Microsoft Windows operating systems...
-
క్రౌడ్‌స్ట్రైక్ అతలాకుతలం
వాషింగ్టన్: ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం సాంకేతిక సమస్య ఆర్థికంగా కూడా అంతర్జాతీయంగా గట్టి ప్రభావమే చూపింది. పలు దిగ్గజ సంస్థల షేర్ల విలువ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా తప్పుడు అప్డేట్తో సమస్యకు కారణమైన సైబర్ సెక్యూరిటీ దిగ్గజం క్రౌడ్‌స్ట్రైక్‌కు ఆర్థికంగా గట్టి దెబ్బే తగిలింది. శుక్రవారం ఆ సంస్థ షేర్ వాల్యూ ఒక్కసారిగా 11 శాతానికి పైగా పడిపోయింది. 42.22 డాలర్లున్న ఒక్కో వాటా విలువ 30 డాలర్లకు తగ్గింది. సంస్థ మొత్తం విలువ 83 బిలియన్ డాలర్ల పై చిలుకని అంచనా. ఆ లెక్కన 900 కోట్ల డాలర్లకు పైగా హరించుకుపోయినట్టే. అయితే ఆర్థిక నష్టం కంటే కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైబర్ సెక్యూరిటీ సంస్థగా క్రౌడ్‌స్ట్రైక్‌కు ఉన్న ఇమేజీకి జరిగిన నష్టమే చాలా ఎక్కువ. ఎందుకంటే దాని కస్టమర్లుగా ఉన్న కంపెనీలు, పెద్ద సంస్థల్లో చాలావరకు తమ సైబర్ సెక్యూరిటీ బాధ్యతల కోసం ఇతర సైబర్ సెక్యూరిటీ సంస్థలవైపు చూస్తున్నట్టు సమాచారం. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ ఇప్పటికే ఈ జాబితాలో చేరారు. ‘‘మా వ్యవస్థల నుంచి క్రౌడ్స్ట్రౌక్ను తొలగించేశాం’’ అంటూ ఆయన సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు. సెంటినల్ వన్, పాలో ఆల్టో నెట్వర్క్ వంటి క్రౌడ్ర్స్టౌక్ ప్రత్యర్థి కంపెనీలు ఈ పరిస్థితిని రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్నాయి. భారీ పరిహారాలు! మరోవైపు క్రౌడ్‌స్ట్రైక్ కస్టమర్లంతా తమకు జరిగిన నష్టానికి ఆ సంస్థ నుంచి భారీగా నష్టపరిహారం డిమాండ్ చేసేలా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు ఆ సంస్థ క్లయింట్ల జాబితాలో ఉండటం తెలిసిందే. షట్‌డౌన్ దెబ్బకు వాటి షేర్ల విలువ సగటున ఒక శాతం దాకా పడిపోయినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
Microsoft outage: బగ్‌తో పరిహాసమా?!
బ్రస్సెల్స్: మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బగ్ వల్ల బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ సమస్య తలెత్తడంతో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత సేవలు నిలిచిపోయాయి. కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. సైబర్‌సెక్యూరిటీ సంస్థ క్రౌడ్స్రై్టక్ అందించిన అప్డేట్లో బగ్ వల్లే ఈ సంక్షోభం ఏర్పడింది. ఇది చాలా తీవ్రమైన విషయం కాగా, బెల్జియం వ్యంగ్య రచయిత విన్సెంట్ ఫ్లిబస్టీర్ పరిహాసానికి దిగాడు. నెటిజన్లతో చీవాట్లు తింటున్నాడు. తాను క్రౌడ్స్రై్టక్ సంస్థలో కొత్తగా ఉద్యోగంలో చేరానని, మొదటి రోజు సాఫ్ట్‌వేర్‌లో చిన్న ఆప్డేట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ‘ఎక్స్’లో పలు పోస్టులు పెట్టాడు. కోడ్‌లో కేవలం ఒక లైన్ మార్చడం వల్ల బగ్ ఏర్పడిందని తెలిపాడు. క్రౌడ్‌స్ట్రైక్ ఆఫీసులో దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు. నిజానికి అతడు ఈ సంస్థలో ఉద్యోగి కాదు. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ఈ ఫొటో సృష్టించాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ మారింది. 3.8 లక్షల లైక్‌లు వచ్చాయి. 37,000 మంది షేర్ చేశారు. కొన్ని గంటల తర్వాత విన్సెంట్ మరో పోస్టు చేశాడు. సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ కారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని బాధపడ్డాడు. ఇది చాలా అన్యాయం అంటూ ఆక్రోశించాడు. తనకు ఎవరైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని దీనంగా వేడుకున్నాడు. ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్‌్కను సైతం కోరాడు. తాను బాధపడుతున్న వీడియోను పంచుకున్నాడు. నెటిజన్లు చాలామంది ఇదంతా నిజమేనని నమ్మేశారు. కానీ, నిజం దాగదు కదా! వాస్తవం ఏమిటో తెలిసిపోయింది. పిచి్చవేషాలు మానుకోవాలంటూ విన్సెంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. విన్సెంట్ నార్డ్ప్రెస్ అనే బెల్జియన్ పేరడీ న్యూస్ సైట్‌కు వార్తలు రాస్తుంటాడు. -
Microsoft: బగ్ దెబ్బకు ‘విండోస్’ క్లోజ్!
వాషింగ్టన్/వెల్లింగ్టన్/న్యూఢిల్లీ/ఫ్రాంక్ఫర్ట్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక చిన్న అప్డేట్ పేద్ద సమస్యను సృష్టించింది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సరీ్వసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్ దాడి కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తప్పుడు అప్డేట్ను రన్ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్’ చేసేందుకు ప్రయతి్నస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ఆగిన సేవలు.. మొదలైన కష్టాలు విమానయాన సంస్థలు తమ కంప్యూటర్లు/పీసీ స్క్రీన్లను యాక్సెస్ చేయలేకపోవడంతో ప్రయాణికులు తమ టికెట్ల బుకింగ్/చెక్ ఇన్ సేవలను పొందలేకపోయారు. విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు కౌంటర్ల వద్ద చాంతాడంత లైన్లలో బారులుతీరారు. అమెరికా, భారత్, బ్రిటన్, న్యూజిలాండ్, హాంకాంగ్, జర్మనీ, కెన్యా, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆ్రస్టేలియాలోని విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శుక్రవారం గంటల తరబడి విమానాలు ఆలస్యం/క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే నిద్రించారు. అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా, అలీజియంట్ విమానయాన సంస్థలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. వారాంతం ఆనందంగా గడుపుదామనుకున్న శుక్రవారం పలు దేశాల ప్రజలను చేదు అనుభవంగా మిగిలిపోయింది. భారత్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల విమానయాన సంస్థలు మ్యాన్యువల్‌గా బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి సమస్యను ఒకింత పరిష్కరించుకున్నాయి. రైల్వే, టెలివిజన్ సేవలకూ అంతరాయం బ్రిటన్‌లో రైల్వే, టెలివిజన్ స్టేషన్లూ కంప్యూటర్ సమస్యలతో ఇబ్బందులు పడ్డాయి. తమ దేశంలోని పోస్టాఫీసులు, ఆస్పత్రుల సేవలు ఆగిపోయాయని ఇజ్రాయెల్, బ్రిటన్, జర్మనీ తెలిపాయి. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లోని రెగ్యులేటరీ న్యూస్ సర్వీస్ అనౌన్స్మెంట్స్, నేషనల్ హెల్త్ సర్వీస్‌లు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయాయని బ్రిటన్ ప్రకటించింది. ఆ్రస్టేలియాలో ఏబీసీ, స్కైన్యూస్ వంటి టీవీ, రేడియా చానళ్ల ప్రసారాలు ఆగిపోయాయి. బ్యాంకింగ్ సేవలకూ దెబ్బ తమ దేశంలో దేశవ్యాప్తంగా ప్రధాన బ్యాంక్ సేవలు స్తంభించిపోయాయని దక్షిణాఫ్రికా తెలిపింది. బ్యాంక్‌ల వద్దే కాదు, గ్యాస్‌స్టేషన్లు, సరకుల దుకాణాల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు పనిచేయడం మానేశాయి. ఏఎస్‌బీ, కివిబ్యాంక్ సేవలు ఆగిపోయాయని న్యూజిలాండ్ తెలిపింది. పేమెంట్ వ్యవస్థలు, వెబ్సైట్లు, యాప్స్ పనిచేయడం లేదని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తెలిపాయి. భారత్‌లో పరిస్థితి ఏంటి? భారత్‌లో ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్టారా, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలు ఆన్లైన్ చెక్ ఇన్ సమస్యలను ఎదుర్కొన్నాయి. చాలా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద పలు విమానాల సరీ్వస్‌లు రద్దయ్యాయి. దాదాపు 200 ఇండిగో విమానసరీ్వస్లు రద్దయ్యాయి. ఆఫ్‌లైన్‌లో మ్యాన్యువల్‌గా లగేజ్ ‘చెక్ ఇన్’, బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి సమస్యను పరిష్కరించారు. లగేజీ చెక్ చేసి బోర్డింగ్ పాస్ రాసివ్వడానికి ఒక్కో వ్యక్తికి 40 నిమిషాలు పట్టిందని కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 29 విమానాలు రద్దయ్యాయి.ఇందులో ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొల్‌కత్తాతో పాటు వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలూ ఉన్నాయి. కొన్ని విమానాలు 1–2 గంటలు ఆలస్యంగా నడిచాయి. విమానాల రద్దయినప్పటికి విమాయనయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రకటనలు చేయకపోవడంతో ప్రయాణికులు వెనుదిరిగారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వంటి స్టాక్ఎక్సే్ఛంజ్లు, బ్రోకరేజ్ సంస్థలు, బ్యాంక్‌ల వంటి ఆర్థికరంగ సంస్థల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. దేశంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) నెట్‌వర్క్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని కేంద్ర ఐటీ మంత్రి ప్రకటించారు. పేలిన జోకులు కంప్యూటర్లు మొరాయించడంపై సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలాయి. శుక్రవారం ఉదయం నుంచే ఐటీ ఉద్యోగులకు వారాంతం మొదలైందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మైక్రోసాఫ్ట్ సంస్థ పెద్ద తలనొప్పి సంస్థ అంటూ కొత్త భాష్యం చెప్పారు. ‘‘ ఇది మైక్రో‘సాఫ్ట్’ కాదు. మాక్రో‘హార్డ్. మైక్రోసాఫ్ట్ వాళ్ల అన్ని సర్వీస్‌లు ఆగిపోయాయి ఒక్క నా ‘ఎక్స్’ తప్ప’ అని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పోస్ట్‌చేశారు.ఏమిటీ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్?:కంప్యూటర్లపై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచి్చంది. ఈ ఎర్రర్ కనిపించాక కంప్యూటర్ రీస్టార్ట్ అవడంగానీ షట్‌డౌన్ అవడంగానీ జరుగుతోంది. విండోస్ అప్డేట్ అడిగితే చేయొద్దని, పొరపాటున చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్‌ను తొలగించి మళ్లీ ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాకే కంప్యూటర్లను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ ఉల్లంఘనలు, హ్యాకింగ్‌ను రియల్‌టైమ్‌లో అడ్డుకునేందుకు క్రౌడ్‌స్ట్రయిక్ సంస్థ తమ సైబర్‌సెక్యూరిటీ సేవలను మైక్రోసాఫ్ట్‌కు ఇస్తోంది. సొంతంగా మ్యాన్యువల్‌గా సమస్య పరిష్కారానికి ప్రయతి్నంచేవాళ్లకు క్రౌడ్‌స్ట్రయిక్ ఒక చిట్కా చెప్పింది. విండోస్10లో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలో వివరింది. సిస్టమ్‌ను సేఫ్ మోడ్‌లో లేదా విండోస్ రికవరీ ఎన్విరోన్మెంట్లో ఓపెన్ చేయాలి. తర్వాత C:/W indowsystem32/d rivers/C rowdStrike లోకి వెళ్లాలి. అందులోC-00000291·. sys అనే ఫైల్‌ను డిలీట్ చేయాలి. తర్వాత సాధారణంగా సిస్టమ్‌ను బూట్ చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. -
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. విండోస్ సాయంతో
ప్రపంచ దేశాలకు చెందిన రహస్యాల్ని దొంగిలించేందుకు రోజుకో స్పై వైరస్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ తమ ఆపరేటింగ్ సిస్టమ్స్ సాయంతో రెండు స్పై వైరస్లు (డెవిల్స్ టంగ్ అని పిలిచే ) దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. 10 దేశాలకు చెందిన 100 మంది యాక్టివిస్ట్‌లు, జర్నలిస్ట్‌లు, ప్రభుత్వంపై అసమ్మతివాదులపై సైతం ఈ స్పైవేర్ దాడి జరిగిందని సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ టోరంటో సిటిజన్ ల్యాబ్ తెలిపింది. ఇజ్రాయిల్ కు చెందిన 'కాండిరు' అనే సంస్థ తయారు చేసిన ఈ స్పైవేర్ టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, హంగేరీ, ఇండోనేషియాతో పాటు ఇతర దేశాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ విండోస్ల సాయంతో ఇన్ స్టాల్ చేశారని, ఇన్ స్టాల్ చేసిన అనంతరం దాడులకు సిద్ధపడినట్లు మైక్రోసాఫ్ట్ డిజిటల్ సెక్యూరిటీ యూనిట విభాగానికి చెందిన జనరల్ మేనేజర్ క్రిస్టిన్ గుడ్విన్ తెలిపారు. సిటిజెన్ ల్యాబ్ పరిశోధకులు స్పైవేర్ దాడుల గురించి చెప్పడంతో మైక్రోసాఫ్ట్ అప్రమత్తమైంది. ఈ దాడుల గురించి 'కాండిరు' పేరు ప్రస్తావించకుండా ఇజ్రాయిల్ కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ స్పై వైరస్‌తో దాడిచేసిందని ప్రస్తావించింది. సిటిజెన్ ల్యాబ్ ప్రకారం..ప్రపంచ దేశాల్ని టెక్నాలజీ పరంగా భయబ్రాంతులకు గురిచేసేందుకు కాండిరు ఈ స్పైవేర్లు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 16 మిలియన్ యూరోల ($ 18.9 మిలియన్లు) కు కాండిరు తన క్లయింట్లకు ఒకే సారి 10టార్గెట్లను ట్రాక్ చేసేందుకు ఇచ్చినట్లు, అదనంగా 1.5 మిలియన్ యూరో (8 1.8 మిలియన్) చెల్లిస్తే మరో 15 టార్గెట్లను ట్రాక్ చేసేందుకు వీలుపడుతున్నట్లు తేలింది. ఇక కాండిరుకు యూరప్, రష్యా, మిడిల్ ఈస్ట్, ఆసియా, లాటిన్ అమెరికాలో క్లయింట్లు ఉన్నారని ఇజ్రాయెల్ వార్తాపత్రిక హారెట్జ్ తెలిపింది. ఇజ్రాయిల్‌కు చెందిన స్థానిక మీడియా సంస్థలు కాండియా ఉజ్బెకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఖతార్ దేశాలతో ఒప్పందాలు కుదర్చుకున్నట్లు వెల్లడించింది. కాండిరు తన క్లయింట్లకు 'అంగీకరించిన భూభాగాలలో' మాత్రమే పనిచేయడానికి పరిమితం చేసుకుంది. అయితే యు.ఎస్, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇరాన్ వెలుపల కార్యకలాపాలను పరిమితం చేసే ఒప్పందాలపై సంతకం చేసినట్లు, మైక్రోసాఫ్ట్ ఇటీవలే ఇరాన్ స్పైవేర్ తన కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. -
విండోస్ 10 వండర్స్...
మేకింగ్‌లో ఉన్న భారీ బడ్జెట్ సినిమా మీద జనాల్లో ఎంత ఆసక్తి ఉంటోందో.. మైక్రోసాఫ్ట్ రూపొందిస్తున్న విండోస్ 10 మీద కూడా నెటిజనుల్లో అంతే ఆసక్తి కనిపిస్తోంది. విడుదలకు ముందే సినిమాకు సంబంధించిన టీజర్లు లీక్ అయినట్టుగా విండోస్ 10 ఫీచర్ల విషయంలో కూడా రకరకాల వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ మానసపుత్రిక అలా ఉండబోతోంది.. ఇలా ఉండబోతోంది.. మీ డెస్క్‌టాప్‌ల, స్మార్ట్ఫోన్ల లుక్‌నే మార్చబోతోంది అంటూ.. వార్తలు వస్తున్నాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఎన్ని మార్పులు తీసుకు వచ్చినా.. అన్నింటిలోనూ కొనసాగిన డీఫాల్ట్ వెబ్‌బ్రౌజర్ స్థానంలో కొత్త బ్రౌజర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నదట మైక్రోసాఫ్ట్. మేకింగ్ నేపథ్యంలో దీన్ని ‘స్పార్టన్’గా వ్యవహరిస్తున్నారట. విండోస్ఎక్స్ప్లోరర్ను అరుదైన సందర్భాల్లో తప్ప వినియోగించం. మొజిల్లా, గూగుల్ క్రోమ్బ్రౌజర్లనే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ సరికొత్త స్పార్టన్ మాత్రం ఉత్సవవిగ్రహంలా కాకుండా... విస్తృతంగా వాడుకోవడానికి అనుగుణంగా ఉంటుందట. ఇది మొజిల్లా, క్రోమ్లకు దీటుగా ఉంటుందని లీకువీరులు చెబుతున్నారు. విండోస్ 10పై విండోస్ ఎక్స్‌ప్లోరర్ వెబ్‌బ్రౌజర్ పూర్తిగా కనుమరుగు కానుంది. ఇదే ఈ కొత్త ఓఎస్ గురించి చెప్పుకోదగ్గ ప్రముఖమైన అంశం. స్టోర్ కూడా ఓపెన్చేస్తున్నారు! విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచే డివైజ్‌ల కోసం కొత్తగా ఒక అప్లికేషన్ స్టోర్‌ను రూపొందించనున్నారట. ఆండ్రాయిడ్‌కు ఆప్స్టోర్లాగా, ఐ ఆపరేటింగ్ సిస్టమ్ డివైజ్‌లు వాడే వారి కోసం రూపొందించిన ఐ స్టోర్లాగా.. ఈ నవ్యమైన విండోస్ ఓఎస్‌ను వాడే వారి కోసం ఈ స్టోర్ఉంటుందని తెలుస్తోంది. దీంట్లో మైక్రోసాఫ్ట్ విండోస్సేవలన్నీ అప్లికేషన్ల రూపంలో అందుబాటులో ఉంటాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్స్‌బాక్స్.. వినోదభరితమైన సేవలను అందించడానికి ఈ అప్లికేషన్ ఇందులో గేమ్ అప్లికేషన్లు, ఇతర సోషల్‌మీడియా సేవలకు సంబంధించిన అప్లికేషన్లుంటాయి. ఇది విండోస్ అపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకు అద్వితీయమైన అనుభవాన్ని ఇస్తుందని.. గొప్ప ఎంటర్టైన్గా ఉంటుందని రూపకర్తలే చెబుతున్నారు. గేమింగ్ విషయంలో కొత్త యుగానికి ఇది ఆరంభంగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్ ప్రకటించుకొంటోంది. ఈ ఎక్స్‌బాక్స్ గురించి పూర్తి వివరాలు తెలిస్తే కానీ ఆ యుగం ఎలా ఉంటుందో చెప్పలేం! విండోస్10 ఫీచర్ల విషయంలో మైక్రోసాఫ్ట్ ఎంతో గోప్యత పాటిస్తున్నా ఇలాంటి విషయాలు అయితే బయటపడిపోతున్నాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్ల, స్మార్ట్ఫోన్ల వినియోగపు అనుభవాన్నే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మార్చేస్తుందని అంటూ మైక్రోసాఫ్ట్ ఊరిస్తున్న తరుణంలో ఇలాంటి లీకులు మరింత ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే డెస్క్‌టాప్‌ల విషయంలో విండోస్ ఓఎస్‌లను చాంపియన్లుగా నిలిచినా.. స్మార్ట్ఫోన్ల విషయంలో అప్లికేషన్ల లేమి కనిపిస్తుంది. మరి అలాంటి పరిస్థితిని ప్రతిష్టాత్మక విండోస్ 10 ఏ విధంగా మార్చేస్తుందో... వినియోగదారులను ఎలా అలరిస్తుందో ఈ ఓఎస్పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కానీ అర్థం కాదు.