అందాలారబోతకు నాపై ఒత్తిడి లేదు | Katherine tresa about exposing | Sakshi
Sakshi News home page

అందాలారబోతకు నాపై ఒత్తిడి లేదు

Published Fri, Jan 27 2017 3:18 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

అందాలారబోతకు నాపై ఒత్తిడి లేదు

అందాలారబోతకు నాపై ఒత్తిడి లేదు

అందాలారబోతకు నన్నెవరూ ఒత్తిడి చేయడం లేదని నటి క్యాథరిన్  ట్రెసా చెప్పుకొచ్చింది. తమిళం, తెలుగు, కన్నడం అంటూ ఏ భాషలో అయినా వచ్చిన అవకాశాన్ని వదలకుండా చేసేస్తున్న ఆ జాణకు ఇటీవల తెలుగు మెగాస్టార్‌తో ఐటమ్‌ సాంగ్‌లో స్టెప్పులేసే అవకాశం చేతి దాకా వచ్చి నోటికందనట్లు చేజారిపోయింది. ప్రస్తుతం తమిళంలో కడంబన్, కథానాయకన్  చిత్రాల్లో నటిస్తోంది. ఈ అమ్మడు చెప్పే కబుర్లేమిటో చూద్దామా‘నేను కేరళాలో పుట్టినా పెరిగింది మాత్రం దుబాయ్‌లో. కన్నడ చిత్రపరిశ్రమలో కథానాయకిగా పరిచయం అయ్యాను.అయితే అప్పటి నుంచే తమిళం, తెలుగు భాషల్లో అవకాశాల కోసం ఎదురు చూశాను. కారణం ఇతర భాషా చిత్రాల్లో కంటే ఈ భాషా చిత్రాల్లో నటనా ప్రతిభను చాటుకోవడానికి అధిక అవకాశం ఉంటుంది. అలా పా.రంజిత్‌ దర్శకత్వంలో కార్తీ సరసన మెడ్రాస్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అందులో ఉత్తర చెన్నై అమ్మాయిగా నటించడానికి చాలా కష్టపడ్డాననే చెప్పాలి.

భాష తెలిసి నటిస్తే పాత్రకు ప్రత్యేకత ఏర్పడుతుందని తమిళ భాష స్పష్టంగా ఉచ్చరించడాన్ని నేర్చుకున్నాను. మెడ్రాస్‌ చిత్ర విజయం నా కెరీర్‌కు బాగా హెల్ప్‌ అయ్యింది. ఆ తరువాత నటించిన కథకళి, కణిదన్  చిత్రాల్లో నాకు మంచి పాత్రలు లభించాయి. కొత్త చిత్రాలను అంగీకరించినప్పుడు కచ్చితంగా గ్లామరస్‌గా నటించే తీరాలని ఏ దర్శక, నిర్మాత నాపై ఒత్తిడి చేయలేదు. ఇంకా చెప్పాలంటే గ్లామర్‌ విషయంలో ఒక్కో దర్శకుడికి ఒక్కోరకమైన దృష్టి ఉంటుంది. నా వరకూ నేను తెరపై అందంగా కనిపించాలని కోరుకుంటాను. నా శరీరాకృతికి నప్పేలా డ్రస్‌ను సెలెక్ట్‌ చేసుకుంటాను. కోలీవుడ్‌కు చాలా మంది కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఎవరికీ ఏది దక్కాలో అది దక్కుతుంది. నేనెవరికీ పోటీగా భావించడం లేదు. ఇతర హీరోయిన్ల నటననే పోటీగా తీసుకోవాలన్న నా భావన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement