
ప్రతీకాత్మక చిత్రం
పిల్లలు ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారో గమనిస్తూ ఉండాలని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా పెద్దలూ పిల్లలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పిల్లలు ఇంటర్నెట్ ను ఉపయోగించడం పెరిగింది. దీంతో పిల్లలు అందులో అసభ్యకరమైనవి చూసే అవకాశం ఉందని, తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని జాతీయ సైబర్ సెక్యూరిటీ హెచ్చరిచింది. పాఠశాలకు సంబంధించిన రిపోర్టులు, టీచర్లను కలవడం, ఆటల కోసం పిల్లలు ఇంటర్నెట్ ను విపరీతంగా వినియోగిస్తున్నారని, ఇందులో మేలు ఎంత ఉందో అదే స్థాయిలో ప్రమాదం కూడా పొంచి ఉందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ ఐటీ) తెలిపింది. పిల్లలు ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారో గమనిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. (ఆ ప్రచారం తప్పు : ప్రధాని మోదీ)