మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి | Actor Jayam Ravi Wife Aarti: My silence is not a Sign of Guilt | Sakshi
Sakshi News home page

హీరోతో విడాకులు.. నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం..

Published Mon, Sep 30 2024 8:23 PM | Last Updated on Mon, Sep 30 2024 8:28 PM

Actor Jayam Ravi Wife Aarti: My silence is not a Sign of Guilt

తమిళ హీరో జయం రవి విడాకుల వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని రవి తెలపగా.. తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది. విడాకుల విషయంలో వెనక్కు తగ్గేదే లేదని రవి పేర్కొంటుండగా ఇప్పటికీ తన భర్తతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఆర్తి అంటోంది. 

రవిని ముప్పుతిప్పలు పెట్టిన ఆర్తి?
ఇంతలో వీరి విడాకులకు ఈవిడే కారణమంటూ ఓ సింగర్‌ పేరు తెరపైకి రావడం, ఆమె స్పందించి తనను మధ్యలోకి లాగొద్దని హెచ్చరించడమూ జరిగింది. ఇక జయం రవిని ఆర్తి ముప్పుతిప్పలు పెట్టిందంటూ సోషల్‌ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. అతడి సోషల్‌ మీడియా ఖాతాలన్నీ ఆర్తి ఆధీనంలో ఉన్నాయని, వాటిని అతడికి అప్పగించకుండా ఇబ్బందిపెడుతోందని సదరు వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో ఆర్తి తాజాగా సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ షేర్‌ చేసింది.

మౌనంగా ఉన్నానంటే..
'నా వ్యక్తిగత జీవితం గురించి నానారకాలుగా ప్రచారం జరుగుతోంది.  నన్ను చెడుగా చిత్రీకరించి నిజాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అయినా మౌనంగా ఉంటున్నానంటే నేను తప్పు చేశానని అర్థం కాదు. కేవలం హుందాగా వ్యవహరించాలనుకున్నాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాం అని అతడు లేఖ రిలీజ్‌ చేసినప్పుడు నేను నిజంగానే షాకయ్యాను.

అదే నాకు ముఖ్యం
అప్పుడు నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ ఈ విషయంలో తనతో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు అవకాశం ఉందేమోనని ఎదురుచూస్తున్నాను. వివాహవ్యవస్థను నేను గౌరవిస్తాను. ఇరువురి ప్రతిష్టను దెబ్బతీసే బహిరంగ చర్చలను నేను ఎంకరేజ్‌ చేయను. నా కుటుంబ క్షేమమే నాకు ముఖ్యం అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆర్తి పోస్ట్‌ పెట్టింది.

 

 

చదవండి: సినిమాల్లోకి రావాలనుకుని టీవీలో సెటిలయ్యా,.. అనుకున్నంత ఈజీ కాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement