
తెలుగు తెరపై యముడి కేరెక్టర్ ఓ సక్సెస్ ఫార్ములా. ఇప్పటికే యముని వేషాలతో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ఆదరించారు. కొన్ని చిత్రాలు అయితే బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అయితే ఈ మధ్య కాలంలో యముని కాన్సెప్ట్‌తో కొత్త చిత్రమేది రాలేదు. కానీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు మరోసారి యమలోకాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు జగదీష్ ఆమంచి.
జగన్నాధ పిక్చర్స్ పతకం పై స్వీయదర్శకత్వంలో నూతన నటీనటులతో ‘యముడు’అనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ధర్మో రక్షతి రక్షితః ఉప శీర్చిక. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘ఇదొక ఒక థ్రిల్లర్ చిత్రం. కథ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది. ఆగష్టు మొదటి వారం లో షూటింగ్ ప్రారంభం అవుతుంది’అని దర్శకనిర్మాత జగదీష్ తెలిపారు. ఈ చిత్రానికిష్ణు కెమెరా మాన్ గా వ్యవహారిస్తుండగా భవాని రాకేష్ సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment