
పారిపోయిన వరుడితోనే పెళ్లి..!
రాయచూరు రూరల్(అనంతపురం) : పెళ్లంటే నూరేళ్ల పంట అనే సామెతకు వ్యతిరేకంగా పారిపోయిన వరుడితో తిరిగి పెళ్లి జరిగిన వైనం అనంతపురం జిల్లా రాయచూరు తాలూకాలో జరిగింది. బుధవారం తాలూకాలోని మంచాలపూర్ హూవిన ఆంజినేయ స్వామి తాలూకాలోని కొత్తదొడ్డికి చెందిన జగదీశ్‌కు శక్తినగర్‌కు చెందిన జ్యోతితో వివాహానికి ముహూర్తం పెట్టారు. పెద్దల సమక్షంలో పెళ్లి కుదిరింది. ఏడాది క్రితం ఇద్దరు ప్రేమించుకున్నారు. మంగళవారం రాత్రి దేవాలయంలో వరుడు, వధువు బంధువులు వచ్చారు. బుధవారం ఉదయం వరుడు జగదీశ్ ఎవరికి తెలపకుండ కొత్తదొడ్డికి వెళ్లాడు. దీంతో వధువు జ్యోతి తరుపున బంధువులు పిల్లవాడి ఆచూకీ కోసం ఎదురు చూసారు. ఉదయం 9 గంటలకు ముహూర్తం ఉండేది. మధ్యాహ్నం 12 గంటలకు జగదీశ్ సోదరుడు ఫోన్ చేసి అరా తీయగా వరుడు జగదీశ్ పెళ్లి పీటలపై వచ్చి కూర్చొని వధువు మెడలో తాళి కట్టాడు. దీంతో బంధువులు,స్నేహితులు, శ్రీశైలం భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.