కోలీవుడ్ నుంచి మరో 'యముడు'..? | Bichagadu Fame vijay antony tamil yeman for telugu title | Sakshi
Sakshi News home page

కోలీవుడ్ నుంచి మరో 'యముడు'..?

Published Wed, Jan 4 2017 12:20 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

కోలీవుడ్ నుంచి మరో 'యముడు'..?

కోలీవుడ్ నుంచి మరో 'యముడు'..?

బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. బిచ్చగాడు తరువాత వచ్చిన భేతాళుడు కూడా మంచి వసూళ్లు సాధించటంతో విజయ్ చేస్తున్న కొత్త సినిమాలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తున్న వచ్చిన విజయ్ ఆంటోని ఇప్పుడు ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.

2.0, శభాష్ నాయుడు, ఖైదీ నంబర్ 150 లాంటి భారీ చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. తమిళ్లో యెమన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో యముడు అనే టైటిల్తో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే అదే టైటిల్తో సూర్య హీరోగా ఓ సినిమా రిలీజ్ అయినందున ఆ పేరుకు ముందో వెనకో మరో పదాన్ని కలిపి టైటిల్గా నిర్ణయించాలని భావిస్తున్నారట. సూర్య యముడు సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఎస్ 3 కూడా త్వరలో రిలీజ్ అవుతున్న నేపథ్యం విజయ్ ప్లాన్స్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement