ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక: ఆ లింక్ క్లిక్ చేశారో.. | Govt Alerts SBI Customers About New SBI Net Banking Reward Scam | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక: ఆ లింక్ క్లిక్ చేశారో..

Published Mon, Nov 4 2024 9:07 PM | Last Updated on Mon, Nov 4 2024 9:12 PM

Govt Alerts SBI Customers About New SBI Net Banking Reward Scam

టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB).. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది.

స్కామర్లు మోసపూరిత సందేశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్‌బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్‌లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌ను పీబీఐ షేర్ చేస్తూ.. వినియోగదారులు ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. అనుచిత లింకుల మీద క్లిక్ చేయడం, యాప్స్ డౌన్‌లోడ్ చేయడం వంటివి చేయకూడదని పేర్కొంది.

గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే బ్యాంక్ సంబంధిత యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎస్‌బీఐ వెల్లడించింది. ఇన్‌స్టాలేషన్‌ చేయడానికి ముందే దాని గురించి తెలుసుకోవాలని పేర్కొంది. నిజంగానే ఎస్‌బీఐ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసుకోవడానికి కస్టమర్లు అధికారిక రివార్డ్ వెబ్‌సైట్ సందర్సించాల్సి ఉంటుంది. లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి.

స్కామర్లు పంపించిన మెసేజ్‌లను నిజమని నమ్మి.. లింక్ మీద క్లిక్ చేస్తే తప్పకుండా మోసపోతారు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు చాలామంది బలైపోయారు. కాబట్టి వినియోగదారులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.

ఇదీ చదవండి: సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్‌సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..

సైబర్ నేరాలను తగ్గించడంలో ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైబర్ నేరాలను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పనిచేస్తోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆటోమాటిక్ వార్ణింగ్ సిస్టం రూపొందిస్తోంది. దీని సాయంతో అనుమానాస్పద లింకులు వచినప్పుడు యూజర్లను అలెర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ జాగ్రత్త పడవచ్చు. అయితే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement