యముడిగా విజయ్ ఆంటోని
చిత్ర కథలనే కాదు వాటి పేర్లలోనూ వైవిద్యం చూపించాలని తపించే నటుడుగా పేరు తెచ్చుకుంటున్నారు సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని. నాన్ చిత్రంలో కథానాయకుడిగా తెరపైకి వచ్చి సక్సెస్‌ను సాధించిన ఈయన ఆ తరువాత సలీమ్, ఇండియా పాకిస్థాన్ అంటూ వరుస చిత్రాలతో విజయాలను అందుకుంటూ తనకంటూ ఒక స్థాయిని అందుకున్నారు. ప్రస్తుతం పిచ్చైక్కారన్ అంటూ త్వరలో తెరపైకి రానున్నారు. తాజాగా ఎమన్(యముడు)గా మారనున్నారు.ఇప్పటి వరకూ తన సొంత నిర్మాణ సంస్థలోనే చిత్రాలు చేస్తూ నటిస్తున్న విజయ్‌ఆంటోని తొలిసారిగా బయటి సంస్థలో నటించనున్నారు.
ఎమన్ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించడం విశేషం. నాన్ చిత్రంతో విజయ్‌ఆంటోనిని తెరపై హీరోగా చూపించిన జీవీ శంకర్‌నే ఈ ఎమన్ చిత్రానికి కథ, చాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించనున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ నాన్ చిత్రం నుంచి విజయ్‌ఆంటోని ఎదుగుదల తనను ఆశ్చర్యంలో ముంచ్చెత్తుతోందన్నారు.
నాన్ చిత్రం ప్రారంభ సమయంలోనే ఈ ఎమన్ చిత్ర కథ తన వద్ద సిద్ధంగా ఉందన్నారు.అయితే దాన్ని ఒక మాస్ ఇమేజ్ ఉన్న దర్శకుడితో చేయాలని భావించానన్నారు. ఇప్పుడు అలాంటి ఇమేజ్‌ను సంపాదించుకున్న విజయ్‌ఆంటోని తన కథకు చక్కగా నప్పడంతో ఆయన హీరోగా చిత్రం చేస్తున్నట్లు వివరించారు. ఇక చిత్ర కథ గురించి చెప్పాలంటే యముడంటే మరణానికే దేవుడు కాదనీ ఆయన ధర్మ రక్షణకు దేవుడేని అన్నారు. ఇదే ఈ చిత్రం ఇతివృత్తం అని ఈ సందర్భంగా అన్నారు. జనరంజక అంశాలతో కూడిన మంచి కమర్షియల్ చిత్రంగా ఎమన్ ఉంటుందని దర్శకుడు జీవా శంకర్ పేర్కొన్నారు.