క్యాథరిన్‌కు మాతృభాష రాదట
మలయాళీ కుట్టికి మాతృభాషే తెలియదట. కథానాయిక లకు కే రళ పుట్టినిల్లుగా మారిందనవచ్చు. మలయాళం మాతృభాషగా కలవారు భారతీయ సినీపరిశ్రమ నంతా అల్లుకుపోతున్నారన్నది ఎవరూ కాదనలేని నిజం. ముఖ్యంగా దక్షిణాది చిత్రసీమలో ఈ బ్యూటీస్‌దే హవా అనవచ్చు. అసిన్, నయనతారల నుంచి యువ తారలు క్యాథరిన్ ట్రెసా,కీర్తీసురేష్ వరకూ పలువురు దక్షిణాదిలో కథానాయికలుగా తమ సత్తా చాటుకుంటున్నారు.
ఇక క్యాథరిన్ ట్రెసా విషయానికి వస్తే మెడ్రాస్ చిత్రంతో కోలీవుడ్‌కు, ఇద్దరమ్మాయిలతో చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. విశాల్‌తో నటించిన కథాకళి చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది.ఈ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లోనూ నటించింది.
ఆ సన్నివేశాలతో యువత గుండెల్లో గిలిగింతలు పెట్టి వారి అభిమానాన్ని పొందేస్తానని తెగ సంబర పడిపోయిందట.అయితే ఆమె ఆశలకు సెన్సార్ కత్తెర వేయడంతో చాలా నిరాశలో మునిగిపోయిందన్నది పక్కన పెడితే మలయాళ వంశానికి చెందిన క్యాథరిన్ ట్రెసాకు మాతృభాష మినహా కన్నడం, హింది, ఇంగ్లిష్ లాంటి భాషలన్నీ తెలుసట.అదేమిటని అడిగితే తాను పుట్టి పెరిగింది దుబాయ్‌లోనని బదులిచ్చింది.