబ్బిలి చిరంజీవులు ఓటమి చెందారు. ఇలా ప్రతి ఎన్నికల్లో ప్రజల ఆదరాభిమానాలు పొందడంలో జగదీష్ విఫలమవుతున్నారు. ప్రతి విషయంలో తలదూర్చి ఇబ్బంది పెడతారని కొన్ని వర్గాలు..రోడ్డు విస్తరణలో అడ్డగోలుగా వ్యవహరించారని వ్యాపార వర్గాలు ఓ స్థిరమైన అభిప్రాయానికి వచ్చేయడంతో ఎన్నికలొచ్చేసరికి ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ, షరా మూమూలుగా ఓటమిని చవిచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ద్వారపురెడ్డి జగదీష్ ప్రజాదరణ ఎక్కువగా వైఎస్సార్సీపీలోకి జంప్ అవుతారని తెలుసుకుని, చేజారిపోతున్న నాయకు ల్ని ఆపకపోతే పార్టీ బలహీనమవుతుందన్న ఉద్దేశంతో హుటాహుటిన జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలను ఆయనకు అప్పగిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అందరికీ జగదీష్ పరిచయమయ్యారు. ఇప్పుడా హోదాతో పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగారు. తనకిదే మంచి అవకాశమని చైర్మన్ పోస్టుపై కన్నేశారు. తనకు పార్టీలో మరెవరూ పోటీ లేకుండా లైన్ క్లియర్ చేసుకున్నారు. కాంగ్రెస్ పరి స్థితి అగమ్యగోచరంగా తయారవడం, వైఎస్సార్సీపీలో సీట్లు ఖాళీలేకపోవడంతో వలస వచ్చిన నాయకుల తో పాటు టీడీపీ నేతలను కౌన్సిలర్లుగా బరిలో కి దించారు. అంతేకాకుండా ఓ సామాజిక వర్గ నేతతో ప్రత్యామ్నాయంగా ఇండిపెండెంట్ ప్యానెల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా ‘నేను మారిన మనిషిని. నాకిదే అవకాశం. గెలిపిస్తే రుణం తీర్చుకుంటాను’ అంటూ ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ఎన్నికల ఫండ్ కోసం... కానీ, నామినేషన్ వేసిన అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చేసరికి పార్టీ ఫండ్కని, ఎన్నికల ఖర్చుకని రూ. మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు వరకు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు తెల్లమొహం వేస్తున్న ట్లు తెలుస్తోంది. గత పదకొండేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తమనే డబ్బులడుగుతున్నారంటూ సొంతపార్టీ అభ్యర్థులే నివ్వెరపోతుం డగా, నేరకపోయి వచ్చామంటూ వలస అభ్యర్థులు వాపోతూ సన్నిహితు వద్ద తమ బాధను వెళ్లగక్కుతున్నట్లు పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంతంగా పోటీలో ఉంటాం ఈ క్రమంలో కొంతమంది అభ్యర్థులు డబ్బులిచ్చుకోలేక స్వతంత్రంగానే బరిలోకి దిగుతామంటూ తెగేసి చెప్పేస్తున్నట్లు తెలిసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే తమను అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారని, తమకు అన్యా యం చేశారని పట్టణంలోని ఓ సామాజిక వర్గం ఆవేదన చెందుతోంది. వైస్‌చైర్మన్ పదవి కూడా తమకు దక్కకుండా జగదీష్ కుట్రపూరితంగా వ్యవహరించారని పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేయాలన్న యోచనలో ఆ సామాజిక వర్గ నేతలు ఉన్నట్లు సమాచారం. మొత్తానికి జగదీష్‌ను ఏదో ఒక రకంగా ప్రతికూల పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి. -
మంచినీ, చెడునూ చరిత్ర చెబుతుంది
మంచి అయినా, చెడు అయినా చరిత్ర చెబుతుంది. సాధారణంగా మంచి కంటే చెడుకే ప్రచారం ఎక్కువ. దర్శకుడు శ్రీమహేశ్ చరిత్తిరం పేసు (చరిత్ర చెబుతుంది) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రంలో ఏ విషయం గురించి చరిత్ర చెబుతుందో ఆయన మాటల్లోనే చూద్దాం. తాను తన పని అంటూ జీవించే హీరోకు, తన స్నేహ బృందానికి ఒక సంఘటన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఆ సంఘటన ఏమిటి? వారి ఆగ్రహం ఎలాటి పరిణామాలకు దారి తీసింది? తదితర పలు ఆసక్తికరమైన అంశాల సమాహారమే చరిత్తిరం పేసు చిత్రం. ప్రేమ, హాస్యం, యాక్షన్ అంశాలమయంగా ఈ చిత్రం ఉంటుంది. అయ్యనార్ ఫిలింస్ పతాకంపై యోగేశ్వరన్ బోస్ నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పసంగ ఫేమ్ ధారణి హీరోయిన్గా పరిచయమవుతోంది. డాక్టర్ శరవణన్, కృపా, కనిక, గంజా కరుప్పు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జగదీష్ విశ్వం చాయాగ్రహణాన్ని జయకుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
విద్యాశాఖాధికారి సంచలనం
ఇటీవల కాలంలో సంచలనాలకు వేదికగా మారిన జిల్లా విద్యాశాఖమళ్లీ వార్తల్లోకెక్కింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేస్తూ వారిపట్ల కఠినంగా వ్యవహ రిస్తున్నారని పేరున్న జిల్లా విద్యాశాఖాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారన్న వార్త... ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తనను వేధింపులకు గురి చేయడం వల్లే ఏసీబీ అధికారులను ఆశ్రయించానని బాధితుడు చెబుతుంటే.. తాను అసలు అతనితో మాట్లాడనేలేదని డీఈఓ అంటున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి జగదీశ్ రూ. 30వేలు లంచంగా తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం.. జిల్లాలో సంచలనం రేకేత్తించింది. మరోవైపు డీఈఓ కార్యాలయంలో కలకలం రేపింది. డీఈఓ ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులకు రూ.10 లక్షల నగదు దొరకడం మరింత సంచలనం కలిగించింది. జిల్లా విద్యాశాఖాధికారి ఏసీబీకి పట్టుబడడం, ఇంత పెద్ద ఎత్తున నగదు లభించడం ఇదే ప్రథమమని సమాచారం. 2005లో ఎస్సెస్సీ పరీక్షల సందర్భంగా ఏసీబీ అధికారులు పలు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు జరిపిన సందర్భంగా డీఈఓ కార్యాలయంలోని నలుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని సస్పెండ్ చేసిన చరిత్ర ఉంది. ఏసీబీని ఆశ్రయించిన హెచ్ఎం నిరంజన్‌రెడ్డి డీఈఓ ఎ.జగదీశ్ గత డిసెంబర్ 26వ తేదీన కేతేపల్లి మండలం బండపాలెం ప్రాథమిక పాఠశాలను సందర్శించి వివిధ కారణాలతో ప్రధానోపాధ్యాయుడు నిరంజన్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. రెండు నెలల పాటు డీఈఓ కార్యాలయం, ఇంటి చుట్టూ తిరిగిన బాధితుడు చివరకు ఈ నెల 5వ తేదీన తిరిగి పోస్టింగ్ తెచ్చుకుని విధుల్లో చేరాడు. సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా పెండింగ్ ఎంక్వైరీ అంటూ మెలిక పెట్టడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం రూ.30 వేలు అందజేయగా డీఈఓ నగదును తీసుకుంటూ పట్టుబడ్టాడు. వెంటనే ఏసీబీ అధికారులు కెమికల్స్ కోటింగ్‌తో అందజేసిన నోట్లను, వాటి నం బర్లను సరిచూసుకుని నిర్ధారణ చేసుకున్నారు. కెమికల్‌తో ఉన్న నోట్లు ముట్టుకోవడంతో ఆయన చేయి గులాబీగా మారింది. రూ.10 లక్షల నగదు స్వాధీనం దాడుల అనంతరం ఏసీబీ అధికారులు నల్లగొండ పట్టణం పద్మావతి కాలనీలో ఉన్న డీఈఓ ఇంట్లో సోదాలు జరిపారు. వారికి అక్కడ రూ.10లక్షల నగదు లభించింది. వీటిలో రూ.8 లక్షలు ఒకటే బండిల్లో ఉంది. మరో 10 కవర్లలో ఉన్న నగదును తీసి లెక్కించగా రూ. 2 లక్షల దాకా ఉన్నట్లు గుర్తించారు. ఈ కవర్లపై ఒకరిద్దరు ఉపాధ్యాయుల పేర్లు, కొన్ని పాఠశాలల పేర్లు ఉన్నాయి. ఏసీబీ అధికారులు డీఈఓ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిం చారు. ముందుగా కొందరు అధికారుల నుండి సమాచారం రాబట్టిన అనంతరం డీఈఓ ఛాంబ ర్లోని ముఖ్యమైన ఫైల్స్‌ను పరిశీలించారు. రెండేళ్లలో ఇంత మార్పా... 2012 ఏప్రిల్ 09వ తేదీన ఎ.జగదీశ్ జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. మొదటి సంవత్సరమంతా హల్చల్ సృ ష్టించడంతో పాటు పలువురిపై సస్పెన్షన్ వేటు వేశారు. విద్యాశాఖను ఓ గాడిన పెట్టాడని మంచి పేరొచ్చింది. నిజాయితీ పరుడనే పేరును సైతం పొందగలిగారు. కానీ ఒక్కసారిగా ఏసీబీ కేసుతో అందరి ఊహాలు, అంచనాలు తలకిందులయ్యాయి. బయటికి ఓ రకంగా లోపల మరో రకంగా వ్యవహరించాడా, నిజాయితీ అంతా ఉట్టిదేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 2005లో ఏసీబీ ట్రాప్‌లో నలుగురు సిబ్బంది... ఎస్సెస్సీ నామినల్ రోల్స్ సమర్పించే సందర్భంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో 2005లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో టైపిస్టు డి.రవీందర్, సీనియర్ అసిస్టెంట్లు నరేందర్‌బాబు, రషీద్, పరీక్షల అసిస్టెంట్ కంట్రోలర్ నారాయణస్వామిలను బాధ్యులుగా గుర్తించి ఏసీబీ కేసు నమోదు చేశారు. తర్వాత దాదాపు 9 ఏళ్లకు మరోమారు డీఈఓ కార్యాలయం ఏసీబీ రికార్డుల్లోకి ఎక్కింది. వివాదాలకు కేంద్ర బిందువుగా డీఈఓ కార్యాలయం 2013 నవంబర్ 27న డీఈఓ కార్యాలయానికి గుండెకాయలాంటి ఎస్టాబ్లిస్‌మెంట్ సెక్షన్ అనుమానాస్పద స్థితిలో దగ్ధమైంది. ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అంతకు ముందు 2006, 2008 డీఎస్సీల్లో తప్పుడు కుల ధ్రువీకరణ ప్రతాలతో ఉద్యోగాలు పొందారనే కారణంతో 2013లో 12మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఈ ఫైళ్లు కూడా దహనమయ్యాయి. 2009లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల సందర్భంగా నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందారనే అంశంపై కూడా విచారణ సాగుతుంది. గత కొంతకాలంగా డీఈఓ కార్యాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇన్చార్జ్ డీఈఓగా మదన్మోహన్...? డీఈఓ జగదీశ్ ఏసీబీ కేసులో పట్టుబడడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు తప్పేలా లేదు. దీంతో ఇన్చార్జ్ డీఈఓగా ప్రస్తుతం భువనగిరి డిప్యూటీ డీఈఓగా పనిచేస్తున్న ఎ.మదన్మోహన్ను నియమించే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న రెగ్యులర్ డిప్యూటీ డీఈఓ ఆయనొక్కరే ఉన్నారు. 2011 మార్చి 1 నుంచి 2012 ఏప్రిల్ 8వ తేదీ వరకు ఆయన ఇన్చార్జి డీఈఓగా పనిచేశారు. సస్పెండ్ చేశాననే కక్షతో చేశారు : డీఈఓ సస్పెండ్ చేశాననే కక్షతో ఏసీబీ కేసులో ఇరికించాడని డీఈఓ జగదీష్ తెలిపారు. గురువారం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. తనకు లంచాలు తీసుకునే అలవాటు లేదని, దానికి వ్యతిరేకమన్నారు. నిజాయితీగా పనిచేస్తుండడం కొందరికి కంటగింపుగా మారిందన్నారు. తనకు ప్రాణభయం ఉందని గతంలోనే పోలీసులను ఆశ్రయించానని గుర్తు చేశారు. తనను బదిలీ చేయించడానికి కొందరు ప్రయత్నించారని అన్నారు. గురువారం ఉదయం బండపాలెం ప్రధానోపాధ్యాయుడు నిరంజన్‌రెడ్డి ఇంటిలోకి వచ్చి నెయ్యిబాటిల్ ఇవ్వబోతే తిరస్కరించానన్నారు. అనంతరం జేబులోంచి నగదు తీసి జేబులో కుక్కేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నానన్నారు. చివరకు చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించగా వాటిని నెట్టేశానన్నారు. నిరంజన్‌రెడ్డితో ఏనాడూ ఫోన్లో మాట్లాడలేదన్నారు. కాల్‌డేటాలో తనఫోన్ నంబర్లున్నాయని ఏసీబీ అధికారులు అంటున్నారని, మీటింగ్‌లో ఉన్నపుడు ఫోన్లు క్యాంప్‌క్లర్క్ వేణు వద్ద ఉంటాయని తెలిపారు. -
డీఈఓ జగదీష్‌కు పోలీసు రక్షణ
మిర్యాలగూడ, జిల్లా విద్యాశాఖాధికారి ఆచార్య ఎన్.జగదీష్‌కు పోలీసు రక్షణ ఏర్పాటు చేయనున్నారు. వివిధ కారణాల రీత్యా తనకు కొందరి వల్ల ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని డీఈఓ పోలీసుశాఖకు లేఖ రాశారని సమాచారం. వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరించిన పోలీసు శాఖ ఆయనకు గన్మెన్ల రక్షణ ఇవ్వడానికి అంగీకరించింది. డీఈఓ జగదీష్ జిల్లాలో పలువురు ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. ఆయన జిల్లాలో బాధ్యతలు చేపట్టాక విద్యాశాఖలో పాత రికార్డులను తిరగేస్తూ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో మెడికల్ బిల్లులు కాజేశారని 121 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులకు ఫిర్యాదు చేశారు. 63 మంది ఉపాధ్యాయులు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందారని, 33 మంది ఉపాధ్యాయులు నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని, 8 మంది నకిలీ సర్టిఫికెట్లతో డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సంపాదించారని, అక్రమాలకు పాల్పడ్డారని ముగ్గురు డీఈఓ కార్యాలయ ఉద్యోగులపై, మొత్తంగా 300 మందికిపైగా క్రిమినల్ కేసులు పెట్టించారు. డీఈఓ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కావడం కూడా ఓ పెద్ద వివాదంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు ఏమైనా హాని జరగవచ్చని భావించిన డీఈఓ పోలీసు శాఖ రక్షణ కోరినట్లు సమాచారం. గన్‌మెన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు - జగదీష్, డీఈఓ, నల్లగొండ పోలీసు ప్రొటెక్షన్ ఇస్తామని, గన్‌మెన్ ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు ధ్రువీకరించారని డీఈఓ జగదీష్ వివరించారు. 24 గంటల సెక్యూరిటీని ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారని, తాను కూడా అందుకు అంగీకరించానన్నారు. మరో పది రోజుల్లో గన్‌మెన్‌ను ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.