Katherine tresa
-
యాక్షన్ థ్రిల్లర్ ఆరంభం
సందీప్ మాధవ్, కేథరిన్ థెరిస్సా జంటగా నూతన చిత్రం షురూ అయింది. సోమా విజయప్రకాష్ సమర్పణలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు. అశోక్ తేజ దర్శకుడు. తొలి సీన్‌కి నిర్మాత సి. కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు సంపత్ నంది క్లాప్ ఇచ్చారు. నిర్మాతలు ప్రసన్నకుమార్, పి. కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘పోలీస్ పాత్రలో నటించాలన్న నా ఆశ ఈ సినిమాతో నేరవేరింది’’ అన్నారు సందీప్ మాధవ్. ‘‘స్క్రీన్ ప్లే బేస్డ్ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది’’ అన్నారు అశోక్ తేజ. ‘‘సినిమా పూర్తయ్యేవరకూ కంటిన్యూ షెడ్యూల్ జరుపుతాం’’ అన్నారు పల్లి కేశవరావు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సహనిర్మాతలు: రొంగల శివశంకర్, గౌటి హరినాథ్. -
టైమ్ ట్రావెల్ చేయనున్న 'బింబిసార'.. రిలీజ్ డేట్ ఫిక్స్
Kalyan Ram Bimbisara Movie Theatrical Release Date Announced: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న 18వ చిత్రం 'బింబిసార'. కేథరిన్, సంయుక్త మీనన్, వారీనా హుసేన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు విశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ. కె నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ట్యాగ్‌లైన్. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఈ సంవత్సరం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా శనివారం సినిమా అధికారిక రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడదల చేశారు. The date is locked for BIMBISARA to ascend the throne 🔥#Bimbisara grand release on 5th August 💥#HappyUgadi ❤️#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt @anilpaduri @NTRArtsOfficial pic.twitter.com/cFhr62CmCe — NTR Arts (@NTRArtsOfficial) April 2, 2022 సామాజిక మాధ్యమాల ద్వారా రిలీజైన ఈ పోస్టర్లో కల్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాలో అత్యున్నత సాంకేతికతను ఉపయోగించాం. ఇందులో కల్యాణ్ రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనువిందు చేయనున్నారు. అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. క్రీస్తూ పూర్వ ఐదో శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు కథతో ఈ మూవీ తెరకెక్కనుంది. టైమ్ ట్రావెల్ మూవీగా వస్తున్న 'బింబిసార'లో బింబిసారుడిగా, నేటితరం యువకుడిగా రామ్ నటిస్తున్నట్లు సమాచారం. -
అపజయాలెదురైనా వదల్లేదు
తమిళసినిమా: అపజయాలు ఎదురైనా సినిమాను వదల్లేదని యువ నటుడు విష్ణువిశాల్ అన్నారు. ఈయన హీరోగా నటిస్తూ సొంతగా విష్ణువిశాల్ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం కథానాయకన్. నటి క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటిస్తున్న ఇందులో సూరి, ఆనందరాజ్, శరణ్యాపొన్వన్నన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. మురుగానందం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షాన్‌రోల్డన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల ఒక ఎఫ్ఎం రేడియో కార్యాలయంలో జరిగింది. కాగా మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మురుగానందం మాట్లాడుతూ విష్ణువిశాల్ మంచి నటుడే కాదు మంచి నిర్మాత కూడా అన్నారు. కథానాయకన్ చిత్రం అద్భుతంగా వచ్చిందని చెప్పారు. యూనిట్ అందరూ సమష్టిగా శ్రమించిన చిత్రం కథానాయకన్ అని పేర్కొన్నారు. చిత్ర హీరో, నిర్మాత విష్ణువిశాల్ మాట్లాడుతూ వెన్నెలా కబడ్డీకుళు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యానని, ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, ఆ తరువాత నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయన్నారు. అయినా సినిమాను వదలకుండా నిర్మాతగా మారి వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రం చేశానని, ఆ చిత్రం మీ ఆశీస్సులతో విజయం సాధించిందని అన్నారు. అదే విధంగా మంచి కథతో కథానాయకన్ చిత్రాన్ని నిర్మించి హీరోగా నటించానని తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. -
అందాలారబోతకు నాపై ఒత్తిడి లేదు
అందాలారబోతకు నన్నెవరూ ఒత్తిడి చేయడం లేదని నటి క్యాథరిన్ ట్రెసా చెప్పుకొచ్చింది. తమిళం, తెలుగు, కన్నడం అంటూ ఏ భాషలో అయినా వచ్చిన అవకాశాన్ని వదలకుండా చేసేస్తున్న ఆ జాణకు ఇటీవల తెలుగు మెగాస్టార్‌తో ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేసే అవకాశం చేతి దాకా వచ్చి నోటికందనట్లు చేజారిపోయింది. ప్రస్తుతం తమిళంలో కడంబన్, కథానాయకన్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ అమ్మడు చెప్పే కబుర్లేమిటో చూద్దామా‘నేను కేరళాలో పుట్టినా పెరిగింది మాత్రం దుబాయ్‌లో. కన్నడ చిత్రపరిశ్రమలో కథానాయకిగా పరిచయం అయ్యాను.అయితే అప్పటి నుంచే తమిళం, తెలుగు భాషల్లో అవకాశాల కోసం ఎదురు చూశాను. కారణం ఇతర భాషా చిత్రాల్లో కంటే ఈ భాషా చిత్రాల్లో నటనా ప్రతిభను చాటుకోవడానికి అధిక అవకాశం ఉంటుంది. అలా పా.రంజిత్ దర్శకత్వంలో కార్తీ సరసన మెడ్రాస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అందులో ఉత్తర చెన్నై అమ్మాయిగా నటించడానికి చాలా కష్టపడ్డాననే చెప్పాలి. భాష తెలిసి నటిస్తే పాత్రకు ప్రత్యేకత ఏర్పడుతుందని తమిళ భాష స్పష్టంగా ఉచ్చరించడాన్ని నేర్చుకున్నాను. మెడ్రాస్ చిత్ర విజయం నా కెరీర్‌కు బాగా హెల్ప్ అయ్యింది. ఆ తరువాత నటించిన కథకళి, కణిదన్ చిత్రాల్లో నాకు మంచి పాత్రలు లభించాయి. కొత్త చిత్రాలను అంగీకరించినప్పుడు కచ్చితంగా గ్లామరస్‌గా నటించే తీరాలని ఏ దర్శక, నిర్మాత నాపై ఒత్తిడి చేయలేదు. ఇంకా చెప్పాలంటే గ్లామర్ విషయంలో ఒక్కో దర్శకుడికి ఒక్కోరకమైన దృష్టి ఉంటుంది. నా వరకూ నేను తెరపై అందంగా కనిపించాలని కోరుకుంటాను. నా శరీరాకృతికి నప్పేలా డ్రస్‌ను సెలెక్ట్ చేసుకుంటాను. కోలీవుడ్‌కు చాలా మంది కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఎవరికీ ఏది దక్కాలో అది దక్కుతుంది. నేనెవరికీ పోటీగా భావించడం లేదు. ఇతర హీరోయిన్ల నటననే పోటీగా తీసుకోవాలన్న నా భావన. -
విష్ణువిశాల్‌తో రొమాన్స్ కు రెడీనా?
విజయపథంలో పయనిస్తున్న యువ నటులలో విష్ణువిశాల్ ఒకరు. ఇటీవల నిర్మాతగానూ మారి వేలన్ను వందుట్టా వెళ్లకారన్ చిత్రంతో సక్సెస్ అయ్యారు. తాజాగా కథానాయకన్ పేరుతో చిత్రం నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో క్యాథరిన్ ట్రెసా కధానాయకి. నవ దర్శకుడు మురుగానందం మెగాఫోన్ పట్టిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం ముండాసిపట్టి చిత్రం ప్రేమ్ రామ్ దర్శకత్వంలో నూతన చిత్రంలో విష్ణువిశాల్ నటిస్తున్నారు. ఈ యువ నటుడు మరోసారి దర్శకుడు మురుగానందంకు అవకాశం కల్పించారు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న రెండో చిత్రాన్ని ఈశన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో విష్ణువిశాల్‌కు జంటగా అందాల రాశి హన్సికను ఎంపిక చేసే పనిలో చిత్ర దర్శక నిర్మాతలు ఉన్నారు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలు, తమిళంలో ఒక నూతన చిత్రం చేస్తున్న హన్సిక విష్ణువిశాల్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు సై అంటారా అన్నది వేచి చూడాల్సిందే. జయంరవితో ఈ బ్యూటీ జత కట్టిన బోగన్ చిత్రం ఈ నెల 30న తెరపైకి రావడానికి ముస్తాబవుతోందన్నది గమనార్హం. -
రానాతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్
టాలీవుడ్ యువ నటుడు రానాతో బ్యూటీఫుల్ భామ క్యాథరిన్ ట్రెసా రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ చక్కర్లు కొడుతూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంటున్న నాయకి క్యాథరిన్ ట్రెసా. ఆ మధ్య కణిదన్ చిత్రంలో అధర్వకు జంటగా నటించి విజయాన్ని చవి చూసిన ఈ అమ్మడు విశాల్‌తో కథకళి చిత్రంలోనూ రొమాన్స చేశారు. ఇటీవల తెలుగులో అల్లుఅర్జున్‌తో సరైనోడులో మెరిశారు కూడా. ప్రస్తుతం ఆర్యతో కథంబన్, విష్ణువిశాల్‌కు జంటగా కథానాయకన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా రానాతో చిందులేయడానికి రెడీ అవుతున్నారు. రానా హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నానే రాజా నానే మంత్రి. టాలీవుడ్ దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానాతో ఇప్పటికే నటి కాజల్ఆగర్వాల్ డ్యూయెట్లు పాడుతున్నారు. మరో హీరోరుున్ పాత్రలో నటి శ్రుతిహాసన్ నటించనున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడా పాత్రలో నటించే అవకాశం నటి క్యాథరిన్ ట్రెసాను వరించింది. ఇందులో ఈమెకు కాజల్‌అగర్వాల్ పాత్రకు దీటుగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ కారైక్కుడి, కేరళ ప్రాంతాల్లో జరుపుకుంది. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న షూటింగ్లో క్యాథరిన్ ట్రెసా పాల్గొననున్నట్లు సమాచారం. -
నన్ను అందుకే వాడుకుంటున్నారు
నన్ను గ్లామర్‌కే వాడుకుంటున్నారని తెగ బాధ పడిపోతోంది నటి క్యాథరిన్ ట్రెసా. కోలీవుడ్‌లో గట్టి పోటీ ఉన్నా అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది ఈ అమ్మడు. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అందాలారబోతలో దుమ్మురేపిన ఈ దుబాయ్ బ్యూటీ తమిళలోకొచ్చేసరికి మెడ్రాస్ చిత్రంలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో బాగానే నటించింది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఇకపై అలాంటి నటనకు అవకాశం ఉన్నా మంచి పాత్రలు వస్తాయని ఆశించింది. అయితే అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటి అన్నట్టుగా క్యాథరిన్ పరిస్థితి మారింది. ఆ తరువాత విశాల్ సరసన కథకళి, అధర్వతో కణిదన్ చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు విజయం సాధించినా వాటిలో ఈ అమ్మడు గ్లామర్‌డాల్ పాత్రలకే పరిమితమైంది. దీంతో ఎంతో బాధ పడిపోతున్న క్యాథరిన్ ట్రెసా తనను దర్శక నిర్మాతలు గ్లామర్‌కే వాడుకుంటున్నారని తెగ ఇదైపోతోంది. మోడ్రన్ పేరుతో కురచ దుస్తులు ధరింపజేస్తున్నారని వాపోతోంది. గ్లామరస్ పాత్రలతో అభిమానులు పెరుగుతున్నారన్నది కాస్త సంతోషంగా ఉన్నా మరీ అలాంటి పాత్రలకే ట్రేడ్ మార్క్‌గా మార్చేయడం బాధగా ఉందని పేర్కొంది. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాకుండా ఎంత మంచి పాత్రలు పోషించామన్నదే లెక్కకొస్తుందనీ అలా చెప్పుకునే మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని క్యాథరిన్ ట్రెసా అంటోంది.నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తే తన సత్తా చాటుకుంటానని పేర్కొంది. -
నాకు గుర్తింపు తెచ్చింది మెడ్రాస్
నాకు అడ్రస్నిచ్చింది మెడ్రాస్(చెన్నై) అని అంటోంది నటి క్యాథరిన్ ట్రెసా. ఇప్పుడు కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఎదుగుతోంది ఈ మలయాళ బ్యూటీ. కన్నడం, మలయాళం, తెలుగు, తమిళం అంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో రౌండ్స్ కొడుతున్న క్యాథరిన్ ట్రెసా తమిళంలో మెడ్రాస్ చిత్రంతోనే అరంగేట్రం చేసింది. ఆ చిత్రం విజయం అమ్మడికి మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. ఇటీవల విశాల్‌తో నటించిన కథకళి తన కేరీర్‌కు బాగాను ఉపయోగపడిందనే చెప్పాలి. తెలుగులోనూ ఇద్దరమ్మాయిలతో, ఎర్రబసు లాంటి చిత్రాలతో అక్కడి ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం తమిళ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నానంటున్న క్యాథరిన్ ట్రెసా ఇంకా ఏమి చెబుతుందో ఆమె మాటల్లోనే.. నేను మలయాళీ అమ్మాయినే అయినా పుట్టి పెరిగింది దుబాయ్‌లోనే. అమ్మా,నాన్నా అక్కడే ఉంటారు. కథాశాలలో చదువుతున్న రోజుల్లోనే కన్నడ, మలయాళ చిత్రాలలో నటించాను .అయితే నాకు అడ్రస్ నిచ్చింది మాత్రం చెన్నైనే. మెడ్రాస్ చిత్రం తరువాత వరుసగా ఇక్కడ అవకాశాలు వస్తున్నాయి. తమిళ ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఆధర్వ సరసన కణిదన్ చిత్రంతో పాటు వీరధీరశూరన్ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇలా వరుస అవకాశాలతో కోలీవుడ్ ఆదరించడం సంతోషంగా ఉంది. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతాను.టీవీ తిలకిస్తాను. ఇంకా వంట కూడా చేస్తాను. నెంబర్‌వన్, టూ వంటి స్థానాల గురించి ఆలోచించను. అసలు వాటి గురించి పట్టించుకోను. నా చిత్రాలు ప్రేక్షకుల్ని సంతోషపరచాలన్నదే లక్ష్యంగా పాత్రలను ఎంపిక చేసుకుంటాను. తమిళ ప్రేక్షకులంటే నాకు చాలా ఇష్టం. -
క్యాథరిన్‌కు మాతృభాష రాదట
మలయాళీ కుట్టికి మాతృభాషే తెలియదట. కథానాయిక లకు కే రళ పుట్టినిల్లుగా మారిందనవచ్చు. మలయాళం మాతృభాషగా కలవారు భారతీయ సినీపరిశ్రమ నంతా అల్లుకుపోతున్నారన్నది ఎవరూ కాదనలేని నిజం. ముఖ్యంగా దక్షిణాది చిత్రసీమలో ఈ బ్యూటీస్దే హవా అనవచ్చు. అసిన్, నయనతారల నుంచి యువ తారలు క్యాథరిన్ ట్రెసా,కీర్తీసురేష్ వరకూ పలువురు దక్షిణాదిలో కథానాయికలుగా తమ సత్తా చాటుకుంటున్నారు. ఇక క్యాథరిన్ ట్రెసా విషయానికి వస్తే మెడ్రాస్ చిత్రంతో కోలీవుడ్‌కు, ఇద్దరమ్మాయిలతో చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. విశాల్‌తో నటించిన కథాకళి చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది.ఈ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లోనూ నటించింది. ఆ సన్నివేశాలతో యువత గుండెల్లో గిలిగింతలు పెట్టి వారి అభిమానాన్ని పొందేస్తానని తెగ సంబర పడిపోయిందట.అయితే ఆమె ఆశలకు సెన్సార్ కత్తెర వేయడంతో చాలా నిరాశలో మునిగిపోయిందన్నది పక్కన పెడితే మలయాళ వంశానికి చెందిన క్యాథరిన్ ట్రెసాకు మాతృభాష మినహా కన్నడం, హింది, ఇంగ్లిష్ లాంటి భాషలన్నీ తెలుసట.అదేమిటని అడిగితే తాను పుట్టి పెరిగింది దుబాయ్‌లోనని బదులిచ్చింది. -
సంక్రాంతికి సినిమాల సందడి
తమిళులు పొంగల్‌గా జరుపుకునే ముఖ్య పండగ సంక్రాంతి. దీన్ని సినీ వర్గాల పండగగా కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజున పలు భారీ చిత్రాలు విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధమవుతారు. అలా ఈ ఎడాది నాలుగు చిత్రాలు పొంగల్‌కు సిద్ధమవుతున్నాయి. వాటిలో కథాకళి, గెత్తు,రజనీమురుగన్, తారైతప్పట్టై చోటు చేసుకున్నాయి. ఇక వాటి వివరాలు చూస్తే నటుడు విశాల్ కథానాయకుడుగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం కథాకళి. క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. ఇది పూర్తి కమర్షియల్ ఎంటర్టెయిన్మెంట్తో రూపొందిన చిత్రం అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. దీన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది. జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వం వహిస్తున్న చిత్రం తారైతప్పట్టై. శశికుమార్ హీరోగా నటిస్తూ తన కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్గా నటించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇది ఆయనకు వెయ్యొవ చిత్రం కావడం విశేషం. తమిళనాట ప్రసిద్ధి గాంచిన గరగాట్టం నృత్యం ఇతి వృత్తంగా తెరకెక్కిన చిత్రం తారైతప్పట్టై. దీనికి దర్శకుడు బాలా బి.స్టూడియోస్, ఐన్గరన్ ఇంటర్నేషనల్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలు నిర్మాణంలో భాగస్వామిగా ఉండడం విశేషం. మూడో చిత్రం గెత్తు. యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ తన రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గెత్తు. ఇందులో ఎమిజాక్సన్ హీరోయిన్. ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రం ద్వారా తొలిసారిగా యాక్షన్ హీరోగా అవతారమెత్తారు. తిరుకుమరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పొంగల్ రేస్‌లో ఉంది. ఇక నాల్గవ చిత్రం రజనీమురుగన్. శివకార్తీకేయన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తీసురేశ్ హీరోయిన్. పొన్రామ్ దర్శకుడు. దర్శకుడు లింగసామి సమర్పణలో తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుభాష్ చంద్రబోస్ నిర్మించారు. డీ. ఇమాన్ బాణీలు కట్టిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని చాలా కాలమైంది. పలు సమస్యలను ఎదుర్కొని, పలుమార్లు విడుదల తేదీలు వాయిదాపడ్డా ఎట్టకేలకు పొంగల్‌కు తెరపైకి రానుంది. విశేషం ఏమిటంటే ఈ ఏడాది తొలిరోజే ఎనిమిది చిత్రాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ నాలుగు చిత్రాలకు ముందే 8వ తేదీన కైల పూ మాలై చిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో ఏ చిత్రం కాసుల వర్షం కురిపించి విజయం అనిపించుకుంటాయో వేచి చూడాలి. -
జయం రవితో రొమాన్స్
క్యాథరిన్ ట్రెసా తమిళసినిమా: యువ నటుడు జయం రవితో జతకట్టిన హీరోయిన్లందరూ విజయపథంలో సాగారు. తొలి చిత్ర హీరోయిన్ సదా నుంచి త్రిష, జెనీలియా, ఆసిన్ వీళ్లందరూ టాప్ పొజిషన్‌కి చేరారు. ప్రస్తుతం తనీ ఒరువన్ చిత్రంలో నయనతార, రోమియో జూలియట్ చిత్రంలో హన్సిక జయం రవితో డ్యూయెట్స్ పాడుతున్నారు. అలాగే ఇటీవల ప్రారంభమైన తాజా చిత్రంలో ఒక హీరోయిన్గా అంజలి నటిస్తున్నారు. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయంరవికి పక్కన మరో హీరోయిన్‌కు చోటుందట. ఈ పాత్ర క్యాథరిన్ ట్రెసాను వరించనున్నది తాజా సమాచారం. ఈ బ్యూటీ ఇప్పటికే కార్తీ సరసన మెడ్రాస్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం విడుదల కాకముందే అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయట. అందులో ఒకటి జయం రవి చిత్రం. ఈ చిత్రంలో అంజలి గ్రామీణ యువతిగా, క్యాథరిన్ ట్రెసా నాగరిక పాత్రలో స్టైలిష్‌గా అందాలతో దుమ్మురేపే పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. అయితే జయం రవి సరసన నటించడానికి చిత్ర యూనిట్ అడిగిన మాట నిజమేగానీ ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని ఇంకా ఒప్పంద పత్రాలపై సంతకం చేయలేదని క్యాథరిన్ ట్రెసా వర్గం అంటున్నారు. ఈ బ్యూటీ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో రజనీకాంత్ చిత్రంలో ఒక పాటకు ఆడి అదరగొట్టారు.