
సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీలో లింగబేధ సమస్య తారాస్థాయికి చేరింది. అత్యున్నత సంస్థలు సైబర్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లో పురుషులనే అధికంగా నియమించుకుంటున్నాయి. మహిళల్లో సమర్ధత ఉన్నా.. వారిని నియమించుకునేందుకు సంస్థలు మాత్రం ముందుకు రావడం లేదు.
ఐటీ సెక్టార్‌లో ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సెక్టార్‌లో లింగబేధం చాలా అధికంగా ఉందని తాజా నివేదిక ఒకటి స్పష్టం చేసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 సంస్థల్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఐఎస్‌ఓ) హోదాలో 87 శాతం మంది పురుషులు విధులు నిర్వహిస్తున్నారు. సీఐఎస్‌ఓ ఉద్యోగాలపై అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఫోరెస్టర్ పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి.
ప్రధానంగా టాప్ 20 కంపెనీల్లో సీఐఎస్‌ఓ హోదాలో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇటువంటి పరిస్థితివల్ల భవిష్యత్తులో లింగబేధ సమస్యలు ఏర్పడతాయని ఫోరెస్టర్ నివేదిక తెలిపింది. టాప్ 500 సంస్థల్లో సీఐఎస్‌ఓ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 45 శాతం మంది ఎంబీఏలు ఉన్నారని ఫెరెస్టర్ విశ్లేషకులు జెఫ్‌పొలార్డ్ తెలిపారు. భవిష్యత్‌లో ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలు ఏర్పడతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment