ఎంపీపీలు టీఆర్‌ఎస్‌కే | trs got mpp seats | Sakshi
Sakshi News home page

ఎంపీపీలు టీఆర్‌ఎస్‌కే

Published Sat, Jul 5 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

trs got mpp seats

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో శుక్రవారం జరిగిన మండల పరి షత్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 36 మండలాలకుగాను 24 ఎంపీపీలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ మరోసారి సత్తా చాటింది. కాగా కాంగ్రెస్ పార్టీ 10 మండలాలను హస్తగతం చేసుకోగా... టీడీపీ ఈ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిం ది. ధర్పల్లిలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకోగా చివరకు ఇండిపెండెంట్ అభ్యర్థి టాస్ ద్వారా ఎన్నికయ్యారు.

భిక్కనూర్ మండల పరిషత్ ఎన్నికలకు మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 8 మందే హాజరు కావడంతో కోరం లేని కారణంగా అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. ఎన్నికల సంఘం ఆదేశం ప్రకా రం తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తామని చెప్పా రు. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో ఎంపీపీల ఎన్నిక ప్రక్రి య జరగ్గా.. చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల పోలీసులు లాఠీలను ఝుళి పించి ఆందోళనకారులను చెదరగొట్టారు.ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పలు మండలాల్లో తమ పార్టీకి సీటు దక్కే అవకాశం లేదని భావించిన పలువురు బీజేపీ, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్ద తు తెలిపారు.

 కాగా మంత్రి పోచారం , టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిందేలు ప్రాతి నిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మొ త్తానికి మొత్తం మండలాలను స్వీప్ చేశారు.బాల్కొండ నియోజకవర్గం లో మొత్తం ఐదు మండలాలకు ఎమ్మెల్యే వేముల ప్రశాం త్‌రెడ్డి నాలుగు మండలాల్లో తమ అభ్యర్థులను గెలిపిం చారు. పీసీసీ మాజీ చీఫ్, శాసనమండలి పక్షనేత డీఎస్ ఐదింటికీ నాలుగు మండలాల్లో ఎంపీపీలను దక్కించుకున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిం చిన బోధన్‌లో నాలుగు మండలాలకు నాలుగు కాంగ్రెస్‌కు దక్కించుకోగా.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నాలు ఫలించలేదు.జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా ఎగిరింది. ఒక్క బోధన్‌లో ఆ పార్టీకి చుక్కెదురైంది.

 రెంజల్‌లో పోలీసుల లాఠీచార్జి
 ఎంపీపీల సందర్భంగా జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రెంజల్ మండల ఎన్నికలకు బీజేపీ పార్టీకి చెందిన దీప కాంగ్రెస్ ఎంపీటీసీలతో కలిసి హాజరు కావడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు సిద్ధం కావడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.

 డిచ్‌పల్లి ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి దాసరి ఇందిర (యానంపల్లి), కో-ఆప్షన్ సభ్యుడిగా శ్యాంసన్(నడిపల్లి) ఎన్నిక కాగా, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థులు ఏడుగురు తీవ్ర నిరసనలు తెలపడంతో ఉపాధ్యక్షుడి ఎన్నిక శనివారానికి వాయిదా వేశారు. ధర్పల్లి ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి కో-ఆప్షన్ మెంబర్‌గా అబ్దుల్ మజీద్ (టీఆర్‌ఎస్)ను ఎన్నికున్న అనంతరం ఎన్నికల అధికారి నియమ నిబంధనలు చెబుతున్న సమయంలో దుబ్బాక ఎంపీటీసీ సభ్యుడు కోతి నర్సయ్య (కాంగ్రెస్)ను కిడ్నాప్ చేశారని అతడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఫిర్యాదు పత్రాన్ని ఎన్నికల అధికారికి పోలీసులు అందజేశారు.

 దీంతో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ సభ్యులు నిరసన ప్రారంభించారు. కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు సైతం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం బయట టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళన ప్రారంభించారు.ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో సీఐ వాహనం ధ్వంసమైంది. గౌరారం స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి ఇమ్మడి గోపిని అరెస్ట్ చేయాలని ఇద్దరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు నిర్వహించిన ఎన్నికల్లో టాస్ ద్వారా గోపి ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

 టీఆర్‌ఎస్ స్వీప్... డీఎస్, సుదర్శన్‌రెడ్డిలకు ఊరట...
  టీఆర్‌ఎస్ మూడు నియోజకవర్గాల్లో మొత్తానికి మొత్తం ఎంపీపీలను గెలిచి స్వీప్ చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యులను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. బాన్సువాడ నియోజకవర్గంలో నాలుగు మండ ల  పరిషత్‌లపై గులాబీ జెండా రెపరెపలాడింది. జుక్కల్‌లో ఐదు మండలాలు టీఆర్‌ఎస్ పరం అయ్యాయి.

కాగా బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, భీమ్‌గల్, వేల్పూరు, కమ్మర్‌పల్లి మండలాలను టీఆర్‌ఎస్ దక్కించుకోగా, మోర్తాడ్ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. కాగా పిట్లం మండ లం వైస్ ఎంపీపీ ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. పదవి కోసం టీఆర్‌ఎస్ నుంచి నర్సాగౌడ్, జేఏసీ నుంచి జగదీష్ మధ్య పోటీ నెలకొనగా చివరకు టీఆర్‌ఎస్‌కు చెందిన నర్సాగౌడ్‌ను పదవి వరించింది. జుక్కల్ మండల అధ్యక్ష పదవికి కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు హన్మాగౌడ్ మద్దతివ్వడంతో టీఆర్‌ఎస్ జెండా ఎగిరింది.

కాగా  శాసనమండలి పక్షనేత డీఎస్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్, బోధన్‌లలో ఎంపీపీ పదవులు దక్కించుకున్నారు. నిజామాబాద్ రూరల్‌లో ఐదు మండలాలకు గాను ధర్పల్లిలో స్వతంత్ర అభ్యర్థికి ఎంపీపీ పీఠం దక్కగా... నాలుగు కాంగ్రెస్‌నే వరించాయి. బోధన్‌లో నాలుగింటికి నాలుగు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో లభించిన విజయం వారికి ఊరట కలిగించే అంశం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement