పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) సర్వర్‌లో భారీ లోపం ఒకటి తాజాగా బయటపడింది. ఈ లోపం వల్ల సుమారు ఏడు నెలల పాటు తన 18 కోట్ల వినియోగదారుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం బయటకి వెల్లడైనట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ ఎక్స్9 తెలిపింది. బ్యాంక్‌కు సంబంధించిన డిజిటల్ బ్యాంకింగ్‌కు వ్యవస్థ మొత్తాన్ని యాక్సెస్ చేసే అవకాశాన్ని సర్వర్‌లోని లోపం కల్పించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇంతలో బ్యాంకు ఈ లోపం గురించి ధృవీకరించింది, కానీ దుర్బలత్వం కారణంగా కీలకమైన డేటా బహిర్గతం కాలేదని తెలిపింది.
"దీని వల్ల కస్టమర్ డేటా/అప్లికేషన్లు ప్రభావితం కావు, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా సర్వర్ షట్ డౌన్ చేసినట్లు" అని పీఎన్‌బీ తెలిపింది. "పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) గత 7 నెలలుగా 180 మిలియన్లకు పైగా ఖాతాదారుల నిధులు, వ్యక్తిగత, ఆర్థిక వివరాలు, నగదు విషయంలో బ్యాంక్ రాజీ పడింది. సైబర్ ఎక్స్9 లోపం కనుగొన్న తర్వాత సిఇఆర్‌టి-ఇన్, ఎన్‌సిఐఐపీసి సహాయంతో పీఎన్‌బీకి తెలియజేయడంతో బ్యాంక్ మేల్కొని లోపాన్ని పరిష్కరించింది" అని సైబర్ ఎక్స్9 వ్యవస్థాపకుడు, ఎండి హిమాన్షు పాఠక్ తెలిపారు. సైబర్ ఎక్స్9 పరిశోధన బృందం పీఎన్‌బీలో చాలా క్లిష్టమైన భద్రతా సమస్యను కనుగొన్నట్లు తెలిపింది.
(చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ బైక్..!)
ఈ లోపం సైబర్ దాడులకు వీలు కల్పించే విధంగా ఉందని, అడ్మిన్ యాక్సెస్ సైతం అందించేవిధంగా ఈ లోపాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఖాతాదారుల ఈ-మెయిల్ సైతం యాక్సెస్ చేసుకునే విధంగా ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 19న పీఎన్‌బీ చర్యలు చేపట్టినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. అయితే, దీనిపై పీఎన్‌బీ స్పందిస్తూ.. సర్వర్‌లో లోపం ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అందులో ఎలాంటి సున్నితమై, క్లిష్టమైన డేటా లేదని పేర్కొంది. ఆన్-ప్రిమ్ నుంచి ఆఫీస్ 365 క్లౌడ్‌లోకి ఈ-మెయిల్స్‌ను రూట్ చేయడానికి మాత్రమే ఆ సర్వర్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపింది. సైబర్ ఎక్స్9 చెప్పినట్లుగా ఖాతాదారులకు సంబంధించిన డేటా ఏదీ బయటకు రాలేదని చెప్పింది. ఎప్పటికప్పుడు సిఇఆర్‌టి-ఇన్ ఎంప్యానెల్డ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్లు తనిఖీ చేస్తూనే ఉన్నారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment