భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌తో రాబోతున్న ‘జార్జిరెడ్డి’ హీరో | Odela RailwayStation Director Do New Film With Sandeep Madhav | Sakshi
Sakshi News home page

భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌తో రాబోతున్న ‘జార్జిరెడ్డి’ హీరో

Published Sun, Jul 2 2023 3:55 PM | Last Updated on Sun, Jul 2 2023 3:55 PM

 Odela RailwayStation Director Do New Film With Sandeep Madhav - Sakshi

దర్శకుడు అశోక్‌ తేజ తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే! ఆహా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించిన ఈ దర్శకుడు అశోక్‌ తేజ ఇప్పుడు యాక్షన్‌ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టారు. కేథరిన్‌ త్రెసా కథానాయికగా, ‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో గుర్తింపు పొందిన సందీప్‌ మాధవ్‌ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

కేసీఆర్‌ ఫిల్మ్స్‌, శ్రీ మహావిష్ణు మూవీస్‌ బ్యానర్లపై ప్రొడక్షన్‌ నంబర్‌వన్‌గా ఈ చిత్రం రూపొందనుంది. దావులూరి జగదీష్‌, పల్లి కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై చివరివారంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రాన్ని చివరి వరకూ సస్పెన్స్‌ రివీల్‌ చేయకుండా ఎంతో గ్రిప్పింగ్‌గా రూపొందించిన అశోక్‌ తేజ యాక్షన్‌ థ్రిల్లర్‌ను అంతకుమించి అద్భుతంగా రూపొందిస్తారని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement