ముంబై: సైబర్ సెక్యూరిటీ నిపుణుల లభ్యత పరిమిత స్థాయిలోనే ఉండటమనేది భవిష్యత్తులో ’పెద్ద సవాలు’గా పరిణమించవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. మొత్తం వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకు సైబర్‌సెక్యూరిటీపై పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయని వార్షిక బ్యాంకింగ్ సదస్సు ఫిబాక్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.
ప్రతి రోజు దాదాపు 1 లక్ష సైబర్ దాడులను ఎదుర్కొంటున్నామని హెచ్‌ఎస్‌బీసీ కంట్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హితేంద్ర దవే ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, డిపాజిట్లు నెమ్మదించిన నేపథ్యంలో మార్కెటింగ్‌పై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఎస్‌బీఐ ఎండీ అశ్విని తివారీ తెలిపారు. స్టార్టప్‌లు, చిన్న.. మధ్య తరహా సంస్థలకు మరింతగా తోడ్పాటు అందించడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment