big companies
-
స్టార్టప్‌లతో బడా కార్పొరేట్లు కలిసి పని చేయాలి
న్యూఢిల్లీ: వ్యాపార సవాళ్లు, ఇతర సమస్యలను పరిష్కరించుకునేందుకు పెద్ద కార్పొరేట్ సంస్థలు, అంకుర సంస్థలతో కలిసి పని చేయాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా సూచించారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు వృద్ధిలోకి వచ్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు.ఇందుకోసం ఇప్పటికే పలు పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయని, అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయని చెప్పారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన పదో ఏట.. మరిన్ని అంకుర సంస్థలతో కలిసి పని చేసేలా కంపెనీలను ప్రోత్సహించే అవకాశం ఉందని భాటియా చెప్పారు. కొన్ని పనులను స్టార్టప్‌లకు ఔట్‌సోర్స్ చేయడం, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు వాటితో కలిసి పనిచేయడం, మెంటార్షిప్ ద్వారా సహాయపడటం, ల్యాబ్‌లు.. టెస్టింగ్ కేంద్రాలకు యాక్సెస్ ఇవ్వడం తదితర మార్గాల్లో ఇది ఉండొచ్చని పేర్కొన్నారు. మరోవైపు, విదేశాల నుండి భారత్‌కి తమ ప్రధాన కార్యాలయాలను మార్చుకోవాలనుకునే స్టార్టప్‌ల కోసం సదరు ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారాల శాఖ వేగవంతం చేసినట్లు భాటియా చెప్పారు. అంకుర సంస్థలకు ప్రోత్సాహమిచ్చేందుకు 2016 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దీని కింద, వివిధ దశల్లోని అంకుర సంస్థల కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ అనే మూడు స్కీములను అమలు చేస్తోంది. 1.5 లక్షల స్టార్టప్‌లను డీపీఐఐటీ గుర్తించింది. -
సీమాంధ్రపై దృష్టి పెట్టిన బడా కంపెనీలు
-
పెద్ద కంపెనీల్లోనే మహిళకు చోటు!
వాషింగ్టన్: అరుంధతీ భట్టాచార్య, ఉషా అనంతసుబ్రమణియన్, చందాకొచ్చర్, శిఖా శర్మ, కల్పనా మోర్పారియా, విజయలక్ష్మీ అయ్యర్, సుభలక్ష్మీ పన్సే, అర్చనా భార్గవ... వీళ్లంతా ఎవరనుకుంటున్నారా? ఎస్బీఐ, మహిళా బ్యాంకు, ఐసీఐసీఐ సహా భారతీయ బ్యాంకుల్ని నడిపిస్తున్న మహిళలు. బ్యాంకులే కాదు. మల్లికా శ్రీనివాసన్, వినీతా బాలి, శోభనా భర్తియా, కిరణ్ షా వంటి మహిళలు ట్రాక్టర్ల నుంచి ఫార్మా రీసెర్చ్ కంపెనీలను కూడా నడిపేస్తున్నారు. కానీ బ్యాంకులతో పోలిస్తే మహిళా అధిపతులున్న ఇతర కంపెనీల సంఖ్య తక్కువే. ఈ ట్రెండ్ ఇక్కడే కాదు. అంతర్జాతీయంగానూ ఇపుడు ఊపందుకుంటోంది. జనరల్ మోటార్స్ సంస్థ తన కొత్త సీఈఓగా మేరీ బర్రాను నియమించింది. ట్విటర్ డెరైక్టర్ల బోర్డులోకి మార్జొరీ స్కార్డినో ప్రవేశించారు. ఈ మారుతున్న పరిణామాలపై ‘బ్లూమ్‌బర్గ్’ సంస్థ ఓ అధ్యయనం చేసి తేల్చిందేంటంటే... మహిళల్ని తమ అధిపతులుగాను, డెరైక్టర్లుగాను నియమిస్తున్న కంపెనీల్లో చిన్నవాటికన్నా పెద్దవే ఎక్కువని. మొత్తమ్మీద చూసినపుడు జీతభత్యాలు, ప్రాతినిధ్యంలో మగవారితో పోలిస్తే మహిళల పాత్ర చాలా తక్కువ. కాకపోతే ఈ పరిస్థితిని మార్చడంలో పెద్ద కంపెనీలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలియజేసింది. డెరైక్టర్ల సీట్లలో ఈ రకమైన విభజన రావడానికి కారణమేంటి? ‘‘పెద్ద కంపెనీల్లో కార్పొరేట్ పాలనపై పరిశీలన ఉంటుంది. ఇన్వెస్టర్ల ఒత్తిడితో పాటు రెప్యుటేషన్ గురించి అవి ఆలోచిస్తుంటాయి. అందుకే అవి మహిళలకు కాస్త ఎక్కువ చోటిస్తున్నాయి’’ అనేది షేర్‌హోల్డర్ ప్రాక్సీ సంస్థ గ్లాస్ లూయిస్ అధిపతి కోట్నీ అభిప్రాయం. ఈమె బోర్డుల్లో లింగ వైవిధ్యంపై పుస్తకం కూడా రాశారు. చిన్న కంపెనీలకు తక్కువ ప్రమాణాలుంటాయని, కార్పొరేట్ పాలన కూడా తక్కువని చెప్పారామె.