నాకు గుర్తింపు తెచ్చింది మెడ్రాస్ | Iam Malayali girl: Catherine Tresa | Sakshi
Sakshi News home page

నాకు గుర్తింపు తెచ్చింది మెడ్రాస్

Published Mon, Feb 1 2016 4:24 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

నాకు గుర్తింపు తెచ్చింది మెడ్రాస్

నాకు గుర్తింపు తెచ్చింది మెడ్రాస్

నాకు అడ్రస్‌నిచ్చింది మెడ్రాస్(చెన్నై) అని అంటోంది నటి క్యాథరిన్ ట్రెసా. ఇప్పుడు కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదుగుతోంది ఈ మలయాళ బ్యూటీ. కన్నడం, మలయాళం, తెలుగు, తమిళం అంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో రౌండ్స్ కొడుతున్న క్యాథరిన్ ట్రెసా తమిళంలో మెడ్రాస్ చిత్రంతోనే అరంగేట్రం చేసింది. ఆ చిత్రం విజయం అమ్మడికి మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. ఇటీవల విశాల్‌తో నటించిన కథకళి తన కేరీర్‌కు బాగాను ఉపయోగపడిందనే చెప్పాలి. తెలుగులోనూ ఇద్దరమ్మాయిలతో, ఎర్రబసు లాంటి చిత్రాలతో అక్కడి ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం తమిళ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నానంటున్న క్యాథరిన్ ట్రెసా ఇంకా ఏమి చెబుతుందో  ఆమె మాటల్లోనే..
 
నేను మలయాళీ అమ్మాయినే అయినా పుట్టి పెరిగింది దుబాయ్‌లోనే. అమ్మా,నాన్నా అక్కడే ఉంటారు. కథాశాలలో చదువుతున్న రోజుల్లోనే కన్నడ, మలయాళ చిత్రాలలో నటించాను .అయితే నాకు అడ్రస్ నిచ్చింది మాత్రం చెన్నైనే. మెడ్రాస్ చిత్రం తరువాత వరుసగా ఇక్కడ అవకాశాలు వస్తున్నాయి. తమిళ ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఆధర్వ సరసన కణిదన్ చిత్రంతో పాటు వీరధీరశూరన్ అనే చిత్రంలో నటిస్తున్నాను.

ఇలా వరుస అవకాశాలతో కోలీవుడ్ ఆదరించడం సంతోషంగా ఉంది. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతాను.టీవీ తిలకిస్తాను. ఇంకా వంట కూడా చేస్తాను. నెంబర్‌వన్, టూ వంటి స్థానాల గురించి ఆలోచించను. అసలు వాటి గురించి పట్టించుకోను. నా చిత్రాలు ప్రేక్షకుల్ని సంతోషపరచాలన్నదే లక్ష్యంగా పాత్రలను ఎంపిక చేసుకుంటాను. తమిళ ప్రేక్షకులంటే నాకు చాలా ఇష్టం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement