బీఎస్‌ఎన్‌ఎల్ టెక్నాలజీ యూనివర్సిటీ | BSNL to open technical university, offer cybersecurity training | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్ టెక్నాలజీ యూనివర్సిటీ

Published Mon, Apr 14 2014 1:13 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

బీఎస్‌ఎన్‌ఎల్ టెక్నాలజీ యూనివర్సిటీ - Sakshi

బీఎస్‌ఎన్‌ఎల్ టెక్నాలజీ యూనివర్సిటీ

 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలో  టెక్నాలజీ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులను బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్ చేయనున్నది. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతించాలంటూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు సంప్రదించనున్నారు. ఈ వివరాలను బీఎస్‌ఎన్‌ఎల్ డెరైక్టర్(కన్సూమర్ మొబిలిటి) అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు. తమకు అనుమతులు లభించడం పెద్ద కష్టం కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 తమ క్యాంపస్‌లో(ఘజియాబాద్ సెంటర్) ఒకేసారి 1,500 మంది నుంచి 3,000 మందికి శిక్షణనివ్వగలమని శ్రీవాత్సవ చెప్పారు. తమకు దేశవ్యాప్తంగా 16 సెంటర్లు ఉన్నాయని వివరించారు. సైబర్ సెక్యూరిటీలో కొన్ని కోర్సులను ఆఫర్ చేయనున్నామని చెప్పారు. కాగా, ప్రస్తుత సీఎండీ ఆర్.కె. ఉపాధ్యాయ అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీగా శ్రీవాత్సవను పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ సెలెక్షన్ బోర్డ్ ఎంపిక చేసింది. యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి సవివర నివేదికను రూపొందించడానికి సీనియర్ జనరల్ మేనేజర్ జీసీ మన్న అధ్యక్షతన బీఎస్‌ఎన్‌ఎల్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement