
సినీ నటి అర్చన(వేద) వివాహం పారిశ్రామికవేత్త జగదీష్‌తో హైదరాబాద్‌లో జరిగింది. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు వీరి పెళ్లి ఘనంగా జరిగింది. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు, ‘కళాబంధు’టి. సుబ్బరామిరెడ్డి, నటుడు మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సురేష్ కొండేటి, డైరెక్టర్ ఓంకార్, నటీనటులు మంచు లక్ష్మి, మధుమిత, ఆలీ, శివబాలాజీ, సమీర్, అశ్విన్‌బాబు, రవిశంకర్, యాంకర్ సుమతో పాటు పలువురు సినీ ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment