పుస్తకం చూశాకే నిజం తెలిసింది - దాసరి నారాయణరావు | Godari Gattollu Gatsunna Goppollu Book Launched by dasari | Sakshi
Sakshi News home page

పుస్తకం చూశాకే నిజం తెలిసింది - దాసరి నారాయణరావు

Published Sun, Oct 16 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

పుస్తకం చూశాకే నిజం తెలిసింది - దాసరి నారాయణరావు

పుస్తకం చూశాకే నిజం తెలిసింది - దాసరి నారాయణరావు

‘‘గుంటూరు జిల్లాకు చెందిన జగదీష్ ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖులపై పరిశోధనాత్మక రచనలు చేయడం అభినందించదగ్గ విషయం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారు ఇంత మంది ఉన్నారన్న నిజం ‘గోదారి గట్టోళ్ళు.. గట్సున్న గొప్పోళ్ళు’ పుస్తకం చూశాకే తెలిసింది. ఇంత మంచి ప్రయత్నం చేసిన జగదీష్‌కు అభినందనలు’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు.

రాజమండ్రి లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పనిచేస్తున్న బీఎస్ జగదీష్ రచించిన ‘గోదారి గట్టోళ్ళు.. గట్సున్న గొప్పోళ్ళు’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రేలంగి నరసింహారావు, రాజా వన్నెంరెడ్డి, కాశీ విశ్వనాథ్, నటుడు సారిక రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement