Yamudu
-
Yamudu Movie: ‘యముడి’పై కొత్త చిత్రం
తెలుగు తెరపై యముడి కేరెక్టర్ ఓ సక్సెస్ ఫార్ములా. ఇప్పటికే యముని వేషాలతో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ఆదరించారు. కొన్ని చిత్రాలు అయితే బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అయితే ఈ మధ్య కాలంలో యముని కాన్సెప్ట్‌తో కొత్త చిత్రమేది రాలేదు. కానీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు మరోసారి యమలోకాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు జగదీష్ ఆమంచి. జగన్నాధ పిక్చర్స్ పతకం పై స్వీయదర్శకత్వంలో నూతన నటీనటులతో ‘యముడు’అనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ధర్మో రక్షతి రక్షితః ఉప శీర్చిక. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘ఇదొక ఒక థ్రిల్లర్ చిత్రం. కథ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది. ఆగష్టు మొదటి వారం లో షూటింగ్ ప్రారంభం అవుతుంది’అని దర్శకనిర్మాత జగదీష్ తెలిపారు. ఈ చిత్రానికిష్ణు కెమెరా మాన్ గా వ్యవహారిస్తుండగా భవాని రాకేష్ సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. -
యుముడిగా ట్రేడ్‌మార్క్.. యముడి పాత్రలో కైకాల చివరి సినిమా ఇదే!
నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాల్లో నటించి మెప్పించారు.భయపెట్టే విలనిజం నుంచి కరుణ రసం, కామెడీ పాత్రల్లో సైతం తన నటనతో మెప్పించిన నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. యముడు అంటే బహుశా ఇయనలాగే ఉంటారేమో అనేంతలా కెరీర్లో పదుల సంఖ్యలో యముడి పాత్రలు పోషించి భళా అనిపించారు. యముండ అంటూ ఆయన గర్జించే గర్జన ఇప్పటికీ మరువలేనిది. యముడి పాత్రలో కైకాలను తప్ప మరొకరిని ఊహించుకోలేము అనేంతగా తన నటనతో కట్టిపడేశారు. యముడి పాత్రల్లో కైకాల నటించిన సినిమాలను ఓసారి గుర్తుచేసుకుందాం.. 1977లో వచ్చిన యమగోల సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు ఎంత పేరు వచ్చిందో యముడిగా కైకాల సత్యనారాయణకు కూడా అంతటి పేరు వచ్చింది. 1998లో వచ్చిన యముడికి మొగుడు అనే సినిమాలో కైకాల పోషించిన యముడు పాత్ర మరువలేనిది. ఆయుష్షు తీరకుండానే యమలోకానికి వెళ్లిన చిరు యముడికి చుక్కలు చూపించే సన్నివేశాలు జనాలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఎస్వీ క్రిష్ణారెడ్డి తెరకెక్కించిన యమలీలలో కూడా కైకాల పాత్ర అత్యద్భుతం. కమెడియన్ అలీ హీరోగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అలాగే యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో కూడా యుముడిగా ఆకట్టుకున్నారు. ఇక తొట్టెంపూడి వేణు, శ్రీకాంత్ హీరోలుగా నటించిన యమగోల మళ్లీ మొదలైందిలోనూ రిటైర్డ్ అయ్యే యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపించారు. చివరగా ఆయన రవితేజ నటించిన 'దరువు' చిత్రంలోనూ యముడి పాత్రలో మెప్పించారు. -
మాటేసి ఉన్నాం.. మాస్క్ లేకుండా వచ్చారో జాగ్రత్త’’
బత్తలపల్లి: ‘‘మాటేసి ఉన్నాం... మాస్క్ లేకుండా బయటకొచ్చారో జాగ్రత్త’’ అంటూ యముడు వేషధారి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ఆర్డీటి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాకారులు ఆంజనేయులు, శ్రీరాములు, సుదర్శన్‌లు ప్రజలు కరోనా బారిన పడకుండా అప్రమత్తం చేశారు. చదవండి: ప్చ్.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా! కరోనా: ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది? -
యమప్రేమ
ఏదో పాపం... ప్రాణాలు తీయాలన్న డ్యూటీ యముడికి వేయబట్టిగానీ... నిజానికి ఆ క్యారెక్టరుకు మనుషులంటే చాలా ఇష్టం. వారి వినోదం కోసం యముడనే ఆ క్యారెక్టరు చాలా చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. ‘‘చతుర్ముఖ ప్రసాదిత సమస్త పర్యతలోక సామ్రాజ్యాధినాథుండయిన నేను’’ అంటూ ఆయన... ‘‘అవలోకన మాత్ర విచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ భువన చరాచర భూత భయంకర పాశాంకుశధారి’’ అనే తన ఫేమస్ డైలాగులతో యమాగా హూంకరించి నప్పటికీ... యముడు తన పాశాంకుశం ఉచ్చుముడిని వదులు చేసి ఎనీఆర్ ప్రాణాలను వదిలేయాల్సి వచ్చింది ‘యమగోల’లో! ఆ తర్వాత కూడా సందర్భంలో ప్రాణాల చిట్టా పుస్తకం కనపడక కమెడియన్ హీరో అలీ తల్లి ప్రాణాలను విడిచిపుచ్చి ‘యమలీల’ చూపాల్సి వచ్చింది పాపం!! అంతెందుకు... యముడికి మొగుడైన చిరంజీవి ప్రాణాలను డ్యూయల్రోల్కి పంపుతూ ఇంకోసారి, యమదొంగ జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలను స్పేర్ చేస్తూ మరోసారి వారి వారి ప్రాణాలను మాటిమాటికీ వాపస్ ఇచ్చేయాల్సొచ్చింది!!! మరో సందర్భంలో కొత్త యముడికి మొగుడు సినిమాలో తన తండ్రి చంద్రమోహన్ ప్రాణాలను అల్లరినరేశ్కు భద్రంగా అప్పజెప్పడంతో పాటు తన కూతురు యమజనూ అతడికి ఇచ్చి కన్యాదానమూ చేయాల్సి వచ్చింది. ఇలా పాపం... సదరు యముడి క్యారెక్టరు తెలుగుతెర మీద తన డ్యూటీ తాను చేయకుండా అనేక మార్లు మనుషుల ప్రాణాలు కాపాడుతూ ఉండిపోవాల్సి వచ్చింది. పదే పదే వెండితెర మీద తారల ప్రాణాలే కాపాడి కాపాడి బోరుకొట్టిందేమో. ‘ఇలా ఎంతసేపని మాటిమాటికీ సెలబ్రిటీలనే కాపాడతాం. కాస్త మనం అలా బెంగళూరు సిటీలో సామాన్యుల ప్రాణాలను రక్షిద్దాం’’ అనిపించిందా యముడి పాత్రకు. అందుకే యమరాజు భూమికను మళ్లీ ధరించి, రోడ్డు మీదికి వచ్చి మోటారుసైకిళ్లను నడిపేవారిని హెచ్చరిస్తోందా పాత్ర. ‘‘హెల్మెట్ లేకుండా బండి నడిపితే... త్వరలోనే నువ్వు నాకు హెల్ మేట్ అవుతావం’’టూ హెచ్చరిస్తోందా యమపాత్రధారి. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ హెచ్చరికలు చేస్త ట్రాఫిక్ నిబంధలపై అవగాహన కల్పిస్తోందా పాత్ర. ఆ యముడి భూమిక దేశవ్యాప్తంగా పలువురిని ఆకర్షించింది (పై ఫొటో చూడండి). దీన్ని బట్టి మళ్లీ మరోసారి నిరూపితమవుతున్న అంశం ఏమిటంటే... ప్రాణాలు తీసే డ్యూటీ తనకు వేయబట్టిగానీ... లేదంటే... అటు తెర మీద... ఇటు రోడ్ల మీద మనుషుల ప్రాణాలను రక్షించడం అంటే ఆయనకు యమా ఇష్టం. సారీ... ‘యమ’ ‘యమ’ ఇష్టం!!! – యాసీన్ -
రూ.3 కోట్లతో యముడికి కొత్త ఆలయం
చెన్నై: వరాలిచ్చే దేవుడే కాదు ప్రాణాలు హరించే యముడు సైతం తమిళనాడులో పూజనీయుడైనాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. తంజావూరు జిల్లాలో రూ.3 కోట్లతో యమధర్మరాజుకు వేల సంవత్సరాల నాటి ఆలయం ఉంది. ఇపుడు నూతన ఆలయం సిద్ధమైంది. పురాణగాథల ప్రకారం దేవతలు శివ దర్శనం కోసం కైలాసం వచ్చినపుడు శివుడు కళ్లు మూసుకుని కఠినమైన తపస్సు చేసుకుంటున్నాడు. కళ్లు తెరచి ఉన్న స్థితిలో శివుడు దర్శనం ఇచ్చేలా చేయాలనే ఆలోచనతో దేవతలు మన్మథుడిని రప్పించి తపస్సును భగ్నం చేశారు. ఇందుకు అగ్రహించిన శివుడు మన్మథుడిని భస్మం చేస్తాడు. ఆ తరువాత ఆయన భార్య రతీదేవి వచ్చి శివుడిని ప్రార్థించడంతో మన్మథుడిని తిరిగి బతికిస్తాడు. ఆ సమయంలో ప్రాణాలు హరించే బాధ్యతను తనకు అప్పగించాలని యమధర్మరాజు శివుడిని కోరగా శివుడు సమ్మతిస్తాడు. ఇందుకు గుర్తుగా పూర్వీకులు తంజావూరు జిల్లా పట్టుకోటై సమీపంలోని తిరుచ్చిట్రంబళం గ్రామంలో యమధర్మరాజుకు ఆలయం నిర్మించారు. యమధర్మరాజుకు సదరు బాధ్యతల అప్పగింతలకు కారణమైన శివుడికి సైతం కొద్ది దూరంలో మరో ఆలయాన్ని నిర్మించారు. యమధర్మరాజుకు ఆలయం నిర్మించి 1,300 ఏళ్లు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు మీడియాకు తెలిపారు. ఈ గ్రామంలోనే రూ.3 కోట్లతో యముడికి కొత్తగా ఆలయాన్ని కూడా నిర్మించి మట్టితో యముడి విగ్రహాన్ని తయారుచేసి ప్రార్థనలు జరిపామని తెలిపారు. మట్టి విగ్రహం స్థానంలో ఆరు అడుగుల ఎత్తు, రెండు టన్నుల బరువు ఉన్న శిలావిగ్రహాన్ని త్వరలో ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. జనవనరి 22వ తేదీన కొత్త ఆలయంలో యముడికి కుంభాభిషేకం జరుపుతామని వారు చెప్పారు. -
కోలీవుడ్ నుంచి మరో 'యముడు'..?
బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. బిచ్చగాడు తరువాత వచ్చిన భేతాళుడు కూడా మంచి వసూళ్లు సాధించటంతో విజయ్ చేస్తున్న కొత్త సినిమాలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తున్న వచ్చిన విజయ్ ఆంటోని ఇప్పుడు ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. 2.0, శభాష్ నాయుడు, ఖైదీ నంబర్ 150 లాంటి భారీ చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. తమిళ్లో యెమన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో యముడు అనే టైటిల్‌తో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే అదే టైటిల్‌తో సూర్య హీరోగా ఓ సినిమా రిలీజ్ అయినందున ఆ పేరుకు ముందో వెనకో మరో పదాన్ని కలిపి టైటిల్‌గా నిర్ణయించాలని భావిస్తున్నారట. సూర్య యముడు సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఎస్ 3 కూడా త్వరలో రిలీజ్ అవుతున్న నేపథ్యం విజయ్ ప్లాన్స్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. -
యముడిగా విజయ్ ఆంటోని
చిత్ర కథలనే కాదు వాటి పేర్లలోనూ వైవిద్యం చూపించాలని తపించే నటుడుగా పేరు తెచ్చుకుంటున్నారు సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని. నాన్ చిత్రంలో కథానాయకుడిగా తెరపైకి వచ్చి సక్సెస్‌ను సాధించిన ఈయన ఆ తరువాత సలీమ్, ఇండియా పాకిస్థాన్ అంటూ వరుస చిత్రాలతో విజయాలను అందుకుంటూ తనకంటూ ఒక స్థాయిని అందుకున్నారు. ప్రస్తుతం పిచ్చైక్కారన్ అంటూ త్వరలో తెరపైకి రానున్నారు. తాజాగా ఎమన్(యముడు)గా మారనున్నారు.ఇప్పటి వరకూ తన సొంత నిర్మాణ సంస్థలోనే చిత్రాలు చేస్తూ నటిస్తున్న విజయ్‌ఆంటోని తొలిసారిగా బయటి సంస్థలో నటించనున్నారు. ఎమన్ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించడం విశేషం. నాన్ చిత్రంతో విజయ్‌ఆంటోనిని తెరపై హీరోగా చూపించిన జీవీ శంకర్‌నే ఈ ఎమన్ చిత్రానికి కథ, చాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ నాన్ చిత్రం నుంచి విజయ్‌ఆంటోని ఎదుగుదల తనను ఆశ్చర్యంలో ముంచ్చెత్తుతోందన్నారు. నాన్ చిత్రం ప్రారంభ సమయంలోనే ఈ ఎమన్ చిత్ర కథ తన వద్ద సిద్ధంగా ఉందన్నారు.అయితే దాన్ని ఒక మాస్ ఇమేజ్ ఉన్న దర్శకుడితో చేయాలని భావించానన్నారు. ఇప్పుడు అలాంటి ఇమేజ్ను సంపాదించుకున్న విజయ్‌ఆంటోని తన కథకు చక్కగా నప్పడంతో ఆయన హీరోగా చిత్రం చేస్తున్నట్లు వివరించారు. ఇక చిత్ర కథ గురించి చెప్పాలంటే యముడంటే మరణానికే దేవుడు కాదనీ ఆయన ధర్మ రక్షణకు దేవుడేని అన్నారు. ఇదే ఈ చిత్రం ఇతివృత్తం అని ఈ సందర్భంగా అన్నారు. జనరంజక అంశాలతో కూడిన మంచి కమర్షియల్ చిత్రంగా ఎమన్ ఉంటుందని దర్శకుడు జీవా శంకర్ పేర్కొన్నారు.