విచారణ కోసం స్టేషన్‌కు తీసుకువచ్చిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు యత్నించారు. విశాఖ జిల్లా ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా పార్వతీపురంనకు చెందిన జగదీష్, శ్రీకాకుళం జిల్లా వాసి గోపీ అనే యువకులు కొన్నాళ్లుగా విశాఖ కైలాసగిరిలో మకాం పెట్టారు. ఆప్రాంతానికి వచ్చే ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారిద్దరినీ వారం క్రితం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వారు స్టేషన్‌లోనే ఉన్నారు. తీవ్ర ఆందోళన చెందిన యువకులిద్దరూ సోమవారం రాత్రి నిద్రమాత్రలు మింగారు. వెంటనే గమనించిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో తిరిగి గుట్టుచప్పుడు కాకుండా స్టేషన్‌కు తరలించారు. రిమాండ్ చేయకుండా విచారణ పేరుతో యువకులను స్టేషన్‌లో నిర్బంధించటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం
Published Tue, May 31 2016 12:14 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement