
ప్రముఖ కన్నడ నిర్మాత సౌందర్య జగదీష్ మరణించారు. అయితే ఈయన మృతిపై తలో రకంగా కామెంట్స్ వినిపించడం చర్చనీయాంశంగా మారింది. తొలుత గుండెపోటుతో చనిపోయారని అనగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ అసలేం జరిగింది?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?)
జగదీష్.. మస్త్ మజా మాది, స్నేహితారు తదితర చిత్రాలని నిర్మించారు. అప్పు-పప్పు సినిమాతో తన కొడుకుని హీరోగా పరిచయం చేశాడు. సినిమాల నిర్మాణంతో పాటు ఈయన ఇండస్ట్రీలిస్ట్ కూడా. అలానే బెంగళూరులో ఓ పబ్ కూడా ఉంది.
ఆదివారం ఉదయం జగదీష్ ఉరి వేసుకోగా, కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు జగదీష్ కి లేవని ఇతడి ఫ్రెండ్ శ్రేయస్ చెప్పారు. కానీ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!)