![Big Corporates Pave the Path Embracing AI and Cybersecurity for Success](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/ai.jpg.webp?itok=t3j0x419)
లాభాలను మెరుగుపరచుకోవడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్, సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్ వంటి నూతన తరం సాంకేతికతను వినియోగించడంలో పెద్ద కార్పొరేట్‌లు ముందుంటాయని సీపీఏ ఆస్ట్రేలియా నివేదిక వివరించింది.
‘కొత్త సాంకేతికతలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. వీటి వినియోగం వల్ల కంపెనీలకు సైబర్ భద్రత, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో, ఉద్యోగుల నైపుణ్యాలు, సంతృప్తిని పెంపొందించడంలో దోహదం చేస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడంలో సాయపడుతుంది.
ఉద్గారాల పర్యవేక్షణ, సరఫరా వ్యవస్థ పారదర్శకతను మెరుగుపరచడానికి, వాటాదారులతో సమర్థవంతంగా నిమగ్న మవ్వడానికి సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడంపై కంపెనీలు దృష్టి పెట్టాలి. ఇది కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా అభివృద్ధి చెందుతున్న నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రమాణాలను పాటించేందుకు కూడా సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment