బ్రస్సెల్స్: మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బగ్ వల్ల బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ సమస్య తలెత్తడంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత సేవలు నిలిచిపోయాయి. కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. సైబర్‌సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్రై్టక్ అందించిన అప్‌డేట్‌లో బగ్ వల్లే ఈ సంక్షోభం ఏర్పడింది.
ఇది చాలా తీవ్రమైన విషయం కాగా, బెల్జియం వ్యంగ్య రచయిత విన్సెంట్ ఫ్లిబస్టీర్ పరిహాసానికి దిగాడు. నెటిజన్లతో చీవాట్లు తింటున్నాడు. తాను క్రౌడ్‌స్రై్టక్ సంస్థలో కొత్తగా ఉద్యోగంలో చేరానని, మొదటి రోజు సాఫ్ట్‌వేర్‌లో చిన్న ఆప్‌డేట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ‘ఎక్స్’లో పలు పోస్టులు పెట్టాడు. కోడ్‌లో కేవలం ఒక లైన్ మార్చడం వల్ల బగ్ ఏర్పడిందని తెలిపాడు. క్రౌడ్‌స్ట్రైక్ ఆఫీసులో దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు.
నిజానికి అతడు ఈ సంస్థలో ఉద్యోగి కాదు. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఈ ఫొటో సృష్టించాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ మారింది. 3.8 లక్షల లైక్‌లు వచ్చాయి. 37,000 మంది షేర్ చేశారు. కొన్ని గంటల తర్వాత విన్సెంట్ మరో పోస్టు చేశాడు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో బగ్ కారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని బాధపడ్డాడు. ఇది చాలా అన్యాయం అంటూ ఆక్రోశించాడు.
తనకు ఎవరైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని దీనంగా వేడుకున్నాడు. ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్‌్కను సైతం కోరాడు. తాను బాధపడుతున్న వీడియోను పంచుకున్నాడు. నెటిజన్లు చాలామంది ఇదంతా నిజమేనని నమ్మేశారు. కానీ, నిజం దాగదు కదా! వాస్తవం ఏమిటో తెలిసిపోయింది. పిచి్చవేషాలు మానుకోవాలంటూ విన్సెంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. విన్సెంట్ నార్డ్‌ప్రెస్ అనే బెల్జియన్ పేరడీ న్యూస్ సైట్‌కు వార్తలు రాస్తుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment