యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆరంభం  | The beginning of an action thriller | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆరంభం 

Jul 28 2023 12:56 AM | Updated on Jul 28 2023 12:56 AM

The beginning of an action thriller - Sakshi

సందీప్‌ మాధవ్, కేథరిన్‌

సందీప్‌ మాధవ్, కేథరిన్‌ థెరిస్సా జంటగా నూతన చిత్రం షురూ అయింది. సోమా విజయప్రకాష్‌ సమర్పణలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు. అశోక్‌ తేజ దర్శకుడు. తొలి సీన్‌కి నిర్మాత సి. కల్యాణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు సంపత్‌ నంది క్లాప్‌ ఇచ్చారు. నిర్మాతలు ప్రసన్నకుమార్, పి. కిరణ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘పోలీస్‌ పాత్రలో నటించాలన్న నా ఆశ ఈ సినిమాతో నేరవేరింది’’ అన్నారు సందీప్‌ మాధవ్‌. ‘‘స్క్రీన్‌ ప్లే బేస్డ్‌ సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది’’ అన్నారు అశోక్‌ తేజ. ‘‘సినిమా పూర్తయ్యేవరకూ కంటిన్యూ షెడ్యూల్‌ జరుపుతాం’’ అన్నారు పల్లి కేశవరావు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, సహనిర్మాతలు: రొంగల శివశంకర్, గౌటి హరినాథ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement