రానాతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్ | Katherine tresa romance with Rana | Sakshi
Sakshi News home page

రానాతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్

Published Fri, Nov 18 2016 1:26 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానాతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్ - Sakshi

రానాతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్

టాలీవుడ్ యువ నటుడు రానాతో బ్యూటీఫుల్ భామ క్యాథరిన్ ట్రెసా రొమాన్స్కు రెడీ అవుతున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ చక్కర్లు కొడుతూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంటున్న నాయకి క్యాథరిన్ ట్రెసా. ఆ మధ్య కణిదన్ చిత్రంలో అధర్వకు జంటగా నటించి విజయాన్ని చవి చూసిన ఈ అమ్మడు విశాల్‌తో కథకళి చిత్రంలోనూ రొమాన్‌‌స చేశారు. ఇటీవల తెలుగులో అల్లుఅర్జున్‌తో సరైనోడులో మెరిశారు కూడా. ప్రస్తుతం ఆర్యతో కథంబన్, విష్ణువిశాల్‌కు జంటగా కథానాయకన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా రానాతో చిందులేయడానికి రెడీ అవుతున్నారు.

రానా హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నానే రాజా నానే మంత్రి. టాలీవుడ్ దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానాతో ఇప్పటికే నటి కాజల్‌ఆగర్వాల్ డ్యూయెట్లు పాడుతున్నారు. మరో హీరోరుున్ పాత్రలో నటి శ్రుతిహాసన్ నటించనున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడా పాత్రలో నటించే అవకాశం నటి క్యాథరిన్ ట్రెసాను వరించింది. ఇందులో ఈమెకు కాజల్‌అగర్వాల్ పాత్రకు దీటుగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ కారైక్కుడి, కేరళ ప్రాంతాల్లో జరుపుకుంది. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న షూటింగ్‌లో క్యాథరిన్ ట్రెసా పాల్గొననున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement