Cybersecurity
-
సైబర్ సెక్యూరిటీ నిపుణుల కొరత: ఎస్బీఐ చైర్మన్
ముంబై: సైబర్ సెక్యూరిటీ నిపుణుల లభ్యత పరిమిత స్థాయిలోనే ఉండటమనేది భవిష్యత్తులో ’పెద్ద సవాలు’గా పరిణమించవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. మొత్తం వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకు సైబర్‌సెక్యూరిటీపై పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయని వార్షిక బ్యాంకింగ్ సదస్సు ఫిబాక్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.ప్రతి రోజు దాదాపు 1 లక్ష సైబర్ దాడులను ఎదుర్కొంటున్నామని హెచ్ఎస్బీసీ కంట్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హితేంద్ర దవే ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, డిపాజిట్లు నెమ్మదించిన నేపథ్యంలో మార్కెటింగ్‌పై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఎస్బీఐ ఎండీ అశ్విని తివారీ తెలిపారు. స్టార్టప్‌లు, చిన్న.. మధ్య తరహా సంస్థలకు మరింతగా తోడ్పాటు అందించడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
Microsoft outage: బగ్‌తో పరిహాసమా?!
బ్రస్సెల్స్: మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బగ్ వల్ల బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ సమస్య తలెత్తడంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత సేవలు నిలిచిపోయాయి. కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. సైబర్‌సెక్యూరిటీ సంస్థ క్రౌడ్స్రై్టక్ అందించిన అప్డేట్లో బగ్ వల్లే ఈ సంక్షోభం ఏర్పడింది. ఇది చాలా తీవ్రమైన విషయం కాగా, బెల్జియం వ్యంగ్య రచయిత విన్సెంట్ ఫ్లిబస్టీర్ పరిహాసానికి దిగాడు. నెటిజన్లతో చీవాట్లు తింటున్నాడు. తాను క్రౌడ్స్రై్టక్ సంస్థలో కొత్తగా ఉద్యోగంలో చేరానని, మొదటి రోజు సాఫ్ట్‌వేర్‌లో చిన్న ఆప్డేట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ‘ఎక్స్’లో పలు పోస్టులు పెట్టాడు. కోడ్‌లో కేవలం ఒక లైన్ మార్చడం వల్ల బగ్ ఏర్పడిందని తెలిపాడు. క్రౌడ్‌స్ట్రైక్ ఆఫీసులో దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు. నిజానికి అతడు ఈ సంస్థలో ఉద్యోగి కాదు. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఈ ఫొటో సృష్టించాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ మారింది. 3.8 లక్షల లైక్‌లు వచ్చాయి. 37,000 మంది షేర్ చేశారు. కొన్ని గంటల తర్వాత విన్సెంట్ మరో పోస్టు చేశాడు. సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ కారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని బాధపడ్డాడు. ఇది చాలా అన్యాయం అంటూ ఆక్రోశించాడు. తనకు ఎవరైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని దీనంగా వేడుకున్నాడు. ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్‌్కను సైతం కోరాడు. తాను బాధపడుతున్న వీడియోను పంచుకున్నాడు. నెటిజన్లు చాలామంది ఇదంతా నిజమేనని నమ్మేశారు. కానీ, నిజం దాగదు కదా! వాస్తవం ఏమిటో తెలిసిపోయింది. పిచి్చవేషాలు మానుకోవాలంటూ విన్సెంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. విన్సెంట్ నార్డ్ప్రెస్ అనే బెల్జియన్ పేరడీ న్యూస్ సైట్‌కు వార్తలు రాస్తుంటాడు. -
ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..
దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) బంపరాఫర్ ప్రకటించింది. 1,000 మంది ప్రభుత్వ అధికారులకు సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ సెర్ట్ఇన్ (CERT-In)తో గూగుల్ క్లౌడ్ (Google Cloud) తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సెర్ట్ఇన్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)లో భాగం. ఇది సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, హ్యాకింగ్, ఇతర సైబర్ సంబంధిత సమస్యలను చూసుకుంటుంది. (IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!) రూ.లక్ష స్కాలర్షిప్ కూడా.. 'సైబర్ ఫోర్స్' పేరుతో కొంతమంది ప్రభుత్వ అధికారులకు సైబర్ డిఫెన్స్ బెస్ట్ ప్రాక్టీస్‌లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా వీరికి జనరేటివ్ ఏఐ వినియోగం, సైబర్ సెక్యూరిటీ ఏఐ హ్యాకథాన్ల నిర్వహణ వంటివి గూగుల్ క్లౌడ్, మాండియంట్ నిపుణులచే నిర్వహించన్నట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు రూ.లక్ష స్కాలర్షిప్ కూడా ఇవ్వననున్నట్లు పేర్కొంది. ‘సైబర్ భద్రత మన డిజిటల్ భవిష్యత్తుకు మూలస్తంభం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మరింత ముందుకు సాగాలంటే జనరేటివ్ ఏఐ శక్తిని వినియోగించుకోవడం చాలా అవసరం’ అని సెర్ట్ఇన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహ్ల్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా భారతీయులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని సులభతరం చేస్తున్నామని, కొత్త సురక్షితమైన భద్రత సేవలను అందించడానికి సహకారం అందిస్తున్నామని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ అన్నారు. -
రాత్రి అదిరిపోయే పార్టీ ఇచ్చి...ఉదయాన్నే ఉద్యోగులను పీకేసిన కంపెనీ..
-
కంపెనీలు ఎదుర్కొంటున్న రిస్క్‌లేంటో తెలుసా?
న్యూఢిల్లీ: మేధోపరమైన హక్కులు (ఐపీ), సమాచారం, సైబర్ దాడులు, ప్రమాదాలు అనేవి భారత కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన రిస్క్‌లు అని ఫిక్కీ సర్వే తెలిపింది. మహిళల భద్రతా ముప్పు 2021లో 12వ స్థానంలో ఉంటే, 2022లో 5వ స్థానానికి వచ్చినట్టు పేర్కొంది. దీంతో కంపెనీలు తమ మహిళా ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఎత్తి చూపింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! లాజిస్టిక్స్, నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీని ప్రధానంగా ప్రస్తావించాయి. ముఖ్యంగా లాజిస్టిక్స్ కంపెనీలకు రోడ్డు ప్రమాదాలు రెండో అత్యంత ఆందోళకరమైన అంశంగా ఉంది. ఐపీ హక్కుల చోరీ మొదటి స్థానంలో ఉంది. నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాల రూపంలో ఎక్కువ రిస్క్‌ను చూస్తున్నాయి. రిటైల్ పరిశ్రమ ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీ, విపత్తులను రిస్క్‌లుగా తెలిపాయి. మీడియా, వినోద పరిశ్రమ సమాచారం, సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లను ప్రస్తావించాయి. ఐటీ, తయారీ రంగంలో ఐపీ హక్కుల చోరీ ప్రథమ రిస్క్‌గా ఉంది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే రిస్క్‌లను తెలుసుకునేందుకు ఫిక్కీ ఈ వార్షిక సర్వే నిర్వహించింది. ఇదీ చదవండి: వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్! -
‘సెబీ’ సైబర్ సెక్యూరిటీ నిబంధనలు కఠినతరం
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్చంజీలు, ఇతరత్రా మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు పాటించాల్సిన సైబర్ సెక్యూరిటీ నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింత కఠినతరం చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు మొదలైన మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐ) ఇకపై ప్రతీ ఆర్థిక సంవత్సరంలో కనీసం 2 సార్లు సమగ్రమైన సైబర్ ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సైబర్ ఆడిట్ నివేదికలతో పాటు నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామంటూ ఆయా సంస్థల ఎండీ, సీఈవోలు ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో తెలిపింది. సవరించిన నిబంధనల ప్రకారం వ్యాపార కార్యకలాపాలు, డేటా మేనేజ్మెంట్, సర్వీసుల నిర్వహణలో కీలకమైన అసెట్లను వాటి ప్రాధాన్యత ప్రకారం వర్గీకరించాలి. సైబర్ ఆడిట్ల (వీఏపీటీ) నిర్వహణ పూర్తయిన నెల రోజుల్లోగా సెబీకి నివేదిక సమర్పించాలి. -
గూగుల్ చేతికి మాన్డియంట్
సిల్వర్ స్ప్రింగ్, అమెరికా: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా సైబర్ సెక్యూరిటీ సేవల సంస్థ మాన్డియంట్ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 5.4 బిలియన్ డాలర్లు. రెండు కంపెనీల మధ్య చర్చలు జరిగిన ఫిబ్రవరి తొలినాళ్లలో మాన్డియంట్ షేరు విలువకు 57 శాతం అధికం చెల్లించేలా ఒప్పందం కుదిరింది. వర్జీనియా రాష్ట్రంలోని రెస్టన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మాన్డియంట్లో 5,300 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. లావాదేవీ ముగిసిన వెంటనే గూగుల్ క్లౌడ్‌లో ఈ సంస్థ విలీనమవుతుంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో రష్యా నుంచి సైబర్ దాడులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు, ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో ఈ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో కన్సాలిడేషన్‌కు ఇది ఆరంభం మాత్రమే కావచ్చని వెడ్‌బుష్ అనలిస్ట్ డాన్ ఐవిస్ అభిప్రాయపడ్డారు. -
గూగుల్ చరిత్రలో మరో అతి పెద్ద డీల్..!
ప్రముఖ టెక్ దిగ్గజం అల్ఫాబెట్ ఇంక్‌కు చెందిన గూగుల్ మరో అతి పెద్ద భారీ డీల్‌ను కుదుర్చుకొనుంది. ఇది కంపెనీ చరిత్రలో రెండో అతిపెద్ద డీల్‌గా నిలిచే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలకు పోటీగా..! గూగుల్ సమీప టెక్ ప్రత్యర్థులు మైక్రోసాఫ్ట్ , అమెజాన్ కంపెనీలు క్లౌడ్ రంగంలో అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగంలో వీటికి గట్టిపోటీను అందించేందుకుగాను సైబర్ సెక్యూరిటీ సంస్థ మాండియంట్ ఇంక్‌ను గూగుల్ కొనుగోలుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 5.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. గూగుల్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద డీల్‌గా నిలవనుంది. 2011లో మోటోరోలా మొబిలిటీను సుమారు 12.5 బిలియన్ డాలర్లతో గూగుల్ కైవసం చేసుకుంది. మరింత వేగంగా..! మాండియంట్ ఇంక్ కొనుగోలుతో గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం మరింత మెరుగుపడనుంది. ఈ ఒప్పందంతో గూగుల్ ఈ రంగంలో ఏడాదిగాను 19 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించనుంది. మరోవైపు పలు నివేదికల ప్రకారం...మైక్రోసాఫ్ట్ కార్ప్ కూడా మాండియంట్ ఇంక్ కంపెనీ కొనుగోలుపై దృష్టి సారిస్తోందని తెలుస్తోంది. ఈ సాఫ్ట్వేర్ దిగ్గజం వచ్చే ఐదేళ్లలో సైబర్ సెక్యూరిటీ కోసం 20 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు గతంలో అంచనా వేసింది. గూగుల్‌తో మాండియంట్ ఇంక్ ఒప్పందం జరుగుతుందనే ఊహగానాలతో మంగళవారం ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో మాండియంట్ షేర్లు 2శాతం క్షీణించగా, ఆల్ఫాబెట్ షేర్లు 0.2 శాతం పెరిగి 2532.20 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఒప్పందం ముగియనున్నట్లు తెలుస్తోంది. చదవండి: శాంసంగ్‌కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు.! -
పంజాబ్ నేషనల్ బ్యాంక్: 18 కోట్ల ఖాతాదారులకు భారీ షాక్!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) సర్వర్‌లో భారీ లోపం ఒకటి తాజాగా బయటపడింది. ఈ లోపం వల్ల సుమారు ఏడు నెలల పాటు తన 18 కోట్ల వినియోగదారుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం బయటకి వెల్లడైనట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ ఎక్స్9 తెలిపింది. బ్యాంక్‌కు సంబంధించిన డిజిటల్ బ్యాంకింగ్‌కు వ్యవస్థ మొత్తాన్ని యాక్సెస్ చేసే అవకాశాన్ని సర్వర్‌లోని లోపం కల్పించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇంతలో బ్యాంకు ఈ లోపం గురించి ధృవీకరించింది, కానీ దుర్బలత్వం కారణంగా కీలకమైన డేటా బహిర్గతం కాలేదని తెలిపింది. "దీని వల్ల కస్టమర్ డేటా/అప్లికేషన్లు ప్రభావితం కావు, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా సర్వర్ షట్ డౌన్ చేసినట్లు" అని పీఎన్బీ తెలిపింది. "పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) గత 7 నెలలుగా 180 మిలియన్లకు పైగా ఖాతాదారుల నిధులు, వ్యక్తిగత, ఆర్థిక వివరాలు, నగదు విషయంలో బ్యాంక్ రాజీ పడింది. సైబర్ ఎక్స్9 లోపం కనుగొన్న తర్వాత సిఇఆర్టి-ఇన్, ఎన్‌సిఐఐపీసి సహాయంతో పీఎన్బీకి తెలియజేయడంతో బ్యాంక్ మేల్కొని లోపాన్ని పరిష్కరించింది" అని సైబర్ ఎక్స్9 వ్యవస్థాపకుడు, ఎండి హిమాన్షు పాఠక్ తెలిపారు. సైబర్ ఎక్స్9 పరిశోధన బృందం పీఎన్బీలో చాలా క్లిష్టమైన భద్రతా సమస్యను కనుగొన్నట్లు తెలిపింది. (చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ బైక్..!) ఈ లోపం సైబర్ దాడులకు వీలు కల్పించే విధంగా ఉందని, అడ్మిన్ యాక్సెస్ సైతం అందించేవిధంగా ఈ లోపాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఖాతాదారుల ఈ-మెయిల్ సైతం యాక్సెస్ చేసుకునే విధంగా ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 19న పీఎన్బీ చర్యలు చేపట్టినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. అయితే, దీనిపై పీఎన్బీ స్పందిస్తూ.. సర్వర్‌లో లోపం ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అందులో ఎలాంటి సున్నితమై, క్లిష్టమైన డేటా లేదని పేర్కొంది. ఆన్-ప్రిమ్ నుంచి ఆఫీస్ 365 క్లౌడ్‌లోకి ఈ-మెయిల్స్‌ను రూట్ చేయడానికి మాత్రమే ఆ సర్వర్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపింది. సైబర్ ఎక్స్9 చెప్పినట్లుగా ఖాతాదారులకు సంబంధించిన డేటా ఏదీ బయటకు రాలేదని చెప్పింది. ఎప్పటికప్పుడు సిఇఆర్టి-ఇన్ ఎంప్యానెల్డ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్లు తనిఖీ చేస్తూనే ఉన్నారని వివరించింది. -
'పెగసస్' మీ స్మార్ట్‌ఫోన్ పై దాడి చేసిందో లేదో తెలుసుకోండిలా?!
ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్ పెగసస్ అనే సాఫ్ట్వేర్ ను డిజైన్ చేసింది. అయితే హ్యాకర్స్ ను ఈ సాఫ్ట్వేర్ లీక్ చేసి దాని సాయంతో ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖుల స్మార్ట్ఫోన్లలోకి అక్రమంగా చొరబడి రహస్యాల్ని కనిపెట్టేస్తోంది. దీంతో వినియోగదారులు ఈ వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో యూకేకి చెందిన స్వచ్ఛంద సంస్థ 'అమ్నెస్టీ' ఇంటర్నేషనల్ కాల్డ్ మొబైల్ వెరిఫికేషన్ టూల్ (ఎంవీటీ) కిట్ ను డిజైన్ చేసింది. ఈ టూల్ కిట్ సాయంతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో పెగసస్ దాడి చేసిందా? లేదా అనే విషయాన్ని గుర్తించవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న డేటాను ఎంవీటి ఫోల్డర్ లో బ్యాక్ అప్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ అప్ చేసిన అనంతరం ప్రోగ్రాం ద్వారా (కమాండ్ లైన్ ఇంటర్ ఫేస్) యూజర్లకు కాంటాక్ట్స్,ఫోటోలు దీంతో ఇతర ఫోల్డర్లను చెక్ చేస్తుంది. ఒకవేళ కమాండ్ లైన్ ఇంటర్ ఫేస్‌లో పెగసెస్ ఉంటే వెంటనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తోంది. చదవండి: ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి, కారణం ఇదేనా -
పెగసస్ ఫోన్లోకి చొరబడితే.. అంతే సంగతి!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది.ఉగ్రవాదులు, నేరగాళ్ల పనిపట్టేందుకు తయారైన సాఫ్ట్వేర్ ఇది. కానీ భారత్‌లో మాత్రం ప్రతిపక్షాలు, విలేకరులపై దీని సాయంతో నిఘా పెడుతున్నారన్న ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. ఈ స్పైవేర్ నిజంగా అంత భయంకరమైందా..? వివరాలు తెలుసుకుందాం.. ఏమిటీ పెగసస్ సాఫ్ట్వేర్? ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్ అభివృద్ధిపరిచిన ఓ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. స్మార్ట్ఫోన్ల నుంచి రహస్యంగా సమాచారం సేకరించేందుకు పనికొస్తుంది. ఈ మాల్వేర్ లేదా స్పైవేర్ ఉన్న స్మార్ట్ఫోన్ల మైక్రోఫోన్, కెమెరా నియంత్రణ ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కావాలనుకుంటే ఈ–మెయిళ్లు, లొకేషన్ డేటాను కూడా సంపాదించొచ్చు. ఎన్క్రిప్టెడ్ (రహస్యమైన సంకేత భాషలోకి మార్చేసిన) ఆడియో ఫైళ్లను, మెసేజీలను (వాట్సాప్ లాంటివి) కూడా పెగసస్ ద్వారా వినొచ్చు, చదవొచ్చని యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తయారుచేసే కాస్పర్‌స్కై నివేదిక చెబుతోంది. ప్రభుత్వాలకు మాత్రమే.. 2010లో ఏర్పాటైన ఎన్ఎస్వో గ్రూపు తెలిపిన మేరకు ఈ పెగసస్ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే విక్రయిస్తారు. ఉగ్రవాదం, నేరాల నిరోధమే లక్ష్యంగా తాము ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశామని ఈ సంస్థ చెబుతోంది. 2017లో దుబాయ్ మానవహక్కుల కార్యకర్త అహ్మద్ మన్సూర్ తొలిసారి ఈ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించారు. అప్పట్లో ఆయన స్మార్ట్‌ఫోన్ కూడా ఈ మాల్వేర్ బారినపడటంతో ఈ విషయం బయటకొచ్చింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎస్ఎంఎస్లు వస్తుండటంతో అతడు తన ఫోన్‌ను సైబర్ సెక్యురిటీ సంస్థ సిటిజన్ ల్యాబ్‌లో చెక్ చేయించాడు. 2016 నుంచే ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్ఫోన్లలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. గుర్తించడం చాలా కష్టం.. స్మార్ట్ఫోన్లలో పెగసస్ సాఫ్ట్వేర్ చేరినా దాన్ని గుర్తించడం చాలా కష్టం అంటున్నారు సైబర్ నిపుణులు. వాట్సాప్ కాల్ ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ మన ఫోన్లోకి చొరపడొచ్చని పేర్కొంటున్నారు. వాట్సాప్ కాల్‌ను మీరు కట్ చేసేసినా సరే.. ఈ సాఫ్ట్వేర్ మన ఫోన్లోకి చేరుతుంది. ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా కూడా ఇతరుల ఫోన్లలోకి పంపొచ్చు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు కూడా గుర్తించకుండా ఉండేందుకు తనను తాను చెరిపేసుకోగల (ఎరేజ్) సౌకర్యం కూడా దీంట్లో ఉంది. ఇతర అప్లికేషన్ల మాదిరిగా అన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్‌లో అవశేషాలు వదిలిపెట్టదు. కొంతకాలం కింద వాట్సాప్ సంస్థ ఈ పెగసస్ విషయంలో ఎన్ఎస్వో గ్రూపుపై కోర్టులో దావా వేసింది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్ ప్లాట్ఫార్మ్ వద్ద పెగసస్ బాధితుల జాబితా ఉన్నట్లు స్పష్టమైంది. పెగసస్ చొరబడ్డ స్మార్ట్ఫోన్లకు వాట్సాప్ స్వయంగా మెసేజీలు పంపిస్తూ అప్డేట్ చేసుకోవాలని కోరుతోంది. పెగసస్ బారిన పడ్డామని తెలుసకునేందుకు ప్రస్తుతానికి ఇదొక్కటే దారి! ఇతర అప్లికేషన్లపై ప్రభావం ఉంటుందా? ఇతర అప్లికేషన్లపై దీని ప్రభావం ఏంటన్నది తెలియదు. మైక్, కెమెరా కంట్రోలర్ ద్వారా ఫైళ్లు, ఫొటోలు సంపాదించే అవకాశం ఉంది. అలాగే ఎన్క్రిప్టెడ్ మెసేజీలు, ఈ–మెయిళ్లు కూడా. అయితే వాటిలో మార్పుచేర్పులు చేసేందుకు పెగసస్ అవకాశం కల్పిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి తెలియదు. లొకేషన్ డేటా, స్క్రీన్షాట్లు తీయడం, టైపింగ్ తాలూకు ఫీడ్‌బ్యాక్ లాగ్స్‌ను సేకరించడం పెగసస్‌కు ఉన్న అదనపు సామర్థ్యాలు. మన కాంటాక్ట్‌ల వివరాలు, బ్రౌజింగ్ హిస్టరీ, మైక్రోఫోన్ రికార్డింగ్స్ కూడా సేకరిస్తుంది. ఏం చేయాలి? స్మార్ట్‌ఫోన్‌లో పెగసస్ ఉన్నట్లు తెలిస్తే.. ఆ ఫోన్‌ను వదిలించుకోవడం మినహా వేరే మార్గం లేదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఫోన్లో అన్ని అప్లికేషన్ల సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకోవడం మేలని సిటిజన్ ల్యాబ్ సూచిస్తోంది. ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్‌ను వాడినా పెగసస్ తొలగిపోదని వివరించింది. బ్యాంక్, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను జాగ్రత్తగా ఉంచుకునేందుకు క్లౌడ్ ఆధారిత అప్లికేషన్ల పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని కోరింది. -
ఐటీలో భవిష్యత్ అంతా వీటిదే
న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీలు, సర్వీసులే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం వృద్ధికి దోహదపడనున్నట్లు దిగ్గజ సంస్థ విప్రో సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. డేటా, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ వంటి విభాగాలు భారీ స్థాయిలో ఎదిగే అవకాశం ఉందని వివరించారు. ఎక్కడ నుంచి అయినా పనిచేయడం, క్రౌడ్‌సోర్సింగ్ తదితర విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలకు సైబర్‌సెక్యూరిటీ అత్యంత ప్రాధాన్య అంశంగా మారిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. వృద్ధి సాధన దిశగా తమ సంస్థ అయిదు సూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. కీలక రంగాలపై మరింతగా దృష్టి పెట్టడం, క్లయింట్లతో భాగస్వామ్యాన్ని పటిష్టపర్చుకోవడం, ప్రతిభావంతులైన సిబ్బందిపై ఇన్వెస్ట్ చేయడం, వ్యాపార నిర్వహణ విధానాన్ని సరళతరం చేయడం మొదలైనవి వీటిలో ఉన్నట్లు డెలాపోర్ట్ తెలిపారు. వ్యాపార వ్యూహాల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలతో పాటు భారత్‌లో కూడా ఇతర సంస్థలను కొనుగోలు చేసినట్లు వివరించారు. క్యాప్కో సంస్థ కొనుగోలుతో అంతర్జాతీయంగా ఆర్థిక సేవల మార్కెట్లో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ఆయన పేర్కొన్నారు.దీనికోసం విప్రో సుమారు 1.45 బిలియన్ డాలర్లు వెచ్చించింది. చదవండి: Gold: డిజిటల్ గోల్డ్‌తో.. లాభాల పంట -
ఆండ్రాయిడ్ ఫోన్లకు మాల్వేర్ ముప్పు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల నుంచి బ్యాంకింగ్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్‌రాక్’ పేరుతో ఓ మాల్వేర్ చలామణిలో ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒకటి గురువారం హెచ్చరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని దాదాపు 337 అప్లికేషన్ల నుంచి ఈ మాల్వేర్ సమాచారాన్ని సేకరించగలదని, ఈమెయిల్, ఈకామర్స్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్ ఆప్స్ కూడా ఇందులో ఉన్నాయని ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ’క్లుప్తంగా సెర్ట్.ఇన్ హెచ్చరించింది. ఈ ట్రోజన్ వైరస్ ఇప్పటికే ప్రపంచమంతా చక్కర్లు కొడుతోందని సెర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్లాక్‌రాక్‌ను క్సెరెక్స్ బ్యాంకింగ్ మాల్వేర్ సోర్స్‌కోడ్ ఆధారంగా తయారు చేశారని ఈ క్సెరెక్స్ అనేది లోకిబోట్ ఆండ్రాయిడ్ ట్రోజాన్ అని సెర్ట్ తెలిపింది. ఈ వైరస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడినప్పుడు యాప్ డ్రాయర్ నుంచి తన ఐకాన్‌ను దాచివేస్తుందని, ఆ తరువాత గూగుల్అప్డేట్ రూపం దాల్చి అనుమతులు కోరుతుందని వివరించారు. ఒక్కసారి అనుమతులిస్తే.. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే సమాచారం లాగేస్తుందని సెర్ట్ తెలిపింది. గుర్తు తెలియని అప్లికేషన్లను డౌన్లోడ్/ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండటం, అప్లికేషన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వినియోగదారుల సమీక్షలను కూడా గమనించి ఒక నిర్ణయం తీసుకోవడం.. అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునే ముందు అదనపు సమాచారం ఏముందో తెలుసుకోవడం, తెలియని వైఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండటం ద్వారా ఈ మాల్వేర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
పిల్లలూ.. ఇంటర్నెట్తో జర భద్రం
న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా పెద్దలూ పిల్లలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పిల్లలు ఇంటర్నెట్ ను ఉపయోగించడం పెరిగింది. దీంతో పిల్లలు అందులో అసభ్యకరమైనవి చూసే అవకాశం ఉందని, తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని జాతీయ సైబర్ సెక్యూరిటీ హెచ్చరిచింది. పాఠశాలకు సంబంధించిన రిపోర్టులు, టీచర్లను కలవడం, ఆటల కోసం పిల్లలు ఇంటర్నెట్ ను విపరీతంగా వినియోగిస్తున్నారని, ఇందులో మేలు ఎంత ఉందో అదే స్థాయిలో ప్రమాదం కూడా పొంచి ఉందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ ఐటీ) తెలిపింది. పిల్లలు ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారో గమనిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. (ఆ ప్రచారం తప్పు : ప్రధాని మోదీ) -
మహిళలూ.. మీకిక్కడ ఉద్యోగాలు లేవు!
సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీలో లింగబేధ సమస్య తారాస్థాయికి చేరింది. అత్యున్నత సంస్థలు సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో పురుషులనే అధికంగా నియమించుకుంటున్నాయి. మహిళల్లో సమర్ధత ఉన్నా.. వారిని నియమించుకునేందుకు సంస్థలు మాత్రం ముందుకు రావడం లేదు. ఐటీ సెక్టార్లో ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సెక్టార్లో లింగబేధం చాలా అధికంగా ఉందని తాజా నివేదిక ఒకటి స్పష్టం చేసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 సంస్థల్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఐఎస్ఓ) హోదాలో 87 శాతం మంది పురుషులు విధులు నిర్వహిస్తున్నారు. సీఐఎస్ఓ ఉద్యోగాలపై అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఫోరెస్టర్ పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ప్రధానంగా టాప్ 20 కంపెనీల్లో సీఐఎస్ఓ హోదాలో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇటువంటి పరిస్థితివల్ల భవిష్యత్తులో లింగబేధ సమస్యలు ఏర్పడతాయని ఫోరెస్టర్ నివేదిక తెలిపింది. టాప్ 500 సంస్థల్లో సీఐఎస్ఓ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 45 శాతం మంది ఎంబీఏలు ఉన్నారని ఫెరెస్టర్ విశ్లేషకులు జెఫ్పొలార్డ్ తెలిపారు. భవిష్యత్‌లో ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలు ఏర్పడతాయని చెప్పారు. -
సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారా?
రూ.5 కోట్ల వరకూ ఆర్ అండ్ డీ నిధుల్ని ఇస్తామంటున్న కేంద్రం న్యూఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తుల్ని తయారు చేసే కంపెనీలకు కేంద్రం బొనాంజా ప్రకటించింది. స్టార్టప్ గానీ, మరే ఇతర సంస్థ గానీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి పరిశోధన చేసి, ఒరిజినల్ ఉత్పత్తుల్ని అభివృద్ధి చేస్తే... దానికోసం పెట్టిన మొత్తం ఖర్చును రూ.5 కోట్ల వరకూ తాము తిరిగి చెల్లిస్తామని కేంద్రం ప్రకటించింది. దీన్ని ‘చాలెంజ్ గ్రాంట్’గా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించారు. ఇక్కడ అసోచామ్ నిర్వహించిన ఒక సైబర్ సెక్యూరిటీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దేశంలో డిజిటల్/ ఇన్ఫర్మేషన్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకే సైబర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఏర్పడిందని తెలిపారు. మొబైల్ ఫోన్లలోని సైబర్ సెక్యూరిటీ ఫైర్వాల్స్కు సంబంధించిన వివరాలను తెలియజేయాల్సిందిగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు నోటీసులు జారీచేశామని గుర్తుచేశారు. ‘మేం టెలిఫోన్లకు సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలుండాలని భావిస్తున్నాం. వాటి రూపకల్పన జరుగుతోంది. ఈ విషయంలో రాజీపడం’ అన్నారు. డిజిటల్ గవర్నెన్స్ వల్ల ప్రభుత్వానికి గత మూడేళ్లలో రూ.57,000 కోట్లు మిగిలాయన్నారు. డీమోనిటైజేషన్ తర్వాత భీమ్ ప్లాట్ఫామ్లో లావాదేవీలు పెరిగాయని పేర్కొన్నారు. భీమ్ యాప్ ట్రాన్సాక్షన్లు రోజుకు 3,700 నుంచి 5.4 లక్షలకు ఎగశాయన్నారు. విలువ పరంగా రోజుకు రూ.1.93 కోట్లు నుంచి రూ.87 కోట్లకు పెరిగిందన్నారు. ఎస్‌జీఐలో మిగులువాటాను కొంటున్న సెంబ్‌కార్ప్ ముంబై: సోలార్, విండ్వపర్ వ్యాపారంలో నిమగ్నమైన తమ గ్రూప్ కంపెనీ సెంబ్‌కార్ప్ గ్రీన్ ఎనర్జీ (ఎస్జీఐ)లో మిగిలిన వాటాను ఐడీఎఫ్సీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ నుంచి రూ. 1,410.2 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ తెలిపింది. డీల్ 2018 తొలి త్రైమాసికంలో పూర్తికాగలదని సెంబ్‌కార్ప్ గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ చెప్పారు. దీంతో ఎస్జీఐ పూర్తి వాటా తమ చేతికి వస్తుందని ఆయన తెలిపారు. 1200 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం కలిగిన సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు ఏడు రాష్ట్రాల్లో ఎస్‌జీఐకి వున్నాయి. -
సైబర్ భద్రతలో భారత్‌కు 23వ ర్యాంకు
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతలో మొత్తం 165 దేశాల్లో భారత్ 23వ స్థానంలో నిలిచినట్లు ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్(ఐటీయూ) తెలిపింది. రెండో ప్రపంచ సైబర్ భద్రతా సూచీ(జీసీఐ)లో సింగపూర్ తొలిస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. అమెరికా, మలేసియా, ఒమన్, ఇస్తోనియా, మారిషస్, ఆస్ట్రేలియాలు తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ జాబితాలోని 77 దేశాలు సైబర్ భద్రత కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని ఐటీయూ తెలిపింది. గతేడాది పంపిన మొత్తం ఈ మెయిల్స్‌లో 1 శాతం సైబర్ దాడులకు ఉద్దేశించినవేనని ఐటీయూ సెక్రటరీ జనరల్ హౌలిన్ జహో తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ టెక్నాలజీ యూనివర్సిటీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ త్వరలో టెక్నాలజీ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయనున్నది. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతించాలంటూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను బీఎస్ఎన్ఎల్ అధికారులు సంప్రదించనున్నారు. ఈ వివరాలను బీఎస్ఎన్ఎల్ డెరైక్టర్(కన్సూమర్ మొబిలిటి) అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు. తమకు అనుమతులు లభించడం పెద్ద కష్టం కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ క్యాంపస్‌లో(ఘజియాబాద్ సెంటర్) ఒకేసారి 1,500 మంది నుంచి 3,000 మందికి శిక్షణనివ్వగలమని శ్రీవాత్సవ చెప్పారు. తమకు దేశవ్యాప్తంగా 16 సెంటర్లు ఉన్నాయని వివరించారు. సైబర్ సెక్యూరిటీలో కొన్ని కోర్సులను ఆఫర్ చేయనున్నామని చెప్పారు. కాగా, ప్రస్తుత సీఎండీ ఆర్.కె. ఉపాధ్యాయ అనంతరం బీఎస్ఎన్ఎల్ సీఎండీగా శ్రీవాత్సవను పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలెక్షన్ బోర్డ్ ఎంపిక చేసింది. యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి సవివర నివేదికను రూపొందించడానికి సీనియర్ జనరల్ మేనేజర్ జీసీ మన్న అధ్యక్షతన బీఎస్ఎన్ఎల్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.