
తమిళ హీరో జయం రవి (Jayam Ravi) పేరు మార్చుకున్నాడు. తనను ఇకపై రవి మోహన్(Ravi Mohan) అని పిలవాలని చెప్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన కాదలిక్క నెరమలై సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ రోజు నుంచి నా పేరు రవి లేదా రవి మోహన్. వ్యక్తిగతంగా కానీ, వృత్తిగతంగా కానీ ఇలాగే పిలవండి.
ఇకపై అలా పిలవొద్దు
దయచేసి ఇకపై ప్రతి ఒక్కరూ నన్ను జయం రవి అని సంభోదించకుండా రవి/ రవి మోహన్ అని మాత్రమే పిలవాలని కోరుతున్నాను అన్నాడు. జయం రవి అసలు పేరు రవి. ఆయన తండ్రి మోహన్ డైరెక్ట్ చేసిన జయం (తెలుగు జయం మూవీ రీమేక్) మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో తన పేరు జయం రవిగా మారింది. రెండు దశాబ్దాలుగా జయం రవిగానే కొనసాగిన ఆయన ఇప్పుడు తనను పాత పేరుతోనే పిలవాలని చెప్తున్నాడు. అలాగే ఈ హీరో తన పేరు మీద రవి మోహన్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్ ద్వారా మంచి కథలను అందించడంతో పాటు ప్రతిభావంతులైన కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు.
(చదవండి: 50 ఏళ్ల వయసులో హీరోయిన్ డేటింగ్? నిజమిదే!)
మీరిచ్చిన ప్రేమకు ప్రతిఫలంగా..
అంతే కాదు తన అభిమానుల కోసం రవిమోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించాడు. దీని ద్వారా ఆపదలో ఉన్నవారికి, అవసరం కోసం అర్థిస్తున్నవారికి సాయం చేస్తానన్నాడు. ఈ ఫౌండేషన్‌తో సమాజంలో సానుకూల మార్పును ఆశిస్తున్నట్లు తెలిపాడు. మీరు నాకందించిన ప్రేమాభిమానాలను, సపోర్ట్‌కు ప్రతిఫలంగా నేను మీకు సహాయసహాకారాలు అందిస్తాను అని సదరు లేఖలో పేర్కొన్నాడు.
సినిమా
ఇకపోతే జయం రవి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన కాదళిక్క నేరమిళై మూవీ జనవరి 14న విడుదల కానుంది. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు.
చదవండి: డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్