జయం రవితో రొమాన్స్ | Catherine Tresa with Jayam Ravi's romance | Sakshi
Sakshi News home page

జయం రవితో రొమాన్స్

Published Thu, Jul 24 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

జయం రవితో రొమాన్స్

జయం రవితో రొమాన్స్

క్యాథరిన్ ట్రెసా
తమిళసినిమా:
యువ నటుడు జయం రవితో జతకట్టిన హీరోయిన్లందరూ విజయపథంలో సాగారు. తొలి చిత్ర హీరోయిన్ సదా నుంచి త్రిష, జెనీలియా, ఆసిన్ వీళ్లందరూ టాప్ పొజిషన్‌కి చేరారు. ప్రస్తుతం తనీ ఒరువన్ చిత్రంలో నయనతార, రోమియో జూలియట్ చిత్రంలో హన్సిక జయం రవితో డ్యూయెట్స్ పాడుతున్నారు. అలాగే ఇటీవల ప్రారంభమైన తాజా చిత్రంలో ఒక హీరోయిన్‌గా అంజలి నటిస్తున్నారు. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయంరవికి పక్కన మరో హీరోయిన్‌కు చోటుందట. ఈ పాత్ర క్యాథరిన్ ట్రెసాను వరించనున్నది తాజా సమాచారం. ఈ బ్యూటీ ఇప్పటికే కార్తీ సరసన మెడ్రాస్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం విడుదల కాకముందే అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయట.

అందులో ఒకటి జయం రవి చిత్రం. ఈ చిత్రంలో అంజలి గ్రామీణ యువతిగా, క్యాథరిన్ ట్రెసా నాగరిక పాత్రలో స్టైలిష్‌గా అందాలతో దుమ్మురేపే పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. అయితే జయం రవి సరసన నటించడానికి చిత్ర యూనిట్ అడిగిన మాట నిజమేగానీ ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని ఇంకా ఒప్పంద పత్రాలపై సంతకం చేయలేదని క్యాథరిన్ ట్రెసా వర్గం అంటున్నారు. ఈ బ్యూటీ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో రజనీకాంత్ చిత్రంలో ఒక పాటకు ఆడి అదరగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement